breaking news
review on
-
సమన్వయంతో సత్ఫలితాలు సాధిద్దాం
కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష కాకినాడ సిటీ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ సూచించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఆర్డీఏ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, అటవీశాఖ, పశుసంవర్ధకశాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణాలు పూర్తిచేయడానికి రూ.ఆరు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రాం కింద చేపట్టిన పనుల వివరాలు సమర్పించాలని పీడీ డ్వామాను ఆదేశించారు. జిల్లాలోని చిన్నతరహా నీటిపారుదల చెరువుల్లో చేపపిల్లలు పెంచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కాప్టివ్ నర్సరీల పథకాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ విధంగా మెట్ట ప్రాంతాల్లో పది యూనిట్లు నెలకొల్పుతామన్నారు. ఒక్కొక్కటి రూ.11 లక్షల వ్యయం కాగల ఈ యూనిట్లను ఉపాధి హామీ, మత్స్యశాఖలు అమలు చేస్తాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య వారోత్సవం గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య వారోత్సవాలు చేపట్టాలని, డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సీపీఓ మోహనరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కె.చంద్రయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, జేడీఏ ప్రసాద్ పాల్గొన్నారు. -
కేటాయించిన లక్ష్యాన్ని సాధించాలి
హరితహారం సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో హరితహారంపై వ్యవసాయం, అటవీ, ఎక్సైజ్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖలకు ఎన్ని మొక్కలు నాటాలో ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు అధికారులందరూ సమన్వయంతో కషి చేయాలన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగువందల మొక్కలకు ఒక వన సేవకుడి నియమించనున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణ, వాటి తీరుతెన్నుల వివరాలను తెలుసుకునేందుకు ప్రతినెలా నివేదికలను అందజేయాలన్నారు. ఎన్నెస్పీ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా అభివద్ధి చేసిన చెరువుగట్లపై ఈతచెట్లు పెంచేందుకు గాను జిల్లాలకు ఏడు లక్షల విత్తనాలను ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలిపారు. ప్రజలు గహాలలో పండ్లమొక్కలను వేసుకోవడానికి, వారు కోరిన వాటిని పంపిణీ చేయాలన్నారు. అటవీ భూముల్లో సామాజిక వనవిభాగం ద్వారా మొక్కలను నాటాలన్నారు. ఈ సమావేశంలో జేసీ దేవరాజన్‌దివ్య, అటవీశాఖ అధికారి నర్సయ్య, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ మణిమాల, ఎక్సైజ్ డీసీ మహేష్, ఇరిగేషన్ ఎస్ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.