breaking news
resignation to chief minister post
-
రాజ్యసభ బాటలో నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? జేడీ(యూ) సారథి నితీశ్ శకానికి తెర పడనుందా? ఏకంగా పదిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సృష్టించిన ఆయన గద్దె దిగనున్నారా? సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికై హస్తిన వెళ్లనున్నారా? ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి అప్పగించి, బదులుగా తన కుమారున్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూచోబెట్టనున్నారా? ఈ మేరకు వెలువడుతున్న వార్తలు, ఊహాగానాలు సంచలనం రేపుతున్నాయి. నితీశ్‌కుమార్ రాజకీయ వారసునిగా ఆయన తనయుడు నిశాంత్ కుమార్ పేరు కొంతకాలంగా తెరపైకి వస్తోంది. నిశాంత్ త్వరలో రాజకీయ తీర్థం పుచ్చుకుంటారని జేడీ(యూ) నేత, రాష్ట్ర మంత్రి శ్రవణ్‌కుమార్ మంగళవారమే ప్రకటించారు కూడా. ఆయన్ను ఎన్డీఏ తరఫున రాజ్యసభకు పంపనున్నట్టు ఆ వెంటనే వార్తలొచ్చాయి. కానీ బుధవారం ఉదయానికల్లా పరిస్థితి మారిపోయింది. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నితీశ్ నిర్ణయించుకున్నట్టు మీడియా సంస్థల్లో వరుస కథనాలు మొదలయ్యాయి. కుమారుని రాజకీయ భవితవ్యం కోసమే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అవి చెప్పుకొచ్చాయి. సీఎం పదవిని బీజేపీకి అప్పగించేలా, బదులుగా నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని పేర్కొన్నాయి. రాజ్యసభకు వెళ్లే అంశాన్ని నితీశ్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ చౌధురి స్పష్టం చేశారు. నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి కూడా రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11.30కు నితీశ్ అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు జేడీ(యూ) నేతలను ఉటంకిస్తూ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.] బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా బిహార్ నుంచే రాజ్యసభ బరిలో దిగుతుండటం తెలిసిందే. ‘‘నబీన్‌తో పాటుగా నితీశ్ కూడా నామినేషన్ వేయనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది’’అని వివరించాయి. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, అంటే మార్చి 16 అనంతరం సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేయొచ్చని తెలిపాయి. బుధవారం పట్నాలో నెలకొన్న రాజకీయ హడావుడి కూడా ఈ దిశగా పలు సంకేతాలిచి్చంది. జేడీ(యూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా హుటాహుటిన ఢిల్లీ నుంచి పట్నా చేరుకుని నితీశ్‌తో మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. బీజేపీ నుంచి సీఎం పదవి చేపట్టేది ఎవరన్న చర్చ కూడా ఇప్పటికే జోరందుకుంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలతో ఘనవిజయం సాధించడం తెలిసిందే. బీజేపీకి 89 స్థానాలు రాగా భాగస్వామ్య పక్షాలైన జేడీ(యూ) 85, లోక్ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) 19 స్థానాలు నెగ్గాయి. సంఖ్యా బలం రీత్యా బిహార్‌లో ఎన్డీఏ కూటమికి నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కడం ఖాయం. వాటిలో బీజేపీ తన రెండు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. జేడీ(యూ) ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోకున్నా కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్‌ను మరోసారి కొనసాగించడం ఖాయమైంది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరి తేదీ. -
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
-
రాజ్‌భవన్‌లో గవర్నర్ పురోహిత్‌ను కలిసిన చన్నీ
-
వెళ్తూ వెళ్తూ దాదాపు 14 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన కర్ణాటక మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇదివరకే రాజీనామా చేసిన యడియూరప్ప… వెళ్తు వెళ్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాజీనామాకు కొద్ది గంటల ముందు ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా 21.50కు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యడ్డీ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్‌యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిలని నియమించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రేపేమాపో కర్ణాటక కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. -
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!
న్యూఢిల్లీ/గువాహటి: సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడంతో నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు మద్దతుగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జెలియాంగ్ ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఎన్పీఎఫ్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారని తెలిపారు. నాగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ఎన్పీఎఫ్ సభ్యులంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్ గిరిజన యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్ధమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్ గతకొన్నిరోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా గిరిజన గ్రూపులకు మద్దతు పలుకడంతో టీఆర్ జెలియాంగ్ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు.


