breaking news
research assistant
-
రెక్కలు లేని ఫ్యాన్.. అంతేనా అదిరిపోయే మరో స్పెషాలిటీ కూడా..
రెక్కల్లేని మొండి ఫ్యాను చక్కనిదెలా అవుతుందనేగా మీ డౌటు? ఇది చూడచక్కనిది అవునో, కాదో ఈ ఫొటో చూసి మీరే తేల్చుకోవాలి గానీ, దీని పనితీరు మాత్రం చక్కగానే ఉంటుంది. పనులు చేసుకునే డెస్క్ మీద, లేదా ఏదైనా టేబుల్ మీద సులువుగా ఇమిడిపోయే ఈ ఫ్యాన్ భేషుగ్గా మనం కోరుకున్న రీతిలో గాలి వీస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, చల్లనిగాలులు వీస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే వెచ్చనిగాలులు వీస్తుంది. దాదాపుగా ఎయిర్‌కండిషనర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ రెక్కల్లేని ఫ్యాను. దీనిని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ రీసెర్చ్ అసిస్టెంట్ సోయంగ్ ఏన్ రూపొందించారు. ‘ఫ్లోడెస్క్ ఫ్యాన్’ పేరిట తయారు చేసిన ఈ ఫ్యాన్ గది వాతావరణానికి అనువుగా గాలులు వీచడమే కాదు, గాలిలోని దుమ్ము ధూళికణాలను పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. -
గర్భవతికి విడాకులు ఇస్తానన్న సాఫ్ట్ వేర్ భర్త!
న్యూఢిల్లీ: నల్లగా ఉందన్న వంకతో.. గర్భవతి అయిన తన భార్య నుంచి విడాకులు కావాలంటూ ఆమెకే ఈమెయిల్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతగాడి వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంషెడ్‌పూర్‌కు చెందిన యువతి(26) నోయిడాలోని ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమెకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్(35) తో ఈ ఏడాది మొదట్లో పెళ్లయింది. పెళ్లయిన రోజు నుంచే నల్లగా ఉన్నావంటూ తనను తిట్టేవాడని ఆమె తెలిపింది. తాను గర్భవతినని భర్తకు ఈనెల 5న భర్తకు చెప్పింది. నాలుగు రోజుల తర్వాత.. ఇక కాపురం చేయలేనని, విడాకులు కావాలని అతడు భార్యకు ఈమెయిల్ చేశాడు. దాంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ యువతి.. మంగళవారం తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తొలుత మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి,ఆ అక్కడ తన ఫిర్యాదు తిరస్కరించడంతో వేరే స్టేషన్‌కు వచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను శారీరకంగా వేధించేవాడని, పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను భర్త కుటుంబీకులు చూశారని, వాళ్లకు ఇష్టం లేకపోతే తనతో పెళ్లికి ఎందుకు ఒప్పుకొన్నారని ప్రశ్నిస్తోంది. జంషేడ్ పూర్లో పెళ్లి జరిగిన తర్వాత బెంగళూరులో భర్త వద్ద అక్టోబర్ వరకు ఉంది. నవంబర్ నెలలో మళ్లీ ఉద్యోగంలో చేరానని, గర్భవతినని తెలిసిన తర్వాత భర్త ఇలా తనను మానసికంగా వేధిస్తున్నాడని కన్నీరు మున్నీరైంది. తన భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని కప్పిపెట్టి తనతో వివాహం చేశారని అతడు ఆరోపించాడు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నాడు. కానీ, తమ కూతురికి కేవలం డస్ట్ ఎలర్జీ మాత్రమే ఉందని, అల్లుడు అనవసర రాద్దాంతం చేస్తున్నాడని తమ కూతురికి న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు మంగళవారం గౌతమబుద్ధ నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది.