breaking news
Renault Captur
-
రెనాల్ట్ కొత్త ఎస్యూవీ వచ్చేసింది..
ఫ్రెంచ్ కారు తయారీదారి రెనాల్ట్ సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ క్యాప్చర్‌ను రూ.9.99 లక్షల నుంచి రూ.13.88 లక్షల రేంజ్లో మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. హ్యుందాయ్ క్రిటా, టాటా హెక్సా, మహింద్రా ఎక్స్‌యూవీ500లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రీమియం ఫీచర్లతో బేస్ వేరియంట్‌ను తీసుకొచ్చినట్టు రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సహవాని తెలిపారు. భారత్‌లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, కేవలం 2017లోనే భారత్‌లో ఎస్యూవీ సెగ్మెంట్ 46 శాతం పైకి ఎగిసిందని చెప్పారు. ఎక్కువ ఫీచర్లున్న స్టైలిస్ ఎస్‌యూవీలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ వంటి 50 ప్రీమియం ఫీచర్లు క్యాప్చర్ కలిగి ఉన్నట్టు సుమిత్ తెలిపారు. -
ఈ ఏడాదే భారత్‌లోకి ‘రెనో కాప్చర్’
ధర రూ.12 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా ముంబై: డస్టర్, క్విడ్ మోడళ్లతో జోరు చూపిస్తున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ’కాప్చర్’ను ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కాప్చర్ను మార్కెట్లోకి తీసుకువస్తామని రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుమిత్ సాహ్నీ తెలియజేశారు. అంతేతప్ప ఫలానా తేదీకి తెస్తామని మాత్రం ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే 10 లక్షల కాప్చర్ వాహనాలను విక్రయించామని, ఇదే ట్రెండ్‌ను భారత్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డస్టర్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందిన ఈ కాప్చర్ వాహనాలను చెన్నై ప్లాంటులో తయారు చేస్తామన్నారు. కాగా ఈ 5 సీటర్ కాప్చర్ ఎస్యూవీ ప్రధానంగా 1.6 లీటర్ పెట్రోల్, 2 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర రూ.12 లక్షల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. ఇందులో సీ–ఆకారంలోని ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, అలాయ్ వీల్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఫ్లాట్–బాటమ్డ్ స్టీరింగ్ వీల్ వంటి పలు ప్రత్యేకతలు ఉండొచ్చని అంచనా.