'కన్నా ఎంపీగా పోటీ చేస్తే ... సపోర్ట్ చేస్తా'
గుంటూరు : వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తాను పోటీ నుంచి తప్పుకుని కన్నాకు మద్దతు పలుకుతానని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మళ్లీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తామని రాయపాటి తెలిపారు.
ఈసారి 100-150మంది ఎంపీల మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టే అవకాశమే లేదని, బీజేపీ కూడా తన వైఖరికి మార్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా రాష్ట్రపతిని కలిసి బిల్లును ఆమోదించవద్దని కోరతామన్నారు.