breaking news
rayalaxeema
-
రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేయండి
సాక్షి, అనంతపురం: ప్రశాంతంగా ఉన్న రాయలసీమను ‘ఫ్యాక్షన్’ ప్రాంతంగా చిత్రీకరిస్తూ ‘కడప’ టైటిల్‌తో వెబ్ సిరీస్‌ను తీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమితి కన్వీనర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘కడప’ వెబ్ సిరీస్‌ను వదిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘ఫ్యాక్షన్’ ఉన్నట్లు చూపడం ద్వారా రాయలసీమకు పెట్టుబడులు ఆగి అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మపై కోర్టులో పిల్ కూడా వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు భార్గవ, భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ'
-
'ఏపీలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ'
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత నెలకొన్నదని తెలిపిన ఆయన ఏపీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కూర్చుని ఉండటం, పాలన మాత్రం హైదరాబాద్ నుండి కొనసాగుతుండటం ఈ స్తబ్థతకు కారణంగా వివరించారు. రాష్ట్రంలో మరో ఏడాది కాలం ఇదే పరిస్థతి కొనసాగితే ప్రజల నుండి తీవ్రమైన అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు మాత్రం ఎక్కువగా ఉందన్నారు. కేవలం రాజకీయనిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారని జేసీ ఎద్దేవా చేశారు.