breaking news
Rana Pratap
-
ఎస్ఐ రాణాప్రతాప్ సతీమణి ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే, వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇక, ఎస్ఐ రాణా ప్రతాప్, రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, మొదటి నుంచి రాణా ప్రతాప్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి అని.. వివాదాల్లో ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలో సర్వీస్ రివాల్వర్ చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. సస్పెండ్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు.. రాణా ప్రతాప్ సోదరుడు మహేష్ కూడా ఎస్ఐగానే విధులు నిర్వహిస్తునన్నారు. -
కలియుగ శ్రవణ కుమారుడు
రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్‌కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్ అయింది. బిహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది. పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్ కాదు: రాజ్‌నాథ్
ఛత్రపతి శంభాజీ నగర్: రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌లు మన జాతి హీరోలని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్లో ఆయన ఆవిష్కరించారు. జౌరంగజేబ్, బాబర్లను శ్లాఘించడం దేశంలోని ముస్లింలను అగౌరవపర్చడమే అవుతుందని చెప్పారు. ‘ధైర్యసాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపం మహారాణా ప్రతాప్..ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ముఖ్యంగా గెరిల్లా యుద్దతంత్రంలో ఆయనే స్ఫూర్తి’అని రాజ్‌నాథ్ తెలిపారు. ఔరంగజేబ్‌ను పొడిగేవారు అతడి గురించి పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రానంతరం వామపక్ష అనుకూల భావాలు కలిగిన కొందరు చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీలకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా, ఔరంగజేబ్‌ను కీర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఉపనిషత్తులను అనువదించిన దారా షికోను ఔరంగజేబ్ చంపించాడన్నారు. మొఘలులతో జరిగిన మల్దిఘాటి యుద్దంలో రాణా ప్రతాప్ సైన్యాధికారి హకీంఖాన్ సూరి ప్రాణత్యాగం చేశాడని చరిత్రను మంత్రి గుర్తు చేశారు. -
అక్బర్ చరిత్ర కారుడే.. కానీ
ప్రతాప్ నగర్: మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ కంటే మహరాణా ప్రతాప్ గొప్పవ్యక్తి అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే చరిత్ర కారులు మాత్రం అక్బర్ ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరించడాన్ని మాత్రం తాను ఏమీ తప్పుబట్టడం లేదన్నారు. కాగా, అక్బర్ కంటే రాణా ప్రతాప్ గొప్ప వ్యక్తి అని తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్ లోని ప్రతాప్ ఘర్ లో రాణా ప్రతాప్ విగ్రహావిష్కరణలో్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ పై విధంగా స్పందించారు. హల్దీ ఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో మేవర్ చక్రవర్తి రాణా ప్రతాప్ ఓటమి పాలైన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్బర్-రాణాల చరిత్ర సరి చేయాలని రాజ్ నాథ్ పేర్కొన్నారు. రాణా ప్రతాప్ ప్రజల్లో అపారమైన ఘోరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ఉన్నతమైన వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు. తదుపరి తరాలకు మహరాణా ప్రతాప్ జీవితం ఆదర్శం కావాలని రాజ్ నాథ్ తెలిపారు.