ramanavami
-
రాముని గుణగణాలను అలవరచుకుందాం!
మానవాళి సంక్షేమం కోసం సహజయోగాన్ని ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దేశ విదేశాలలో ఇచ్చిన అనేక ప్రవచనాలలో శ్రీ రాముని గుణ గణాలను, లక్షణాలను, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుని, వాటిని మనలో అంతర్గతంగా స్థిరపరచుకొని వ్యక్తీకరించుకోవలసిన అవశ్యకతను గురించి విశదీకరించారు.శ్రీరాముడు పుడమిపై అవతరించినప్పుడు విశ్వ విరాట్‌లో కుడిపార్శ్వం అభివృద్ధి చెందడానికి దోహద పడింది. తేత్రాయుగంలో రాక్షసుల నుండి, దుష్ట శక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీ విష్ణువు తీసుకున్న అవతారమే శ్రీ రాముడు. ఆ కాలంలోనే రాజుల రాజ్యాధిపత్యం మొదలయ్యి అన్నిటికన్నా మిన్నగా ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం ్ర΄ారంభమయ్యింది. ప్రజల కొరకు, మానవాళి యొక్క అభివృద్ధి కొరకు రాజు మంచితనాన్ని, ప్రేమ తత్వాన్ని కలిగి వుండాలని నిర్ణయించబడింది. నాయకుడైన రాజు ఎంత త్యాగం చేయడానికైనా సిద్దపడాలి. అది శ్రీరామునితోనే మొదలయ్యింది. నేటి సమస్త ప్రజానీకం కోరుకున్న ఋజు ప్రవర్తన, మంచితనం శ్రీ రామునిగా అవతరించాయి. ప్రభువు అనే వాడు శ్రీ రామునిగా వుండాలని కోరుకున్నారు. మంచితనం గురించి, రాజ ధర్మం గురించి కేవలం చెప్పడమే కాదు, దానిని ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన రాజు. శ్రీ రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన కొడుకుగా, ఆదర్శవంతమైన రాజుగా, మర్యాద పురుషోత్తముడుగా ఇతిహాసంలో చెప్పుకోబడుతున్నాడు.అగస్త్య మహాముని రచించిన శ్రీ రామ రక్షా కవచంలో శ్రీ రాముని గుణగణాల గురించి ఇలా వర్ణించడం జరిగింది.ఆయన ఆజానుబాహుడు. చేతులలో ధనుర్బాణాలు ధరించి, పీతాంబరధారుడై సింహాసనంపై ఆసీనుడై వుంటాడు. ఆయన పద్మదళాయతాక్షుడు. తన ఎడమ పార్శ్వమున కూర్చున్నసీతాదేవిని చూస్తూమందస్మిత వదనార విందుడై మనకు కనిపిస్తాడు. అతని యొక్క మేని రంగు లేత నీలిరంగు ఛాయతోనూ, నేత్రములు తామర పుష్ప రేకులవలే పెద్దవిగా వుండి, ఇతరులకు ఆనందమును చేకూరుస్తుంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో విల్లు, వీపున అంబుల పొదితో దుష్ట సంహారం కొరకు సదా సన్నద్ధుడై ఉంటాడు.ఆయన జనన మరణాలకు అతీతుడు. అపార శక్తిమంతుడు. దుష్ట శక్తులన్నిటిని నాశనపరచి, మన కోరికలన్నిటినీ నెరవేర్చే సామర్ధ్యం కలవాడు శ్రీ రాముడు. తానొక అవతార పురుషుడునని గానీ, అవతార మూర్తినని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీ రాముని సుగుణాలలో మరొకటి ఏమిటంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఆ లక్షణాన్ని మనలో కూడా స్థిరపరచు కోవాలి. ఇచ్చిన మాట తప్పించుకోవడానికి ఏవేవో కుంటిసాకులు వెతికి తప్పించుకోకూడదు. ఆయనకున్న మరో సుగుణం – అవతలివారి హృదయాన్ని నొప్పించే విధంగా మాట్లాడక ΄ోవడం. దీనినే సంకోచమని అంటారు. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో అంగాంగమునందు, చక్రాలలోనూ, నాడులలోనూ దేవీదేవతలు కొలువై వున్నారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వారిని, వారి లక్షణాలను మనలో జాగృతి పరచుకోవచ్చును. అలా సీతా సమేతుడైన శ్రీరాముడు మన హృదయంలోని కుడి పార్శ్వం వైపు ఆసీనులై వుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారిలో మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, శ్రీరాముని లక్షణాలు జాగృతి చెంది ప్రతిబింబిస్తూ వుంటాయి. ఆయన మనలోని ఊపిరి తిత్తులను పరిరక్షిస్తూ వుంటాడు. ఎవరితో ఎప్పుడు, ఎలా సంభాషించాలో మనం ఆయన దగ్గరనుండి నేర్చుకోవాలి. తన పరిమితులు, హద్దులు, శ్రీ రామునికి బాగా తెలుసు. వాటిని ఆయన ఎప్పుడూ అతిక్రమించలేదు. దేశాన్ని పరిపాలించే పరిపాలకుడు ఎలా వుండాలనేది రామరాజ్యం నుండే నేర్చుకుంటారు.మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని శ్రీ రామ నవమి పర్వదినాన బాహ్య పరంగా పూజించుకోవడమే కాకుండా అతని గుణగణాలను, వ్యక్తిత్వాన్ని సహజ యోగ సాధన ద్వారా మనలో పొందు పరచుకుని అభివ్యక్తీరించుకోవటం అవసరం. – డా. పి. రాకేష్(పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
కష్టంలో కలిసి నడవాలంటున్న చిరంజీవి
ఏ పండుగ అయినా సినీ ఇండస్ట్రీలో కోలహాలం కనిపించేది. పండగ రోజు ప్రత్యేక పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చేవారు. కానీ కరోనా వల్ల ఆల్రెడీ రెడీగా ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడగా, మరికొన్నింటి షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయినా సరే.. పండగను మిస్ అవ్వమని, అందులోనూ శ్రీరామనవమి తమకు ప్రత్యేకమే అంటోంది సినీ ఇండస్ట్రీ. ఈ క్రమంలో పలువురు సినీతారలు, నిర్మాణ సంస్థలు అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాస్ మహారాజ రవితేజ వంటి హీరోలు రామనవమి శుభాకాంక్షలు చెప్తూనే ఇంట్లో సేఫ్‌గా ఉండాలని కోరారు. ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు.. అని మోహన్‌బాబు రాసుకొచ్చాడు. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ! పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను !! Happy #Sriramanavami pic.twitter.com/NqyOSsIor0 — Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2021 Wishing you all a happy Rama Navami. Stay safe everyone 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) April 21, 2021 అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు🙏🏻😊#StaySafe — Ravi Teja (@RaviTeja_offl) April 21, 2021 ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు... pic.twitter.com/XuVVUeQ8OQ — Mohan Babu M (@themohanbabu) April 21, 2021 అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏🏻 #JaiSiyaRam #JaiShriRam 🏹 pic.twitter.com/lTxGiCKYUn — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 21, 2021 May the eternal saviour bestow upon you the glory of peace, health and happiness.Wishing you all a very Happy Sri Rama Navami ! pic.twitter.com/2YWA9csxYt — Suresh Productions (@SureshProdns) April 21, 2021 View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Team #BommaBlockbuster wishes everyone, a Happy #Sriramanavami 🏹💥 Coming with an update shortly! 👉🏻@ActorNandu @rashmigautam27 @vijaieebhava @RajVirat_G @prashanthvihari @pagadalapraveen @LahariMusic @houseFULL_dgtl pic.twitter.com/O7yOw0NTWq — BARaju (@baraju_SuperHit) April 21, 2021 శ్రీరామనవమి శుభాకాంక్షలు #KothiKommachi Theme Song release on 23rd April 9:30am on @LahariMusic 🎧 A @anuprubens musical 🎹@MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC @VegesnaSatish1 #MLVSatyanarayana @ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions pic.twitter.com/VkgxXt05YA — BARaju (@baraju_SuperHit) April 21, 2021 అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు Team #VirataParvam wishes you all a very Happy and Prosperous Ram Navami.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @sreekar_prasad #DivakarMani #SureshBobbili @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/pACP8WWPJK — BARaju (@baraju_SuperHit) April 21, 2021 చదవండి: శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా? సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ... -
శ్రీరామ నవమికి ముస్లింలు నీళ్లిచ్చారు
పాట్నా: దేశంలో అసహన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ హిందువులు, ముస్లింలు పండగల సందర్భంగా పరస్పరం సహకరించుకోవడం, సమైక్యతను చాటుకోవడం అప్పుడప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా గయాలో కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. గయాలో వైభవంగా జరిగే శ్రీరాముడి కళ్లాణాన్ని కళ్లారా చూద్దామని ఎండను లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హిందూ భక్తులకు ముస్లింలు నీళ్లిచ్చి ఆదుకున్నారు. మసీదుల వద్ద పెద్ద పెద్ద బానాలను ఏర్పాటు చేసి ప్రదర్శనగా వచ్చిన భక్తుల దాహార్తిని తీర్చారు. రామ నవమి ప్రత్యేక జెండాలను కూడా ఇక్కడి ముస్లిం దర్జీలే ఎప్పుడూ తయారు చేస్తారు. జెండాలను తయారు చేయంగలేనిది నీళ్లివ్వడం మంచిదేగదా అని నవ గఢీ ఖంకా ఇమామ్ అహ్మద్ సుజెయిల్ వ్యాఖ్యానించారు. జైనులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులకు గయా పవిత్ర క్షేత్రం. అప్పుడప్పుడు చెదురు మదురు సంఘటనలు మినహా ఇక్కడ అన్ని మతాల వారు సమైక్యంగానే జీవిస్తారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. జెడ్డాకు వెళ్లే హజ్ యాత్రికులకు వైష్ణవైట్ రామానుజాచార్య మఠంలో బసను ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన అన్న పానీయాలను మహంత్ దగ్గరుండి సరఫరా చేశారు. అలాగే పిత్రపక్ష మేళకు హాజరైన హిందువులకు ముస్లిం ఇమామ్‌లు భోజన, వసతులను ఏర్పాటు చేశారు.