breaking news
PVP Cinemas
-
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
నాగ్ 'ఊపిరి' డేట్ కన్ఫాం
చెన్నై: క్రేజీ కాంబినేషన్లో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం విడుదల తేదీ ఖరారైంది. తెలుగులో 'ఊపిరి' పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీంతో పాటుగా ఆడియో లాంచ్, టీజర్ విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడి చేసింది. చిత్రి యూనిట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ శనివారం టీజర్ రిలీజ్, అనంతరం ఫిబ్రవరి 26న ఆడియో లాంచ్ ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది. కాగా కింగ్ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ విదేశాల్లో కలర్ ఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఇది కార్తీ కి ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా . ఎమోషనల్ జర్నీగా తెరకెక్కిన 'ఊపిరి' నాగార్జున కెరీర్లో డెఫినెట్‌గా మరో మెమరబుల్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.