breaking news
Purushothamudu Movie
-
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
‘పురుషోత్తముడు’ శ్రీమంతుడు కాదు: రామ్ భీమన
రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ‘శ్రీ మంతుడు’ సినిమా కథతో పోల్చవద్దు. కోటీశ్వరుడైన యువకుడు ఇంటి నుంచి బయటకు రావడం అనే పాయింట్‌తో చాలా కథలు వచ్చాయి. కానీ కథను ఏం విధంగా చెప్పాం? ఎలా చెప్పాం అనేది ముఖ్యం’’ అన్నారు. ‘‘14 ఏళ్ల వయసులోనే ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి, ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తున్నాను. తెలుగు సినిమా నిర్మించాలన్న నా ఆశ ఈ సినిమాతో నెరవేరింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ సినిమా కోసం చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను కూడా తీసేశాం. కుటుంబం అంతా కలిసి మా సినిమాను చూడొచ్చు’’ అన్నారు చిత్రనిర్మాత రమేశ్. -
రాజ్‌తరుణ్ ‘పురుషోత్తముడు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘పురుషోత్తముడు’
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ భీమన దర్శకత్వంలో డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నేను ‘ఆకతాయి, హమ్ తుమ్’ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు ‘పురుషోత్తముడు’ చాన్స్ వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘మంచి క్లీన్ ఎంటర్టైనర్ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం’’ అన్నారు రమేశ్ తేజావత్. ‘‘పురుషోత్తముడు’లో మంచి పోలీసాఫీసర్ రోల్ చేశాను. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు బ్రహ్మానందం.‘‘ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్ తరుణ్ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘నాది మహా రాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హాసినీ సుధీర్.