breaking news
Purified drinking water
-
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ‘ప్యూరిఫైడ్’ దందా!
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలో నీళ్ల దందా షురూ అవుతుంది. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తాయి. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలన్న ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట కొందరు ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. క్యాన్లలో కలుషిత నీటిని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఐఎస్ఐ అనుమతి ఉండి రెన్యూవల్ చేసుకోని వాటర్ప్లాంట్లు 20 వరకు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య దాదాపు 700లకు పైగానే ఉంది. అయితే ఇందులో ఒక్క ప్లాంట్ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. వీటికి అనుమతులు సైతం లేకపోవడం గమనార్హం. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ ప్లాంట్లలో పాత యంత్రాలు వాడటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, జలాన్ని శుద్ధి చేయకుండానే సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ఇలాంటి నీటిని తాగితే రోగాల బారిన పడడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రమాణాలు పాటించని వైనం.. భారత ప్రమాణాల సంస్థ (ఐఎస్ఐ) నిబంధనలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఇళ్లల్లో, దుకాణాల్లో, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా నీటి నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. మైక్రోబయోలజిస్ట్, కెమిస్టులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లాలో ఏటా ఈ ప్లాంట్ల నిర్వాహకులకు మొత్తంగా సుమారు రూ.25 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. దీంతో ఏడాదికేడాది వాటర్ ప్లాంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో పట్టణాలకు పరిమితమైన వాటర్ప్లాంట్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. వాటర్ క్యాన్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవే.. ►వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి. ► పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి. ► బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ► ప్లాంట్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. ► పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ► నీటిని క్యాన్లలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి. ► ప్లాంట్‌లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. ► క్యాన్లు పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్‌తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. ► ప్రతి క్యాన్‌పై శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ ఉండాలి. ► మినరల్ వాటర్‌ను క్యానులో పట్టే ముందు అల్ట్రా వైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజుల పాటు భద్రపరిచి, మార్కెట్లోకి పంపాలి. ► శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి. ► ప్రతి మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్యాకెట్లలో నిర్ణీత మైక్రోన్స్ ఉండాలి. తనిఖీ నిర్వహిస్తాం అనుమతి లేకుండా కొనసాగిస్తున్న వాటర్ప్లాంట్లలో తనిఖీలు నిర్వహిస్తాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని మూసివేయిస్తాం. – జాడి రాజేశ్వర్, ఆర్డీఓ, ఆదిలాబాద్ అనారోగ్య సమస్యలు.. ప్యూరిఫైడ్ పేరిట రక్షితం కాని నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్యూరిఫైడ్ ప్లాంట్లలో క్యాన్లు నింపే సమయంలో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లవణాలు మోతాదులో ఉండే నీటిని నింపాలి. రోజుల తరబడి క్యాన్లను శుభ్రం చేయకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. డయేరియా, వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. క్లోరినేషన్ సరిగా చేయకుండా నీటిని నింపితే ప్రమాదకరం. – క్రాంతికుమార్, ఎండీ, ఫిజీషియన్, రిమ్స్ -
శుద్ధజలం.. అబద్ధం
జిల్లాలో అనధికారికంగా వాటర్ ప్లాంట్లు వెలిశాయని, ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా నీటిని అమ్ముతున్నారని, ఈ నీరు తాగడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదముందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) అధికారులు 2016లో అప్పటి కలెక్టర్ కోన శశిధర్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఉన్న మూడు వేల వాటర్ప్లాంట్లలో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉందని అధికారులు తేల్చారు. గుంటూరులో కలుషిత నీరు తాగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. మినరల్ వాటర్ పేరుతో వేలాది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీఐఎస్ అనుమతుల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాత ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్, టీడీఎస్ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించాలి. కానీ ఇటువంటి ప్రమాణాలేవీ పాటించకుండానే వాటర్ ప్లాంట్లు అక్రమంగా నడుపుతున్నట్లు ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలింది. అనంతపురం న్యూసిటీ: జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ పేరుతో అక్రమ దందా చేస్తున్నారు. వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం...ఇదే అదునుగా వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు మినరల్ వాటర్ పేరిట గరలాన్ని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గుర్తింపు లేకుండా జిల్లాలో మూడు వేలకు పైగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ గుర్తింపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ 10 నుంచి 15 లక్షల మంది మినరల్ నీటిని తాగుతూ అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి నెలకొనింది. తాగునీటి నాణ్యతను పరిశీలించాల్సిన రెవెన్యూ, పుడ్కంట్రోల్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ప్రమాణాలేవీ? వాస్తవంగా బీఐఎస్ 60 రకాల నాణ్యత ప్రమాణాల పాటించాలని దిశానిర్ధేశం చేస్తోంది. కానీ నీటి శుద్ధి ప్లాంట్లు ప్రమాణాలను గాలికొదిలేసి అందులో పట్టుమని బేసిక్ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మొతాదు లీటరు నీటికి 100–150 మి.గ్రా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. లీటరు నీటిలో క్యాల్షియం 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు ఉండాలి. అయితే ఇక్కడి ప్లాంట్లలో వివిధ రసాయనాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఫ్లోరైడ్ మోతాదు ఒక మిల్లి గ్రామ్ మించకూడదు. ఐరన్మోతాదు 0.3 మి.గ్రా ఉండాలి. నిద్రమత్తులో అధికారులు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పుడ్ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనధికారికంగా ప్లాంట్ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక ఆహార కల్తీ నిరోధకశాఖలో ఐదుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా నెల క్రితం ట్రైనింగ్‌కు వెళ్లారు. ఇక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రూ. కోట్లలో వ్యాపారం తాగునీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో దాదాపుగా 43 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో సగం మంది మినరల్ వాటర్‌కు అలవాటు పడ్డారు. బిందె రూ 6 నుంచి 10, క్యాన్ రూ 20తో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ కోటికిపైగా జలవ్యాపారం జరుగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, మిగితా 11 మునిసిపాలిటీల్లో నీరు పూర్తీ స్థాయిలో సరఫరా చేయడం లేదు. కేటాయించిన ఎంఎల్డీ కంటే తక్కువే పదుల సంఖ్యలో మునిసిపాలిటీలకు నీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో నీరు సరిగా వస్తుందో లేదోనని ముందస్తుగా ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, కదిరి తదితర ప్రాంతాల్లోని లక్షలాది మంది మినరల్ గరళాన్ని తాగుతున్నారు. ఇన్స్పెక్టర్ల కొరత ఉంది అనధికారికంగా వాటర్ ప్లాంట్ నిర్వహించే వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లే కేసులు పెట్టాలి. ప్రస్తుతం ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. అయినా నగరంలోని చాలా ప్లాంట్లపై కేసులు నమోదు చేసి, ఫైన్లు వేశాం. -నాగేశ్వరరావు, పుడ్,సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ రోగాలు వస్తున్నాయి గతంలో మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన వాటర్ప్లాంట్లను సైతం ఇప్పుడు నడుపుతున్నారు. వాళ్లు సరఫరా చేసే మినరల్‌వాటర్ ఉప్పునీళ్ల మాదిరి ఉంటున్నాయి. అవి తాగినవారు గొంతు సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. -బాబ్జాన్, విద్యార్థి, కదిరి దుష్పరిణామాలు తప్పవు ప్రమాణాలు లేని నీటిని తీసుకోవడం ద్వారా దుష్పరిణామాలు తప్పదు. నీటిలో రుచి కోసం రసాయనాలు కలపడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులు, యముకల్లో పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. బీఐఎస్, ఐఎస్ఓ సర్టిఫైడ్ చేసిన నీటిని తీసుకోవాలి. -డాక్టర్ కృష్ణకాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, సర్వజనాస్పత్రి శుద్ధి జలాన్ని అందిస్తున్నాం బీఐఎస్ ప్రమాణాలతో ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నాం. కెమెస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి ప్రజలకు నీరందిస్తున్నాం. జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అధికారులు తనిఖీ చేసి అనధికార ప్లాంట్లను గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్వాహకులపై ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు నీటిని కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి. -పురుషోత్తంరెడ్డి, లెజెండ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విధిలేక కొంటున్నాం మినరల్ వాటర్ పేరుతో ఆటోల్లో, వాటర్ ప్లాంట్లలో ఒక్కో క్యాన్‌కు రూ.10 నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం బాగుండటం లేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన నీటిని అందించేలా ప్రతి వాటర్ ప్లాంటూ ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి. -మహేష్, ధర్మవరం -
‘గోదావరి’లో బలిసిన చేప
తూర్పుగోదావరి : చెరువుల్లో పెరిగే చేపలు 10 కేజీల బరువు పెరగడమే అరుదు. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రక్షిత మంచినీటి పథకం చెరువులో అనేక చేపలు.. వస్తాదుల్లా ‘ఒళ్లు’ చేసి అంతకు రెట్టింపు బరువు తూగారుు. వాటిలో ఒకటైతే ఏకంగా 25 కేజీల బరువుంది. చెరువులో చేపలు పట్టుకునే అవకాశాన్ని వేలం పాటలో రూ.17 వేలకు దక్కించుకున్న వ్యక్తి బుధవారం చేపలు పట్టించగా.. చెరువు ఆయన పాలిట ‘సిరుల నెలవు’గా మారింది. చేపలు పుష్కలంగా ఉండటంతో పాటు భారీ సైజులో ఉండడంతో.. అమ్మకాల ద్వారా ‘రూ.లక్షలు’ వచ్చినట్టు అంచనా. - ఐ.పోలవరం