breaking news
Private Secretary
-
ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ ఎవరంటే..2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్‌కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్‌చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకం అయ్యారు.Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn— Press Trust of India (@PTI_News) March 31, 2025 (చదవండి: నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్) -
ప్రైవేట్ సెక్రటరీగా దేవయాని కోబ్రాగడే
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలేకు ప్రైవేట్ సెక్రటరీగా అమెరికాలో భారత మాజీ ఉప దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే నియమితులయ్యారు. దేవయాని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ఉన్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను న్యూయార్క్ పోలీసులు 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె 2.5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బయటకొచ్చారు. దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. కాగా, దేవయాని ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కుమార్తెలకు సంబంధించిన పాస్‌పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆమె కోర్టును ఆశ్రయించడంతో కేంద్రం ఈమేరకు నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్‌పోర్టులను రద్దు చేసింది.