ప్రధాని ఎంపికలో జగన్ కీలకపాత్ర
పుంగనూరు, న్యూస్‌లైన్: ప్రధానమంత్రి ఎంపికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈసారి కీలకపాత్ర పోషిస్తారని మాజీ మంత్రి డాక్టర్ పెద్ద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్.పేట, బీడీవర్కర్స్ కాలనీ, చింతలవీధి, ఈస్ట్పేట, గాంధీనగర్, ఉబేదుల్లా కాంపౌండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య తో కలసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
జనమే ఊపిరిగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని తెలి పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ర్టంలో జగ న్మోహన్రెడ్డి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని తెలిపారు. 130కు పైగా ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నా రు. సుమారు 30 ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కైవశం చేసుకుంటారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఎంపికలో జగన్మోహన్రెడ్డి ఖచ్చితంగా కీలకపాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు.
వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో పేద ప్రజల హృదయాలను ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం, జైసమైక్యాంధ్ర పార్టీలు ఎన్నికల్లో కలిసి పోయాయని దుయ్యబట్టారు. ఈ పార్టీలు అన్ని స్థానాల్లో అభ్యర్థులను పెట్టడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటై జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు అడ్డదారులు వెతుకుతున్నాయ ని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ర్ట ప్రజలు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేం దుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ ఎన్నికలతో కాంగ్రెస్, టీడీపీ మనుగడ కనుమరుగు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఆ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పోకల అశోక్‌కుమార్, కొండవీటి నాగభూషణం, బెరైడ్డిపల్లె క్రిష్ణమూర్తి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డి, అమరేంద్ర, రమేష్‌రెడ్డి, త్యాగరాజు, చలపతి, కిజర్, రాజేష్, సూరేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.