breaking news
PBKS vs DC
-
సమీర్ రిజ్వీ మెరుపులు.. పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!.. ఆటగాళ్లకు సర్ది చెప్పిన హెడ్ కోచ్
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్ దైర్యం నింపాడు.ఈ విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇన్‌గ్లిస్, జేవియర్ ఉన్నారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.వందే భారత్ రైలులోశత్రు దేశ వ్యూహాలకు చెక్ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనం, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్లో పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఈ సీజన్లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.అందుకే వాయిదాఓవైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్-2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో మిగిలిన పదహారు మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాంది గార్డియన్ కథనం ప్రకారం.. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి.. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.‘‘వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్-2025ను పునఃప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఈసీబీ ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరులో మిగిలిన మ్యాచ్‌లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి’’ అని ది గార్డియన్ పేర్కొంది.కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే, సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీకి చేరుకున్నారుఇదిలా ఉంటే.. పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైలులో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంత మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. దాడులకు బరితెగించిన పాకిస్తాన్‌కు భారత్ దీటుగా సమాధానం ఇస్తుండటంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ని ఇప్పటికైతే నిలిపివేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. చదవండి: IPL 2025: ప్రత్యామ్నాయ తేదీలు ఏవి? -
కరుణ్ నాయర్ కంటే బెటర్.. అతడిని ‘తుదిజట్టు’లోకి తీసుకోండి!
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిట.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అక్షర్ సేన.. ఆరింట గెలిచి.. నాలుగు ఓడిపోయింది.ఐదో స్థానంలోఇక చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వెనుకబడ్డ ఢిల్లీ.. అదృష్టవశాత్తూ వర్షం వల్ల గట్టెక్కింది. ఉప్పల్‌లో వాన తెరిపినిచ్చినా ఆట సాగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ఖాతాలో ఓవరాల్‌గా 13 పాయింట్లు చేరాయి.తద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మరో కీలక పోరుకు ఢిల్లీ సిద్ధమైంది.పటిష్ట పంజాబ్ కింగ్స్ (PBKS vs DC)తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సులభతరంగా మారతాయి. లేదంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఢిల్లీ యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.కరుణ్, అభిషేక్‌ల కంటే బెటర్పవర్ హిట్టర్ అశుతోష్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘‘అశుతోష్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించండి. మీరు తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే ఇదే సరైన వ్యూహం.విప్రాజ్ నిగమ్ తర్వాత అతడిని పంపండి. నిజానికి కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ కంటే అశుతోష్ మెరుగ్గా, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ అవుటైన తర్వాత కాకుండా ముందే అతడిని బ్యాటింగ్‌కు పంపండి.మ్యాచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని.. మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మారుతుందో తనకైతే అర్థం కావడం లేదని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు.వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు‘‘ఇప్పటికి దాదాపు ఆరు ఓపెనింగ్ జోడీలను మార్చి ఉంటారు. దీని వెనుక వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఓపెనర్ల విషయంలోనే స్పష్టత లేకపోతే.. ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టమే అవుతుంది’’ అని ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్‌గా అశుతోష్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి 186 పరుగులు చేశాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ 7 ఇన్నింగ్స్ ఆడి 154 పరుగులు చేయగా.. అభిషేక్ పోరెల్ 11 ఇన్నింగ్స్‌లో 265 రన్స్ సాధించాడు.చదవండి: KKR vs CSK: పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ