breaking news
Part of the body
-
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
బెంగళూరు: 2022నాటి శ్రద్ధా వాకర్ దారుణ హత్యను తలపించే ఘటన ఒకటి కర్నాటకలో వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన కొరటగెరె తాలుకాలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఒకటి రక్తమోడుతున్న మనిషి చేతిని లాక్కెళుతుండగా చూసి షాక్‌కు గురయ్యారు. మరో చేయి అక్కడికి కిలోమీటర్ దూరంలో గ్రామస్తులకు కనిపించింది. గుర్తు తెలియని మహిళ తల, మొండెం తదితర భాగాలు పది వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండగా గుర్తించారు. సాధారణంగా చోటుచేసుకునే హత్య వంటిది కాదని తేలి్చన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని గుర్తించారు. హంతకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. 10 చోట్ల 10 భాగాలు.. ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం చింపుగనహళ్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన కుక్క ఒకటి మనిషి తెగిన చేతిని పొదల్లోకి లాక్కెళ్తుండగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మరో చేయి ఆ సమీపంలోనే వారికి కనిపించింది. మరికొద్ది గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో మరికొన్ని అవయవ భాగాలు కనిపించాయి. లింగపుర రోడ్డు వంతెన వద్ద పేగులు, ఇతర అంతర్గత భాగాలు బెండోన్ నర్సరీకి సమీపంలో, ఒక కాలు రక్తంతో తడిచిన బ్యాగు జోనిగరహళ్లి వద్ద పోలీసులకు దొరికాయి. సిద్దారబెట్ట, నాగాలాల్ మధ్య రోడ్డుపై రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం సిద్దారబెట్ట సమీపంలో హతురాలి తల లభ్యమైంది. శరీర భాగాలన్నీకొరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడి ఉండగా స్వా«దీనం చేసుకున్నారు పోలీసులు. హతురాలి చేతులపై ఉన్న పచ్చబొట్లు, ముఖకవళికల ఆధారంగా ఆమెను తుమకూరు తాలుకా బెళ్లావికి చెందిన లక్ష్మీదేవమ్మ(42)అని గుర్తించారు. ఆగస్ట్ 3వ తేదీన ఉర్దిగెరెలో ఉన్న కుమార్తెను చూసేందుకని వెళ్లిన లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందంటూ ఆమె భర్త బెళ్లావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలుగా నరికారని, ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే హంతకులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిందెవరు? కారణాలేమిటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం రేపడం తెల్సిందే. -
నేను మీ మెదడుని
నేను ఆనంద్ మెదడును. అతడి శరీరభాగాన్ని మాత్రమే కాదు, తానే నేను... నేనే తాను అనుకోవచ్చు. నేను అతడి వ్యక్తిత్వాన్ని. అతడి ప్రతిస్పందనల సమాహారాన్ని. అతడి మానసిక సామర్థ్యాన్ని. అతడి తలలో ఉండే నేను, కాస్త తెలుపుగా, కాస్త బూడిద రంగులో పుట్టగొడుగు ఆకారంలో ఉంటాను. నా చుట్టూ పుర్రె ఎముకలతో కట్టుదిట్టమైన కోటలాంటి నిర్మాణం ఉంటుంది. పుర్రె ఎముకల వెనుక మెత్తని గుజ్జులా ఉండే నా చుట్టూ నీటి లాంటి ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే నన్ను బయటి షాక్‌ల నుంచి కాపాడుతూ ఉంటుంది. నాకు అవసరమైన గ్లూకోజ్ తప్ప అనవసర పదార్థమేదీ నాలోకి చేరకుండా నిరోధించే ఏర్పాటు కూడా నాలోనే ఉంది. ఈ ఏర్పాటు వల్లే బ్యాక్టీరియా వంటివి నాలోకి చేరలేవు. ఇంత కట్టుదిట్టమైన నిర్మాణం ఉన్నా, నా బరువు దాదాపు కిలోన్నర మాత్రమే. నాలో ఉండేది 85 శాతం నీరే కాగా, మిగిలినవన్నీ కొవ్వు కణాలు. నాలో దాదాపు 3 వేల కోట్ల కణాలుంటాయి. వీటినే న్యూరాన్లు అంటారు. నాలోని ఒక్కో న్యూరాన్ ఆనంద్ శరీరంలోని దాదాపు 64 వేల ఇతర కణాలతో అనుసంధానమై ఉంటుంది. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం నాది. ప్రపంచంలోని ఎలాంటి సూపర్ కంప్యూటర్ అయినా నా విధులను పూర్తిస్థాయిలో అనుకరించలేదు. నిద్రలోనూ పనిచేస్తుంటా! ఆనంద్ అనుకుంటూ ఉంటాడు... చెవులతో వింటున్నాననీ, నాలుకతో రుచి చూస్తున్నాననీ, చేతులతో స్పర్శిస్తున్నాననీ... నిజానికి ఇవన్నీ నాలో జరిగే చర్యలే! చెవులు, నాలుక, చేతులు... ఇవన్నీ కేవలం సమాచారాన్ని గ్రహిస్తాయంతే! ఆనంద్‌కు ఒంట్లో నలతగా ఉన్నా, ఆకలి వేసినా ఆ విషయాన్ని నేనే అతడికి చెబుతాను. అతడి భావోద్వేగాలను, లైంగిక వాంఛలను... ఇలాంటి వాటన్నింటినీ నేనే నియంత్రిస్తాను. ఆనంద్ నిద్రిస్తున్న సమయంలో కూడా నేను పనిచేస్తూనే ఉంటాను. మెలకువలో ఉన్నప్పుడు అతడికి కుప్పలు తెప్పలుగా అందే సమాచారాన్ని ఒక గాటన పెడుతూనే ఉంటాను. అలా వచ్చి పడ్డ సమాచారంలో ఏది ముఖ్యమైనదో నేనే నిర్ణయిస్తాను. మిగిలిన వాటిని ఆనంద్ పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఉదాహరణకు ఆనంద్ తనకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ చేతిలో ఒక నవల పుచ్చుకుని చదువుతూ ఉంటాడు. నవల ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉందనుకోండి... ఆనంద్‌కు తాను విన్న సంగీతమేదీ పెద్దగా గుర్తుండదు. ఆపదల్లో అప్రమత్తం చేస్తా! ఏదైనా ఆపద ఎదురైందనుకోండి. ఆనంద్‌ను వెంటనే అప్రమత్తం చేస్తా. ఉదాహరణకు ఆనంద్ నడుస్తూ ఉన్నప్పుడు జారి పడబోయాడనుకోండి.... వెంటనే నిలదొక్కుకునేలా నేను అతడి భుజాలకు సంకేతాలు పంపుతాను. అయినప్పటికీ ఆనంద్ జారి పడ్డాడనుకోండి... అప్పుడు ఏవైనా గాయాలైతే, ఆ సంగతిని ఆనంద్‌కు వెంటనే చెబుతాను. నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆనంద్‌ను హెచ్చరించేందుకు వీలుగా ఆ సంఘటనను నా మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటాను. ఇలాంటి ఆపద సమయాల్లోనే కాదు, నిరంతరం నేను వేలాది పనులు చేస్తూనే ఉంటాను. పదిరెట్లు ఆక్సిజన్ కావాలి! ఆనంద్ శ్వాసక్రియను నేనే పర్యవేక్షిస్తుంటాను. ఒకవేళ అతడి రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగితే, అతడికి మరింత ఆక్సిజన్ అందాలని నేనే అప్రమత్తం చేస్తాను. ఈలోగా అతడి శ్వాసవేగాన్ని పరిస్థితికి అనుగుణంగా సర్దుకునేలా చేస్తాను. ఆనంద్ శరీరం బరువులో నా బరువు రెండు శాతమే. అయితే, నాకు అతడు పీల్చే ఆక్సిజన్‌లో ఇరవై శాతం అవసరం. అంటే, మిగిలిన శరీర భాగాలతో పోలిస్తే, నాకు పదిరెట్లు ఎక్కువగా ఆక్సిజన్ కావాలి. తగినంత ఆక్సిజన్ నిరంతరం అందుతూ ఉంటేనే నేను సక్రమంగా పనిచేయగలను. అలాగే, నాకు నిరంతరాయంగా గ్లూకోజ్ కూడా సరఫరా అవుతూ ఉండాలి. ఆనంద్ ఒకవేళ తీవ్రమైన ఆకలితో మలమలమాడుతున్నా, అతడి శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు ఎక్కడ ఉన్నాయా అని వెతికి మరీ వాడుకుంటాను. నాకు గ్లూకోజ్ సరఫరా కాసేపు తగ్గిందంటే, ఆనంద్ స్పృహ కోల్పోతాడు. కొన్ని నిమిషాల సేపు నాకు గ్లూకోజ్ పూర్తిగా అందని పరిస్థితి ఏర్పడితే, ఆనంద్ అపాయంలో పడినట్లే. అలాంటప్పుడు ఆనంద్‌కు పక్షవాతమైనా రావచ్చు లేదా మృత్యువైనా రావచ్చు. నొప్పి తెలుస్తుంది... నొప్పి ఉండదు! ఇంతవరకు ఎవరూ అన్వేషించని ఖండంలా ఉంటాను నేను. ఇప్పటి వరకు నన్ను మ్యాప్ చేసేందుకు ప్రయత్నించిన వారంతా ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ప్రపంచం ముందు ఉంచారు. నేనొక అంతుచిక్కని అద్భుతాన్ని. నొప్పి, బాధ వంటి వాటిని నేను అనుభూతి చెందుతూనే ఉన్నా, నాకు ఎలాంటి నొప్పీ ఉండదు. నన్ను కోసినా నాకు నొప్పి తెలీదు. అందుకే నాకు శస్త్రచికిత్స చేయాల్సి వస్తే, రోగి మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స చేస్తారు. ఇప్పటి వరకు నన్ను మ్యాప్ చేసిన వైద్యపరిశోధకులందరూ నాలోని ప్రాథమికమైన భాగాలను, వాటి విధులను గుర్తిస్తూ కేవలం ఔట్లైన్ను మాత్రమే రూపొందించగలిగారు. వెనుకభాగం చూపును, పక్క భాగాలు వినికిడిని గ్రహిస్తాయని గుర్తించగలిగారు. మరీ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పరిశోధకులు నాలోని ‘ఆనంద కేంద్రాన్ని’ (ప్లెజర్ సెంటర్) కూడా గుర్తించారు. ప్లెజర్ సెంటర్‌కి ప్రేరణ కలిగినప్పుడల్లా ఆనంద్ సంతోషంగా ఉంటాడు. అదొక్కటే అసాధ్యం! నాలో ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా, మిగిలిన అవయవాల్లా నేను నా కణాలను పునరుత్పత్తి చేసుకోలేను. నాకు సాధ్యం కానిది అదొక్కటే. శరీరంలోని చర్మం, లివర్, రక్తకణాలు వంటివేవి దెబ్బతిన్నా... అవి తిరిగి తమ నష్టాన్ని భర్తీ చేసుకోగలవు. అయితే, నాలో ఏ ఒక్క కణం నాశనమైనా అది ఎప్పటికీ తిరిగి భర్తీ కాదు. ఆనంద్‌కు ఇప్పటికే 40 ప్లస్ కదా! ఈ వయసులో అతడు ప్రతిరోజూ దాదాపు వెయ్యి న్యూరాన్లను కోల్పోతూ ఉంటాడు. వయసు పెరిగే కొద్దీ నా బరువు కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అయితే, ఈ నష్టం వల్ల ఎలాంటి చేటు లేకుండా నన్ను నేను కాపాడుకుంటూనే ఉంటాను. ఓ వెయ్యికణాలు నశించినా, మిగిలిన కణాలు ఆ నష్టాన్ని గుర్తించలేవు. బాగా ఎక్కువ కణాలు నశిస్తేనే ఇబ్బంది. అలాంటప్పుడే ఆనంద్‌కు వినికిడి శక్తి, ఆఘ్రాణ శక్తి, రుచులను గ్రహించే శక్తి తగ్గిపోతాయి. పేర్లు, ముఖ్యమైన తేదీలు, టెలిఫోన్ నంబర్లు వంటివి స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి. అయితే, బాగా ముఖ్యమైన విషయాలను నేను తుది వరకు పదిలంగానే కాపాడుకుంటాను. నాలో కుడి ఎడమలు నేను ఒకే అవయవాన్ని అయినా నాలో కుడి భాగం, ఎడమ భాగం ఉంటాయి. ఎక్కువ మందిలో నాలోని ఎడమ భాగమే కీలకంగా పనిచేస్తుంది. కుడిచేతి వాటంతో పనిచేసే వాళ్లను నియంత్రించేది ఇదే. ఈ తీరులోనే నాలోని కుడిభాగం కీలకంగా ఉన్నవాళ్లు ఎడమచేతి వాటానికి చెందినవాళ్లయి ఉంటారు. కుడి భాగాన్ని (రైట్ హెమిస్పియర్), ఎడమ భాగాన్ని (లెఫ్ట్ హెమిస్పియర్) అంటారు. చాలామందిలాగే ఆనంద్‌ది కూడా కుడిచేతి వాటమే. అతడి చేతిరాతను, నడిచే శక్తిని, లెక్కలు చేసే శక్తిని, విషయాలను అర్థం చేసుకునే విశ్లేషణాత్మక శక్తిని, గుండె పనితీరును, శ్వాసక్రియను నియంత్రించేది నాలోని ఎడమ భాగమే. నాలోని కుడి భాగం కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకశక్తిని, ఆలోచనల్లో సమగ్రతను నియంత్రిస్తుంది. నా దిగువగా ఉండే బ్రెయిన్‌స్టెమ్ కూడా నాలోని ఎడమ భాగం తరహాలోనే గుండె పనితీరును, శ్వాసక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. స్పీడులో బుల్లెట్ ట్రెయిన్ నా న్యూరాన్లు ఒక ఫిలమెంట్‌కు అతుక్కుని ఉన్న సాలెపురుగు ఆకారంలో ఉంటాయి. వీటి ద్వారా సమాచారం శరీరమంతటికీ శరవేగంగా ప్రసారమవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్‌కు అతడి కాలి ద్వారా దానికి అనుసంధానమైన న్యూరాన్ నుంచి ఏదైనా సిగ్నల్ అందిందనుకోండి. మిగిలిన న్యూరాన్ల ద్వారా రెప్పపాటులోనే అది శరీరమంతటికీ చేరుతుంది. న్యూరాన్ల ద్వారా సిగ్నల్స్ గంటకు 340 కిలోమీటర్ల వేగంతో శరీరం అంతటికీ ప్రసారమవుతాయి. ఈ వేగం దాదాపు బుల్లెట్ రైళ్ల వేగంతో సమానం. అయితే, నాలోని ఏ న్యూరాన్ కూడా మరో న్యూరాన్‌కు అతుక్కుని ఉండదు. అయినా, నాలో జరిగే జీవరసాయన చర్యల ఫలితంగా ఈ సిగ్నల్స్ మెరుపువేగంలో శరీరమంతటికీ ప్రసారమవుతాయి. మందుతో ఇబ్బందే! ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటాడు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వంటివి నాకు చేరుతాయి. మందుల ప్రభావంతో అతడి ఆరోగ్య సమస్యలూ కొంతకాలానికి దూరమవుతాయి. దురదృష్టవశాత్తూ ఒకవేళ అతడు న్యూ ఇయర్ పార్టీలో మందు కొట్టినా, ఏ రేవ్ పార్టీల్లోనో మత్తుమందులు వంటివి తీసుకున్నా అవి కూడా నాకే చేరుతాయి. ఆల్కహాల్ వంటి పదార్థాలు నాకు చేరితే, నా సాధారణమైన పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటివి మోతాదు మించితే ఆనంద్‌కు మాట తడబడటం, తూలడం, అంతుచిక్కని భ్రమలకు లోనవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇక పొగతాగే అలవాటు వల్ల కూడా నాకు ఇబ్బందులు తప్పవు. ఈ పాడు అలవాటు వల్ల నాలోని సన్నని రక్తనాళాలు బలహీనపడిపోతాయి. దురదృష్టవశాత్తూ ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే ముప్పే. అలాంటి పరిస్థితుల్లో పక్షవాతం రావడం, జ్ఞాపకశక్తి నశించడం, మతిభ్రమించడం వంటి ప్రమాదాలతో పాటు ఒక్కోసారి మృత్యువు కూడా తప్పకపోవచ్చు.