breaking news
Panchayat regime
-
ఇక క్లస్టర్ పాలన
♦ కార్యదర్శుల కుదింపునకు కొత్త విధానం! ♦ 925 పంచాయతీలు 558 క్లస్టర్లుగా విభజన మహారాణిపేట(విశాఖ) : ప్రభుత్వం క్లస్టర్ పాలనను తెరపైకి తెస్తోంది. ఇంత వరకూ గ్రామ పంచాయతీల వారీ సాగే పాలన ఇక మీదట క్లస్టర్ స్థాయిలో కొనసాగనుంది. రెండు మూడు పంచాయతీలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చి క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బదిలీలు ఇందుకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను సర్కార్ ఆదేశించింది. అంటే బదిలీల అనంతరం ఈ విధానం అమల్లోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులను కుదించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల కొరతతో కుంటుపడుతున్న గ్రామాభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టని చెప్పకతప్పదు. ఇప్పటికే కార్యదర్శులు అందుబాటులో లేక పల్లెల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులు ధ్రువ పత్రాలకు రోజుల తరబడి నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో వీథి దీపాలు వెలగని దుస్థితి. జిల్లాలోని 925 పంచాయతీలను 558 క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా కార్యదర్శులు ఇకపై పంచాయతీ పాలన సాగించనున్నారు. త్వరలో జరగబోయే కార్యదర్శుల బదిలీలు తరువాత ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం జిల్లాలో 396 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. కొత్త విధానం అమలులోకి వచ్చినా.. 162 క్లస్టర్లకు కార్యదర్శుల కొరత ఏర్పడ నుంది. అంటే క్లస్టర్లకు ఇన్చార్జీల పాలన తప్పదన్నమాట. జిల్లాలో సరిపడినంత మంది కార్యదర్శులు లేరు. గత ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిన కార్యదర్శుల్లో 152 మంది కొత్తవారు. వీరు ఒక పంచాయతీ పాలన, పనుల నిర్వహణ చేపట్టడానికే తంటాలు పడుతున్నారు. అలాంటిది వీరికి క్లస్టర్ విధానంలో ఉన్న రెండు, మూడు పంచాయతీలు అప్పగిస్తే అక్కడ సర్పంచ్‌లు, ప్రజలతో ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
నారాజ్..
ఏకగ్రీవ పంచాయతీలకు అందని నజరానా 73 గ్రామాల ఎదురుచూపు పంచాయతీ పాలనకు ఏడాది పూర్తి హన్మకొండ అర్బన్ : ఏకగ్రీవ పంచాయతీలకు ఏడాది గడిచినా ప్రోత్సాహకాలు అందలేదు. దీంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ప్రోత్సాహకాలకు తోడు పంచాయతీలకు అభివృద్ధి నిధులొస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నజరానా అందజేసిన విషయం విదితమే. దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో 2013లో జరిగిన ఎన్నికల్లో 73 గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది గడిచినా ప్రోత్సాహక నగదు బహుమతి ప్రభుత్వం నుంచి అంద లేదు. ప్రస్తుతం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15లక్షల వరకు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయకపోవడంతో ప్రజలు, ప్రజాపతినిధులు నిరుత్సాహంతో ఉన్నారు. నిధుల వరద... 2014 ప్రథమార్థంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన అన్ని రకాల నిధులను ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో విడుదల చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీలకు కోట్లలో నిధులు వచ్చాయి. సర్పంచ్ల కు సాంకేతిక కారణాల వల్ల పదవిలో చేరిన వెంటనే కాకుండా సుమారు రెండు నెలల తర్వాత(31-10-2013)నుంచి చెక్‌పవర్ ఇచ్చారు. అనంతరం సర్పంచ్‌లకు కలెక్టర్ ఆదేశాలతో మొత్తం 29 రకాల శాఖలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పాలనపై అవగాహన కల్పించారు. ఇది కొత్తగా ఎన్నికైన, రాజకీయ అనుభవం లేని వారికి ఎంతగానో ఉపయోగపడింది. పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1,42,72,000 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16,81,40,200 షెడ్యూల్డ్ ఏరియా నిధులు రూ.66,37,600 గతంలో ఆగిపోయిన నిధులు రూ.15,27,93,000 పర్క్యాపిటల్ నిధులు రూ.17,48,600 {పొఫెషనల్ ట్యాక్స్ నిధులు రూ.59,61,400 సీనరేజ్ నిధులు రూ.23,07,000 ‘మన ప్రణాళిక’తో పెరిగిన ప్రాధాన్యం ప్రస్తుతం మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి పక్కాగా అమలు చేస్తుండటంతో పంచాయతీలకు, సర్పంచ్‌లకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం గ్రామస్థాయి ప్రణాళికలకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామాలకు అవసరమైన అన్ని రకాల విషయాలను ప్రణాళికల్లో పొందుపరిచారు.


