breaking news
outdoor sports grounds
-
ఢిల్లీలో ఆరుబయట ఆటలొద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. దాంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఔట్ డోర్ క్రీడలన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని, నగర డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ఆదేశించింది. లేదంటే పిల్లలు తీవ్ర అనారోగ్య బారి వాడటం ఖాయమని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు కమిషన్ లేఖలు రాసింది. ‘ఆరుబయట ఆడే క్రీడలన్నింటినీ రద్దు చేయాలంటూ నవంబర్ 19నే మేం లేఖలు రాశాం. కానీ కొన్ని స్కూళ్లు, విద్యా సంస్థలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి‘ అంటూ ఆక్షేపించింది. ‘రోడ్లపై విపరీతమైన దుమ్ము పేరుకొని ఉంది. ఒకవైపు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతూ ఉంటే వాటి నిర్వహణ ఇంత అధ్వానంగానా? సగానికి సగం రోడ్లపై మున్సిపాలిటీ వ్యాన్లు సేకరించిన చెత్త పడి ఉంది’ అంటూ నాలుగు పెట్టింది. శనివారం నుంచి ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిధిలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను సీఏక్యూఎం నిషేధించడం తెలిసిందే. అలాగే ట్రక్కులకు నగరంలోకి ప్రవేశాలు నిలిపేశారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. చలికాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది.కర్టెన్లు చాలు: రామ్ దేవ్ఢిల్లీ కాలుష్యానికి ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం పరిష్కారం కాదని యోగ గురు బాబా రామ్ దేవ్ అన్నారు. పైగా అది సంపన్నుల ఆడంబరం అంటూ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ కొన్నిసార్లు గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. డోర్ కర్టెన్లు వేసుకుంటే చాలు. వాటిని 20 రోజులకు ఒకసారి మూతికి మాస్క్ పెట్టుకొని దులుపుకుంటే సరిపోతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి’ అని ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇంత కాలుష్యంలో వ్యాయామమా అని ప్రశ్నించగా, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయాలన్నారు. -
ఈసారైనా స్పందిస్తారా..?
విజయనగరం మున్సిపాలిటీ:జిల్లాలో క్రీడాభివృద్ధికి సువర్ణవకాశం లభించిం ది. మండలాల్లో ఇండోర్, ఔట్ డోర్ క్రీడా మైదానాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒక్కొక్క మండలానికి రూ.1.60 కోట్ల నిధులు మంజూరు చేయ నుంది. అయితే మైదానాల ఏర్పాటు కు అవసరమైన స్థల సేకరణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం క్రీడా మైదానాలు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మే రకు జిల్లాలోని 34 మండలాల్లో ఒక ఇండోర్ మైదానంతో పాటు ఔట్ డోర్ క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గత నెలలోనే జిల్లా క్రీడాభివృద్ధి అధికారికి జారీ చేసింది. గతంలో ఉన్న పైకా పథకానికి పేరు మార్చి రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం కింద మైదానాల ఏర్పాటుకు ఒక్కొక్క మండలానికి రూ.1.60 కోట్లు మంజూరు చేస్తా మని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిధుల్లో 50 శాతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, మిగిలిన 50 శాతం నిధులు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేయనుంది. అంతేకాకుండా మైదానాల ఏర్పాటు పూర్తయిన తరువత అందులో క్రీడా సామగ్రి ఏర్పాటు చేసేందుకు రూ.15 లక్షల మంజూరు చేయనుంది. మైదానాల ఏర్పాటుకు మండలంలో ఆరు నుంచి ఏడు ఎకరాల స్థలం సేకరించాలని అధికారులకు సూచించింది. అయితే స్థల సేకరణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానం నిర్మించేందుకు రూ.2.10 కోట్లు మంజూరు చేయగా జిల్లాలోని 34 మండ లాల్లో గుమ్మలక్ష్మీపురం మినహా మిగిలిన 33 మండలాల్లో స్థలాలు లేవంటూ తహశీల్ధార్లు నివేదిక పంపించారు. అప్పట్లో నియోజక వర్గం మొత్తంలో 5.25 ఎకరాలు లేవని తేల్చి చెప్పిన తహశీల్లార్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రెండు మైదానాల ఏర్పాటుకు 6 నుంచి 7 ఎకరాల కావాల్సి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అరుుతే ఈ విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే ఈ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయమై డీఎస్డీఓ కె. మనోహర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మైదానాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల అనంతరం స్థల సేకరణ కోసం ఆర్డీఓల ద్వారా తహశీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు.


