ఆటో బోల్తా: ఒకరు మృతి
గుంటూరు: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లి దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామం నుంచి దుర్గి బయల్దేరిన ఆటో గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.