breaking news
North Atlantic
-
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్‌కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్‌రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
నడి సంద్రం.. నౌకలో మంటలు.. వేలాది కార్లు బూడిద
Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!) -
బెర్ముడా మిస్టరీ వీడింది!
లండన్: ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాల్లో భారీ నౌకలను, విమానాలను సైతం అలవోకగా సముద్రంలోకి లాగేస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతం రహస్యాన్ని దాదాపు ఛేదించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. న్యూయార్క్ పోస్ట్ శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. సముద్రంలో మయామి, పుయెర్టోరికో, బెర్ముడా ద్వీపం మధ్య భాగంలో ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఉంది. ఈ సముద్రప్రాంతంపై అత్యంత శక్తివంతమైన షడ్భుజాకృతిలో గాలి మేఘాలు 32-80 కి.మీ.ల విస్తీర్ణంలో ఏర్పడుతున్నాయి. గంటకు 273 కి.మీల. వేగంతో దూసుకొచ్చే తుపానులకు ఉండేంత శక్తి ఈ గాలి మేఘాలకు ఉంటుంది. నౌకలను, విమానాలను ఈ గాలి మేఘాలే కిందకు తోసి సముద్రంలో ముంచేస్తున్నట్లు పరిశోధకుడు డాక్టర్ ర్యాండీ కార్వెనీ వివరించారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించాక ఈ నిర్ధారణకు వచ్చారు.