Nikkey Haley
-
ఇరాన్‌కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది. పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.దొరికిపోయినట్టేనా? కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్‌కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్‌కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles. It refused repeated orders to stop. Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.— Nikki Haley (@NikkiHaley) April 20, 2026మరోవైపు.. నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ సమయంలో అమెరికా బలగాలను తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేకపోయామని తెలిపింది.ఇదిలా ఉండగా, ఆసియా నుంచి ప్రయాణం తర్వాత ఆ నౌక ద్వంద్వ ప్రయోజన వస్తువులను తీసుకువచ్చే అవకాశం ఉందని తమ ప్రాథమిక అంచనాలని అమెరికా భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఆ నౌక గతంలో కూడా ద్వంద్వ ప్రయోజన వస్తువులుగా భావించే వాటిని రవాణా చేసిందని ఆ వర్గాల్లో ఒకరు తెలిపారు. అయితే, ఆ వస్తువుల వివరాలను మాత్రం ఆయా వర్గాలు వెల్లడించలేదు. అయితే, సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉన్న లోహాలు, పైపులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. 🚨 HOLY CRAP! The Iranian-flagged ship Touska, which the US military seized yesterday, was in-bound from China “loaded with dual-use chemicals used to manufacture ballistic missiles,” per WPUS Marines are now searching 5,000 containers on board.No wonder they tried to run the… pic.twitter.com/Vjl5Z1ynLR— Nick Sortor (@nicksortor) April 21, 2026 చైనాకు కష్టమే.. మొత్తంగా Touska నౌక స్వాధీనం అమెరికా–ఇరాన్–చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది హార్మూజ్ సముద్ర మార్గం ఎంత సున్నితమైన జియోపాలిటికల్ ప్రాంతమో మరోసారి చూపించింది. దీంతో, చైనా–అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం, చైనా–ఇరాన్ వాణిజ్యం అంతర్జాతీయ పరిశీలనకు గురవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనాపై మరిన్ని ఆంక్షలు లేదా వాణిజ్య పరిమితులు విధించే అవకాశం ఉంది. ఇది చైనా–అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్‌ను మరింత కఠినతరం చేస్తుంది. -
ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు -
ట్రంప్‌కు ఊహించని షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్..
అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్ పారీ్టలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పారీ్టలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచి్చనవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. రాన్ డెసాంటిస్ ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్ నెగ్గారు. 44 ఏళ్ల వయసున్న రాన్ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. రాన్ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్‌్కలు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ. ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచి్చంది. పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. మైక్ పాంపియో డొనాల్డ్ ట్రంప్ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. ‘‘చరిత్ర మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది’’ అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు. ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది. మైక్ పెన్స్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్ పెన్స్ ఈసారి అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్ నిరాకరించారు. అప్పట్నుంచి పెన్స్‌పై గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనని ఒక పిరికివాడుగా ముద్ర వేస్తూ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌కి మదుస్వభావిగా పార్టీలో మంచిపేరుంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రతినిధుల సభకు ఎన్నికైన పెన్స్ 2013 వరకు కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు. కరడు గట్టిన సంప్రదాయవాదిగా ముద్రపడిన పెన్స్ 2016లో ట్రంప్ అభ్యరి్థత్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి సై అంటున్నారు. రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ? ట్రంప్ అధ్యక్ష అభ్యరి్థగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యరి్థగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్ వేవ్ వస్తుందని అత్యధికులు ఆశించారు. అధ్యక్షుడు జో బైడెన్ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడం, కేపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలకు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చదవండి: ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం.. -
'నిక్కీ హేలీ.. ఓ వేశ్య'
సాక్షి, వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీపై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. స్కర్ట్స్ వేసుకునే ఆమె ఓ వేశ్య అని పేర్కొంది. ఈ మేరకు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ప్రచురించింది. హేలీ నడిచేటప్పుడు ఆమె వేసుకున్న స్కర్ట్‌తో వింత శబ్దం చేస్తారని దూషించింది. అలాంటి ఆమెకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారని విమర్శించింది. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడానికి ఐక్యరాజ్యసమితి కౌన్సిల్లో హేలీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. గుడ్డెద్దు చేలో పడ్డట్లు హేలీ వ్యవహిరిస్తున్నారని, ఉత్తరకొరియా గురించి మాట్లాడేటప్పుడు హేలీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించింది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు పేలితే.. అందుకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. కాగా, హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం జరిగిన యూఎన్ సమావేశంలో 'యుద్ధం కోసం అడుక్కుంటున్నారు' అని ఉత్తరకొరియాను ఉద్దేశించి హేలీ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై భద్రతాపరమైన ఆంక్షలు విధించాలని, ఆ దేశానికి ఆయిల్ ఎగుమతిని నిలిపివేయాలని, అలాగే ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న టైక్స్టైల్స్ సంబంధిత వస్తువులను ఆపేయాలని ఐక్యరాజ్యసమితిలో హేలీ డిమాండ్ చేశారు.


