breaking news
Night accident
-
ధగ ధగ.. దగా!
సీహెచ్. వెంకటేశ్: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), జీహెచ్ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్ లైట్లూ సీసీఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్ నుంచి అందే అలర్ట్స్తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.ఎల్ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?⇒ గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్ మలక్పేటరాత్రివేళ రక్షణ కావాలి⇒ అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్టగురువారం ఇదీ పరిస్థితి⇒ గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్ బాక్సులకు కనెక్టయిన లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.ఇదీ లెక్క..మొత్తం స్ట్రీట్ లైట్స్ 5,10,413కనెక్టెడ్ 3,05,018లైట్స్ ఆఫ్ 1,71,455లైట్స్ ఆన్ 1,33,563గ్లో రేట్ 43.79 %ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్ఎల్ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.ప్రధాన రహదారుల్లోనూ..కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్ జోన్‌లోని బైబిల్ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ ఎన్క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, చార్మినార్ జోన్‌లోని మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్పల్లి జోన్‌లోని కూకట్పల్లి, బోయిన్పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.వీఐపీలకే వెలుగులా!? ⇒ డాష్‌బోర్డులో జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.పనులు చేయని థర్డ్‌పార్టీ..⇒ ఈఈఎస్ఎల్ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు. అధిక చెల్లింపులు?⇒ విద్యుత్ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్ఎంసీ నగరమంతా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్ వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తామని తెలిపింది. ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్ఎల్కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
నిశీ..నిద్ర..ముంచింది..!
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజాము మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ప్రత్యక్షసాక్షి బస్ కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గడ్చిరౌలీ జిల్లాలోని ఐరీ బస్ డిపోకు చెందిన ఎమ్హెచ్ 29 బీఈ 1039 నంబర్ గల ఆర్టీసీ హైర్డ్ బస్సు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరింది. రెబ్బెన దగ్గర టైర్ పంక్చర్ కావడంతో, అక్కడే రిపేరు చేయించుకొని మంచిర్యాల వైపు వస్తోంది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ దగ్గరికి రాగానే, మంచిర్యాల నుంచి పేపర్ లోడ్‌తో చంద్రాపూర్ వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీజీ 07 బీఎఫ్ 9216 నంబర్ గల లారీ ఎదరురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ బల్లార్షకు చెందిన కమర్‌అమర్ చౌస్ (37)తోపాటు ఆయన వెనుక సీట్లో కూరున్న పెద్దపెల్లి జిల్లా, పెద్దకల్వలకు చెందిన ప్రయాణికుడు కారంగుల ఎల్లయ్య (54) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు కండక్టర్ సూర్యకాంత్ భగవన్మోరేతోపాటు మరో తోమ్మిది మంది మహారాష్ట్ర ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు. లారీ డ్రైవర్ బిహార్ రాష్ట్రంలోని జమ్ముకు చెందిన డంబ్లు వక్లవ్, అదే రాష్ట్రంలోని అత్యవార్జుమ్లికి చెందిన లారీ క్లీనర్ సుధీర్ కుమార్ కూడా క్షతగాత్రుల్లో ఉన్నారు. క్రేన్‌తో మృతదేహాల వెలికితీత.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్, కండక్టర్లతో కలిపి 10 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ కమర్‌అమర్ చౌస్తోపాటు అతని వెనుక సీట్లో కూర్చున్న ఎల్లన్న అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంపై స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో మంచిర్యాల ఎస్సైలు ఓంకార్‌యాదవ్, మారుతి, బ్లూ కోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు క్యాబిన్‌లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, ప్రయాణికుడి మృతదేహాలను బయటికి తీసేందు కు క్రేన్, జేసీబీని రప్పించాల్సి వచ్చింది. మృతదేహాలను వెలికితీతకు దాదాపు రెండు గంటలు పట్టింది. ప్రమాద వాహనాలు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన బస్ డ్రైవర్ కమర్‌అమర్ చౌస్ బంధువులను చూసేందుకు వెళ్లి.. పెద్దపెల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన కారంగుల ఎల్లయ్య మహారాష్ట్ర చంద్రపూర్‌లోని ఓ ప్రైవేటు కంపనిలో మెకానిక్‌గా పని చేస్తూ కొన్నేళ్ల కిందటే అక్కడ స్థిరపడ్డాడు. సొంత గ్రామంలోని బందువులకు చూసేందుకు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాతపడ్డాడు. ఎల్లయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ రోడ్డు ప్రమాదం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో జరగడంతో అతి నిద్రే ప్రమాద కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వాహనాల అతివేగం, ఇరుకు రోడ్డు కూడా కారణం కావొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుడు ఎల్లయ్య -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట మండలం రామన్నపేట స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనం పైనుంచి పడి ఒక్కరు దుర్మరణం చెందగా.. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో బైక్ ఢీకొని మరొకరు చనిపోయారు. సూర్యాపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని రామన్నగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన మర్రిపెల్లి అంతయ్య సొంత పనినిమిత్తం యర్కారం గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రామన్నగూడెం స్టేజీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అంతయ్యను స్థానికులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని... యాద్గార్పల్లి(మిర్యాలగూడ క్రైం): మండలంలోని యాద్గార్‌పల్లిలో తడకమళ్ల రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్లకు చెందిన పంగ చంద్రయ్య(50 ) అంతిరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టరుపై డ్రైవరుగా పని చేస్తున్నాడు. యాద్గార్‌పల్లిలో పనులు ముగిసిన అనంతరం ట్రాక్టరును అక్కడే ఉంచి స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఇదే సమయంలో యద్గార్పల్లికి చెందిన మహేష్ ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు చంద్రయ్యను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.