breaking news
new mobile connection
-
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
ఈ-ఆధార్‌తో సిమ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ-ఆధార్ కార్డు కాపీని చూపించి మొబైల్ ఫోన్లకు కొత్త సిమ్‌లు కొనుగోలు చేసుకునేలా వినియోగదారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అవకాశం కల్పించింది. ఈ-ఆధార్ కార్డునే అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తారు. కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి లభించే ఇ-ఆధార్ లేఖ/డౌన్లోడ్ చేసుకున్న కార్డునే మొబైల్ కనెక్షన్ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణ కోసం వినియోగించవచ్చు. ఇ-ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని.. వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని డీఓటీ సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని సిమ్‌కార్డు అమ్మేవారు స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించింది. మొబైల్ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాధ్యూస్, ఆస్పి సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ టెలికాం విభాగాన్ని కోరారు. ఆధార్ కార్డుకు, యూఐడీఏఐ వెబ్సైట్ ఇ-ఆధార్ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం ఇలాంటి వారికి ఉపయోపడుతుంది.