బల్క్‌ కనెక్షన్లకు కొత్త నిబంధనలు

Telcos should provide location grid of bulk users for new connections - Sakshi

న్యూఢిల్లీ: బల్క్‌ కనెక్షన్లు తీసుకున్న సబ్‌స్క్రయిబర్స్‌కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్‌) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్‌ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్‌ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్‌ గ్రిడ్‌ వివరాలను సేకరించాలి. బల్క్‌ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది.

ఇక, సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేయడానికి ముందు బల్క్‌ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.  మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్‌ కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్‌ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్‌ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్‌ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top