breaking news
the Municipal Corporation
-
మేయర్ మాకు... డిప్యూటీ మీకు
1956లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనమయ్యాయి. పాలనలో సికింద్రాబాద్‌కు పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించేలా ఒప్పందం కుదిరింది. 1. మొత్తం స్థానాల్లో 30 శాతం సికింద్రాబాద్ ఏరియాలో ఉండాలి. 2. మేయర్ హైదరాబాద్కిస్తే, డిప్యూటీ సికింద్రాబాద్‌కు ఇవ్వాలి.మేయర్ పదవీకాలం ఏడాదే.. విలీనానికి ముందు సికింద్రాబాద్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 30 మంది కౌన్సిలర్లను ఎన్నుకునేవారు. మేయర్ పదవీ కాలం ఏడాది. సికింద్రాబాద్ తొలి మేయర్ వాసుదేవ మొదలియార్(1951-52), డిప్యుటీ మేయర్ డాక్టర్ వైఎన్ తిమ్మరాజులు. ఈ ఎన్నికల్లో ఈశ్వరీబాయి (చిలకలగూడ), సుశీలాదేవి(జీరా)లు కౌన్సిలర్లుగా గెలుపొంది కార్పొరేషన్లో తమ వాణి వినిపించారు. -
‘మేజిక్’ కోసం ప్రయత్నాలు
- ఎన్ఎంసీ పీఠం రేసులో ముందున్న ఎన్సీపీ - మేజిక్ ఫిగర్ 56కు మరో 4 స్థానాలు అవసరం - కాంగ్రెస్ మద్దతు లేకుండానే అధికారం చేపట్టేందుకు సిద్ధం - ఇంకా రేసులో ఉన్న బీజేపీ-సేన కూటమి సాక్షి,ముంబై: నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికార పీఠం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇరు కార్పొరేషన్లలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన-బీజేపీ కూటమి మేజిక్ ఫిగర్‌కు దగ్గరలో ఉన్నాయి. దీంతో స్వతంత్రులు లేదా చిన్న పార్టీల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవీముంబైలో ఉన్న 111 వార్డుల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 56 స్థానాలు దక్కాలి. ఇందులో శివసేన నుంచి 38 మంది, మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఆరుగురు కలిపి మొత్తం 42 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 52 మంది కార్పొరేటర్ల గెలుపు ద్వారా ఎన్సీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ అధికారం ఏర్పాటు చేయాలంటే కాషాయ కూటమి కంటే ఎన్సీపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. కాగా, తమకు ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు ఉందని, కాంగ్సెస్ సాయం అవసరం లేదని ఫలితాల అనంతరం ఎన్సీపీ ప్రకటించింది. శివసేన సీట్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనని విశ్లేకులు చెబుతున్నారు. బీజేపీతో కలిసి పోటీచేస్తున్నట్లు తెలియగానే శివసేనకు చెందిన 41 మంది పార్టీపై తిరుగుబాటు చేశారు. శివసేన పోటీచేస్తున్న వార్డుల్లో వీరు కూడా బరిలో నిలచి ఓట్లు చీలిపోవడానికి కారకులయ్యారు. సేన నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఒకరు మాత్రమే తిరుబాటు అభ్యర్థులు గెలిచినా.. వీరి కారణంగా ఎన్సీపీనే ఎక్కువ శాతం లాభపడింది. ఒకే కుటుంబంలో గెలుపోటములు.. రాజకీయాల్లో గెలుపు కోసం నాయకులు ఎంతటికైనా తెగిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం తాజా ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అధికారం కోసం రెండు కుటుంబాల మధ్య కలహాలు సృష్టించడానికైనా నేతలు వెనకాడరు. ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు పార్టీలు టికెటు ఇచ్చి బరిలో నిలిపాయి. నవీముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు జంటలు (భార్యాభర్తలు) వేర్వేరు పార్టీల టికెట్లపై పోటీ చేసి కార్పొరేటర్లయ్యాయి. చౌగులే, మడ్వీ కుటుంబాలకు చెందిన తండ్రీకొడుకులు కార్పొరేటర్లు అయ్యారు. భగత్ అనే వ్యక్తి కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. వార్డు నంబరు 75లో బరిలో దిగిన అభ్యర్థులందరినీ ఓటర్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు కూడా నన్ ఆఫ్ అబౌ (నోటా) నొక్కలేదు. మిగత 100 వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నోటా నొక్కిగా, 16వ వార్డులో 116 మంది నోటా వినియోగించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తరువాత ఇక్కడ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. లెక్క ప్రకారం చూస్తే నవీముంబైలో 56 మంది మహిళ కార్పొరేటర్లు ఎన్నికవాలి. అయితే ఓపెన్ కేటగిరి నుంచి బరిలో దిగిన కొందరు మహిళల్లో నలుగురు గెలుపొందడంతో మహిళకార్పొరేటర్ల సంఖ్య 60కి చేరింది. పెరిగిన బలాబలాలు.. గతంలో నవీముంబై కార్పొరేషన్లో ఎన్సీపీకి-54, శివసేన-17, కాంగ్రెస్-13, బీజేపీ-1, స్వతంత్రులు-4 గెలిచారు. కాని ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి రెండు స్థానాలు తగ్గగా, శివసేనకు ఏకంగా 21 స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు తగ్గగా, బీజేపీకి ఐదు స్థానాలు పెరిగాయి. -
పట్టణానికి పట్టం !
* మూడంచెల వ్యూహంతో తుమ్మల కమిటీ నివేదిక * అభివృద్ధికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన * ఏడాదిలో పూర్తయ్యే పనులకు రూ. 565.35 కోట్లు అవసరమని అంచనా * రూ.126 కోట్లతో మున్సిపాలిటీలకు కొత్త వాహనాలు * లక్షకుపైగా జనాభాగల 8 పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ * ఏక రూప నమూనాలతో మార్కెట్లు, శ్మశానాలు, కార్యాలయ భవనాల నిర్మాణం ‘చెత్త’కు పర్యాయపదంగా మారిన పురపాలక సంస్థలను గాడిలో పెట్టి.. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అనుసరించనుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, జంక్షన్ల విస్తరణ నుంచి మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీసు రూల్స్ దాకా వివిధ అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. పురజనులకు సౌకర్యాల కోసం చేయాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి.. మూడు నెలలు, ఏడాది, ఐదేళ్ల వ్యవధిలో పూర్తిచేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను చేపట్టాలని సూచించింది. కొత్త ఒరవడికి ప్రణాళిక.. పురపాలన, పట్టణాభివృద్ధి అంశాలపై అధ్యయనం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి టి.శ్రీనివాస్‌గౌడ్‌లతో గత నెల 14న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ... తాజాగా ప్రభుత్వానికి అధ్యయన నివేదికను సమర్పించింది. పురపాలనలో మూస విధానాలకు స్వస్తి పలుకుతూ... కొత్త ఒరవడిని సృష్టించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలు, నిధులు, నిధుల సమీకరణ మార్గాలు, కాలం చెల్లిన పురపాలక చట్టాలకు సవరణలు తదితర అంశాలను తమ నివేదికలో క్రోడీకరించింది. ఏడాదిలోపు వ్యవధిలో అమలుచేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికల కోసం రూ. 565.35 కోట్లు అవసరమని తేల్చింది. ఒకటి నుంచి ఐదేళ్ల వ్యవధిలో అమలుచేయాల్సిన మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలకు అయ్యే వ్యయాన్ని తేల్చేందుకు అధ్యయనం జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. స్వల్పకాలిక ప్రణాళికలు వేసవి వస్తే పలు పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. నీటి సరఫరా పథకాల మరమ్మతుల కోసం రూ. 21.16 కోట్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ. 15.22 కోట్లు కేటాయించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 25 లక్షలు, మున్సిపాలిటీల్లో మూడు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు చొప్పన మొత్తం రూ.7.55 కోట్లు కేటాయించాలి. మౌలిక వసతుల అభివృద్ధిపై కమిటీ సూచనలు మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు - నీటి సరఫరా పరిమాణాన్ని మున్సిపాలిటీల్లో రోజుకు ఒక్కొక్కరికి 60 లీటర్ల నుంచి 135 లీటర్లకు, కార్పొరేషన్లలో 100 నుంచి 150 లీటర్లకు పెంచాలి. నీటి సరఫరా నిర్వహణ, అమలు వ్యయాన్ని తగ్గించుకొంటూనే... మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే విధంగా నీటి చార్జీలు నిర్ణయించాలి. - మున్సిపాలిటీల్లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు లక్షకుపైగా జనాభా గల పట్టణాలకు రవాణా ప్రణాళికలను తయారుచేయాలి. సీఎం హామీ మేరకు 5 మున్సిపాలిటీలకు రింగ్రోడ్లను నిర్మించాలి. - లక్షకు పైగా జనాభా గల 8 నగరాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. వర్షాకాలంలో నీరంతా వెళ్లిపోయేలాగా డ్రైనేజీల వ్యవస్థను బాగు చేయాలి. నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ, తరలింపు కోసం రూ. 126.87 కోట్లతో పరికరాలు/వాహనాలను కొనుగోలు చేయాలి. సామాజిక సౌకర్యాలు స్వల్పకాలిక ప్రణాళికలు(ఏ) - 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోని 3,34,630 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు వ్యయంగా నిర్ణయించగా... కేంద్రం రూ. 4 వేల చొప్పున ఇస్తోంది. మిగతా రూ. 11 వేలలో లబ్ధిదారువాటా రూ. 3 వేలుపోగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 వేలు చెల్లించాలి. దీనికి నాలుగేళ్లలో రూ. 267.70 కోట్లను కేటాయించాలి. రూ. 51.8 కోట్లతో 1,038 సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలి. - రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 18 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం లో మార్కెట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 10 లక్షల మీటర్లకే పరిమితమయ్యాయి. ఈ మార్కెట్ల ఆధునీకీకరణ కోసం రూ. 108 కోట్లు అవసరం. ఇక పట్టణాల్లో 112 జంతు వధశాలలు నిర్మించాల్సి ఉంది. - కబ్జాలు, సౌకర్యాల లేమితో పట్టణ ప్రాంత శ్మశాన వాటికలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిలో సౌకర్యాల కోసం లక్షలోపు జనాభా గల పట్టణాలకు రూ. 15 లక్ష లు, లక్షపైన జనాభా గల పట్టణాలకు రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 11.30 కోట్లు ఇవ్వాలి. కొత్త శ్మశానాల నిర్మాణం కోసం రూ. 71.70 కోట్లు కేటాయించాలి. - కొత్తగా ఏర్పడిన 25 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ. 2 కోట్లు చొప్పున రూ.50 కోట్లు కేటాయించాలి. ఇక రాష్ట్రం లోని మున్సిపాలిటీల్లో 1,949 ఖాళీ స్థలాలు ఉండగా.. 1,448 స్థలాలకు రక్షణ లేదు. వాటికి ప్రహరీ గోడలను నిర్మించేందుకు రూ.60 కోట్లు అవసరంకాగా.. తొలివిడత కింద రూ. 10 కోట్లు ఇవ్వాలి.