breaking news
munak Canal
-
ఢిల్లీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: హర్యానాలో జాట్ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడుతోంది. సోమవారం కూడా ఢిల్లీలో పాఠశాలలు మూసివేయాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమ ప్రభావంతో ఢిల్లీలో నీటి సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. సోమవారం నుంచి ట్యాంకర్ల ద్వారానైనా నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ నీటి కొరతను తీర్చే ప్రధాన నీటి కాలువ మునాక్ను జాట్లు మూసివేయడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలపై తీరని ప్రభావం పడే అవకాశం ఉంది. -
ఢిల్లీ వాసులకు రెండు రోజుల నీటి కష్టాలు
న్యూఢిల్లీ: బవానాలో గల్లైంతైన ఇద్దరు బాలుల అన్వేషణ కోసం మునాక్ కెనాల్లో నీటి సరఫరాను నిలిపివేయడంతో ఢిల్లీ వాసులకు గురు, శుక్రవారం నీటి సమస్యలు తలెత్తనున్నాయి. బవానాలో ఇద్దరు బాలులు మంగళవారం నుంచి కనిపించడం లేదు. వారు మునాక్ కెనాల్లో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తుండడంతో వారిని గాలించడం కోసం బవానా ప్లాంటుకు నీటిని వదలరాదని ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని అంగీకరించారు. దీని వల్ల ఢిల్లీ వాసులకు నీటి సమస్య ఎదురైనప్పటికీ బిడ్డలను కోల్పోయిన రెండు కుటుంబాల దుఃఖాన్ని దష్టిలోకి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. -
మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి
జీఓఎం సమావేశానికి హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : మునాక్ కాలువ ద్వారా ఢిల్లీ రాజధానికి అందించే నీటి విషయంలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రు ల బృందం (జీఓఎమ్) జూన్ మొదటి వారంలో సమావేశం కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జీఓఎం సమావేశం నిర్వహించి, తదుపరి విచారణకల్లా పరిస్థితిపై ఓ నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖకు జస్టిస్ హిమా కోహ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ నివేదిక సమర్పించలేకపోతే సంబంధిత శాఖా సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ జలబోర్డుకు ఈ కాలువ ద్వారారోజుకి 80 మిలియన్‌గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. 744 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మూడు నీటిశుద్ధి కేంద్రాలకు పంపించి, తద్వారా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా చేస్తోంది. జీఓఎం మార్చి 6న జరిగిన సమావేశానికి అనారోగ్య కారణంగా కేంద్రమంత్రి కపిల్‌సిబల్ హాజరు కాలేకపోయినందున ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జలవనరుల శాఖ కోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సమావేశం నిర్వహించి ద్వారకా, బవన, ఓఖ్లా నీటిశుద్ధి కేంద్రాలకు నీరు సరఫరా చేసి పనులు తొందరగా ప్రారంభమయ్యేటట్లు చూస్తామని ఢిల్లీ జలబోర్డు తరపు న్యాయవాది సుమీత్ పుష్కర్ణ కోర్టుకు నివేదించారు. మూడు నీటిశుద్ధి కేంద్రాల్లో పనులు ప్రారంభమయితే ప్రస్తుతం నిత్యావసరాలకోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న ద్వారక, దానిచుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉండదని స్థానికు లు అంటున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయని, తమకు ఢిల్లీ జలబోర్డు ఒక్కనీటి చుక్క కూడా ఇవ్వక 20 ఏళ్లు దాటిపోయిందని ఆరోపిస్తూ మహవీర్ ఎన్క్లేవ్ కాంప్లెక్స్ కాలనీల వెల్ఫేర్ కాన్ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది. నంగ్లోయి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఎలాం టి అంతరాయం లేకుండా తమకు నీటి సరఫరా చేయాలని కోరుతూ 1994లో ఢిల్లీ జలబోర్డుకు 34లక్షలు చెల్లించామని అసోసియేషన్ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ద్వారకా నీటిశుద్ధి కేంద్రం పనిచేయకపోవడంవల్ల తాము నీటి సరఫరా చేయలేకపోతున్నామంటూ డీజేబీ తప్పించుకుంటోందని అందులో పేర్కొన్నారు.