breaking news
Mumbai Garuda team
-
ఎదురులేని ముంబై
న్యూఢిల్లీ: పటిష్టమైన ముంబై గరుడా జట్టు... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో తొలి దశ మ్యాచ్‌లను విజయంతో ముగించింది. గురువారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 4-3తో హరియాణా హామర్స్పై నెగ్గింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 57 కేజీల్లో రాహుల్ (ముంబై) 7-2తో నితిన్ (హరియాణా)పై; 69 కేజీల్లో అడెలైన్(ముంబై) 7-1తో గీతికా (హరియాణా)పై; 125 కేజీల్లో జార్జి స్కాండెలిడ్జ్ (ముంబై) 10-0తో హితేందర్ (హరియాణా)పై; 48 కేజీల్లో రితూ పోగట్ (ముంబై) 5-4తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచారు. ఇక 58 కేజీల్లో ఒక్సానా (హరియాణా) 4-2తో సాక్షి మాలిక్‌పై; 74 కేజీలోలోపెజ్ (హరియాణా) 11-0తో ప్రదీప్ (ముంబై)పై; 97 కేజీల్లో వాలెరి 2-1తో ఎల్జిబర్ (ముంబై)పై నెగ్గారు. -
సెమీస్‌లో ముంబై
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో అజేయంగా దూసుకెళుతున్న ముంబై గరుడ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా సోమవారం ఢిల్లీ వీర్ జట్టుతో జరిగిన బౌట్లో 5-2 తేడాతో ముంబై నెగ్గింది. దీంతో సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబైకి ఓటమి లేకుండా పోయింది. అటు ఢిల్లీ ప్రతీ మ్యాచ్ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. తొలి మూడు బౌట్స్ అనంతరం ఢిల్లీ 2-1తో ఆధిక్యంలో ఉన్నా ఆ తర్వాత ముంబై వరుస విజయాలతో అదరగొట్టింది. ప్రారంభ మ్యాచ్‌లో ఒడికడ్జే (97 కేజీలు) 5-0తో గురుపాల్ సింగ్‌పై నెగ్గి ముంబైకి శుభారంభాన్నిచ్చాడు. మహిళల 48 కేజీలో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ) 8-0తో రితూ ఫోగట్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేసింది. పురుషుల 74 కేజీలో దినేశ్ కుమార్ (ఢిల్లీ) 5-3తో ప్రదీప్‌ను ఓడించి 2-1 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ముంబై పుంజుకుని ఒడునాయో (53 కేజీలు) 10-0తో లిలినాయోను, గియోర్గి (125 కేజీలు) 10-0తో క్రిషన్ కుమార్‌ను, అడెలిన్ గ్రే (69 కేజీలు) 10-0తో నిక్కీని, ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ఇక్తియోర్ (65 కేజీలు)ను 9-7తో అమిత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్‌తో పంజాబ్ రాయల్స్ తలపడుతుంది.