breaking news
mumbai central
-
ముంబైని వీడని వర్షాలు
ముంబై సెంట్రల్: ముంబైలో సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, రోడ్డు రవాణతోపాటు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. నగరంలోని లోత ట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చొరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హింద్మాతా, పరేల్, బైకుల్లా ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బాండూప్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌లో వాన నీరు చొచ్చుకు రావడంతో ముంబై లో పలు ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరా నిలిచిపోయింది. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రాత్రి వరకు నీటి సరఫరా మళ్లీ పునరుద్దరించినప్పటికీ నల్లాల్లో మురికినీరు రావడంతో, తాగు నీటిని బాగా మరిగించి తాగాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు మురికినీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భీవండీలో కుంభవృష్టి.. : నిరంతరం కురుస్తున్న కుంభవృష్టి వల్ల భీవండీ నగరం లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈద్గాహ్, ఖాడీపార్, కారీవలి, ప్రధాన మార్కెట్ ప్రాంతం, తీన్ బత్తీ, బాజీ మార్కెట్ ప్రాంతాలలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది. షాపులు, నివాస స్థలాల్లోకి వరద నీ రు దూసుకొని వచ్చింది. పలు ప్రాంతాల్లో అధికారులు జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 5 రోజుల పాటు భారీవర్ష సూచన.. ముంబైలో రాబోయే మరో 5 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, కొంకణ్ ప్రాంతంలో, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరాఠ్వాడా, విదర్భలోని పలు ప్రాంతాల్లో యెల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. రానున్న 48 గంటల్లో ముంబై, పరిసర నగరాల్లో కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాందివలిలో భారీ వర్షాలతో ఘటన సాక్షి ముంబై: కాందివలిలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పార్కింగ్‌లో సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. కాందివలిలోని ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలోని బీఎంసీ పార్కింగులో రోజు మాదిరిగానే అనేక మంది వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పార్కింగులో పెద్ద ఎత్తున నీరు చొరబడింది. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. -
ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్
ముంబై: ముంబై సెంట్రల్‌లోని వొఖార్డ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. వీరికి వైరస్ సోకిందనే విషయాన్ని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ముంబైలో సోమవారం నాటికి 490 పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా 34 మంది మరణించారు. -
ఆసక్తికర అంశం వెల్లడించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిగా తాను చాలా ప్రాంతాలకు వెళ్లి చాలామందిని కలిశానని, అందులో భాగంగానే ముంబై సెంట్రల్ కు వెళ్లినప్పుడు ఓ మహిళ అక్కడి స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నారని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గురువారం లోక్‌సభలో 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. గత 5 నెలలుగా ఆమె స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నారని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ రైల్వేలను తమ సొంత సంస్థ అనుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సోషల్ మీడియా కూడా ప్రయాణికుల సేవలను మెరుగుపరిచేందుకు సాయం చేస్తోందని అన్నారు. రైల్వే కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడి ఆశలు, ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. రైల్వేలు అందరివీ.. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై రైల్వేశాఖ దృష్టిపెట్టిందని, కొత్త వనరులవైపు దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయి వల్ల ప్రయోజనం ఉండేలా చూస్తున్నామని చెప్పారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, అంతర్జాతీయంగా ఉన్న మంచి విధానాలను అనుసరిస్తున్నామని అన్నారు. ఆక్యుపేషన్ రేషియో 92 శాతాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.