breaking news
Modern police system
-
‘స్పాట్’ పెట్టిందో సఫా..!
దాని పేరు స్పాట్.. బరువు దాదాపు ఒక జర్మన్ షెపర్డ్ కుక్కతో సమానం. అయితే ఇది కేవలం డాన్స్ వీడియోలతో వైరలైన రోబో శునకం కాదుసుమా.. ప్రస్తుతం ఇది అమెరికా, కెనడాలోని 60కి పైగా పోలీసు విభాగాలలో, అత్యంత ప్రమాదకరమైన మిషన్లలోకి దూసుకుపోతోంది. దీనిధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి: ప్రాథమిక యూనిట్ ధర దాదాపు రూ.90 లక్షలు (100,000 డాలర్లు). అధునాతన అదనపు పరికరాలతో కలిపి ఇది రూ.2.2 కోట్లు (250,000 డాలర్లు) దాటిపోతుంది.ప్రాణాపాయ మిషన్లలోకి ప్రవేశం అయిదేళ్ల క్రితం ఆవిష్కరించిన ఈ నాలుగు కాళ్ల రోబో, ఇప్పుడు పోలీసుల అత్యవసర ఆపరేషన్లలో కీలకంగా మారింది. మానవ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన చోట, స్పాట్ ముందుంటుంది. ప్రమాదకరమైన వస్తువులను తనిఖీ చేయడానికి, సాయుధ గ్యాంగ్స్టర్ల మధ్య చిక్కుకున్న బందీల రక్షణలో, రసాయనాలు చిందటం లేదా ప్రమాదకరమైన ప్రదేశాల సర్వేల్లో దీని సేవలు అపారం. ఒక హోస్టేజ్ రెస్క్యూ మిషన్ గురించి మసాచుసెట్స్ స్టేట్ పోలీస్‌కు చెందిన ట్రూపర్ జాన్ రగోసా చెబుతూ, ‘స్పాట్ ఒక ఆ దుండగుడిని ఎదుర్కొన్నప్పుడు, ’ఏంటీ కుక్క?’ అంటూ అవాక్కయ్యాడు’.. అని తెలిపారు.‘స్పాట్’ ఏం చేయగలదంటే.. ‘స్పాట్’ను ఒక టాబ్లెట్ కన్సోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ రోబో సామర్థ్యాలు సంప్రదాయ చక్రాల రోబోల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఎగిరి దూకడం, మెట్లు ఎక్కడం, జారే ఉపరితలాలపై నడవడం. మలి్టపుల్ కెమెరాల నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ పంపడం, ఆటోమేటిక్‌గా అడ్డంకులను గుర్తించి, దారి మళ్లడం లాంటి సవాళ్లను అవలీలగా ఎదుర్కొంటుంది. తాళం వేసిన తలుపులను కూడా తెరవగలుగుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 స్పాట్ రోబోలు పనిచేస్తుండగా, భద్రతా ఏజెన్సీల నుండి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని బోస్టన్ డైనమిక్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ షుల్మాన్ తెలిపారు.పోలీసు ప్రపంచానికి పెద్ద అండ చివరికి, డ్యాన్స్ వీడియోలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ రోబో, ఇప్పుడు ఆధునిక పోలీసు వ్యవస్థ సంక్లిష్ట ప్రపంచంలోకి దూసుకుపోతూ, ఆవి ష్కరణకు, వివాదా నికి మధ్య నిలుస్తోంది. రూ.90 లక్షల ఈ ’రోబో డాగ్’ భవి ష్యత్తు పోలీసు ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతోందనేది మాత్రం నిస్సందేహం.అంతులేని ప్రశ్నలు.. ఆందోళనలు స్పాట్ ప్రవేశంతో సాంకేతికత ఎంత ఆశ కలిగిస్తోందో, అంతకు మించిన ప్రశ్నలు, భయాలు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థలో ఒక కొత్త శకానికి సంకేతం. న్యూయార్క్ పోలీసులు 2021లో స్పాట్‌ను ఉపయోగించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దాని అధిక ధర, నిఘా పాత్రపై ప్రజలు ఆందోళన చెందారు. నిరసనల కారణంగా తాత్కాలికంగా ఆపినా, తర్వాత కొత్తగా రెండు యూనిట్లు కొనుగోలు చేశారు. టెక్సాస్ ఏ అండ్ ఎం ప్రొఫెసర్ రాబిన్ మర్ఫీ మాట్లాడుతూ.. స్పాట్ చురుకుదనం గొప్పదే అయినా, రోబోటిక్ సాధనాల వాడకం పెరిగితే పోలీసులు ప్రజల నుండి మరింత దూరం అవుతారన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ర్యాన్ కాలో మాట్లాడుతూ.. ‘అధికారులు ప్రాణాలను పణంగా పెట్టకూడదు, కానీ మనం రోబోటిక్ పోలీసు రాజ్యంగా మారకూడదు’.. అని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
ప్రజామోద పోలీసింగ్‌కు 9 సూత్రాలు
ఠాణాల వారీగా ప్రచారానికి నిర్ణయం తెలుగు, ఇంగ్లీషుల్లో బోర్డుల ఏర్పాటు సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న నగర పోలీసులు మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ఆమోదం పొందేలా ఆధునిక పోలీసు వ్యవస్థను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది సూత్రాలను ఖరారు చేశారు. వీటిని అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసులకు అర్థమయ్యేలా బోర్డులు రూపొందిస్తున్నారు. ‘ప్రజా ఆమోదమే ఆధునిక పోలీసు వ్యవస్థకు పునాది’ పేరుతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రూపొందిస్తున్న ఈ బోర్డుల్ని అన్ని ఠాణాలకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ఏ కొందరికో మాత్రమే కాకుండా అధికారులు, సిబ్బందితో పాటు ఫిర్యాదుదారులకూ కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. పోలీసుస్టేషన్‌లోని ప్రతి రిసెప్షన్లోనూ ఈ బోర్డులు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ బోర్డుల ద్వారా ప్రచారం చేయనున్న తొమ్మిది సూత్రాలు ఇవే... ⇒నేరాలను నిరోధించడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడమే పోలీసుల ప్రాథమిక లక్ష్యం. ⇒పోలీసు చర్యలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆమోదం పైనే వారి విధి నిర్వహణ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ⇒స్వచ్ఛందంగా చట్టాన్ని పాటించేలా ప్రజల్ని చైతన్యపర్చి, అందుకు వారి ఆమోదాన్ని పొందినప్పుడే పోలీసులు నిత్యం వారి నుంచి గౌరవమన్ననలు పొందుతారు. ⇒విధి నిర్వహణలో ఏ స్థాయిలో బలప్రయోగం చేస్తామో... ప్రజల నుంచి లభించే సహాయ సహకరాలు అదే స్థాయిలో తగ్గుతాయి. ⇒ నిస్ఫాక్షికంగా, నిజాయితీగా విధి నిర్వహణ చేస్తేనే ప్రజామోదం, వారి సహకారం లభిస్తుంది. కొద్దిమంది అభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తే ఇది సాధ్యం కాదు. ⇒చట్టాన్ని అమలు పరిచే, శాంతిభద్రతలు పునరుద్ధరించే క్రమంలో ప్రజలతో సంప్రదింపులు, సలహాలు, హెచ్చరికలు విఫలమైతేనే అవసరమైన మేరకు బలప్రయోగం చేయాలి. ⇒ ‘ప్రజలే పోలీసులు-పోలీసులే ప్రజలు’. అన్ని వేళల్లోనూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి. సమాజ క్షేమం, రక్షణ ప్రజల బాధ్యత. ఆ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి జీతాలు చెల్లిస్తూ ప్రజలు నియమించుకున్న వ్యవస్థే పోలీసు. ⇒పోలీసులు అన్ని వేళలా తమ చర్యల్ని చట్టప్రకారం తమకు సంప్రదించిన విధులకు మాత్రమే పరిమితమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సందర్భంలోనూ తాము అధికారాలు చలాయిస్తున్నట్లు కనిపించకూడదు. ⇒నేరరహిత, శాంతిభద్రతలతో కూడిన సమాజమే పోలీసు సామర్థ్యానికి కొలమానం. నేరాలను, అశాంతిని ఎదుర్కోడానికి పోలీసులు తీసుకునే చర్యలు మాత్రం సామర్థ్యానికి ప్రతీక కాదు.


