breaking news
mla vidyasagar
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. -
కల్వకుంట్ల, జువ్వాడీ బల ‘సమీక్ష’
కోరుట్ల : కోరుట్లలో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష బలపరీక్షకు వేదికకానుంది. జువ్వాడి రాకతో మారిన రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపుతున్నాయి. పార్టీ పెద్దల ముందు జువ్వాడి వర్గం కోరుట్ల సెగ్మెంట్లో తమ పట్టు నిరూపించుకునే యత్నాలు చేసింది. ఎమ్మెల్యే సైతం కార్యకర్తల సమీక్షరణకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీలు వర్గాలు చర్చించుకుంటున్నాయి. పాత..కొత్త తేడాలు లేకుండా అంతా కలిసి ఉంటామని ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఇరువర్గాలు గతంలో చెప్పుకున్నాయి. కోరుట్ల సెగ్మెంట్లో రెండువర్గాలు ఆధిపత్యంకోసం సాగిస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి. కల్వకుంట్ల, జువ్వాడి వర్గాలు ప్రస్తుతం ఒకేపార్టీలో ఉన్నా ఒకే వేదికపై ఒక్కసారి కనిపించలేదు. హరితహారం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి జువ్వాడి నర్సింగరావు రెండోస్థానంలో నిలిచారు. నెలక్రితం సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి టీఆర్ఎస్లో చే రారు. వారంరోజులకు జువ్వాడి వర్గం కోరుట్లలో పెద్దఎత్తున కార్యకర్తలు, అనుచరులను సమీకరించి ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి తమ పట్టు నిరూపించుకునే యత్నం చేశారు. కల్వకుంట్ల వర్గం నాయకుల్లోనూ ఇదే పట్టు ప్రదర్శించాలన్న తపన మొదలైంది. సోమవారం సెగ్మెంట్ సమీక్ష సమావేశం ఇందుకు వేదికగా నిలువనుందని పార్టీవర్గాల సమాచారం.