breaking news
mizo people
-
లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?
మిజోరం.. దేశంలోని ఒక చిన్న రాష్ట్రం... అసెంబ్లీ కూడా చిన్నదే. 40 మంది సభ్యుల ఈ అసెంబ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా దేశవ్యాప్తంగా మిజోరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి మిజోరంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌తో పాటు, ఈసారి లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో లాల్దుహోమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువత నుంచి లాల్దుహోమాకు అత్యధిక ఆదరణ దక్కుతోంది. మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ నుంచి రాష్ట్రానికి విముక్తి చేయడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మిజోరాం సీఎంకు లాల్దుహోమా గట్టి పోటీదారు అని ఇక్కడివారంతా చెబుతున్నారు. ఇంతకీ లాల్దుహోమా ఎవరు? యువత ఆయనకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? లాల్దుహోమా మిజోరంనకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 1977లో ఐపీఎస్ పూర్తి చేశాక, గోవాలో స్క్వాడ్ లీడర్‌గా విధులు నిర్వహిస్తూ స్మగ్లర్ల ఆటకట్టించారు. లాల్దుహోమా సాధించిన విజయాలు మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. లాల్దుహోమా 1984లో ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి ఎంపీగా లాల్దుహోమా నిలిచారు. 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లాల్దుహోమా.. జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జెడ్ఎన్పీ నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఐజ్వాల్ వెస్ట్-1, సెర్చిప్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన లాల్దుహోమా.. సెర్చిప్కు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గుచూపారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2020లో శాసనసభ సభ్యునిగా అనర్హుడయ్యారు. ఇది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో మొదటి ఉదంతంగా నిలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సెర్చిప్ నుంచి లాల్దుహోమా తిరిగి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి! -
నిజాయితీకి నిలువుటద్దం ఈ మనుషులు
ఐజాల్: మిజోరం రాష్ట్రం ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడువులు, పచ్చటి పొలాలు, జలపాతాలు, సెలయేళ్లతో అందమైన ప్రకతితో అలరారుతుంటోంది. ప్రకతిలాగే అక్కడే నివసించే మిజో ప్రజలు మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. అంతే అందమైనది. నిజాయితీకే వాళ్లు నిలువటద్దం. రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసే వాళ్లు, పొద్దుపోయాక ఇల్లు చేరేవాళ్లు జాతీయ రహదారి పక్కన తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు తాత్కాలిక బండ్లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ విక్రయించేవారు ఎవరూ ఉండరు. ఉత్పత్తులు, వాటి పక్కన ధరల పట్టిక, డబ్బులు వేసేందుకు చిన్న డబ్బాలు ఉంటాయి. దారినపోయే కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని ధరల పట్టిక ప్రకారం డబ్బులను పక్కనున్న డబ్బాల్లో వేయాలి. నోటు వేసి చిల్లర తీసుకోవాల్సి వస్తే కూడా వారు ఆ డబ్బాల నుంచే ఎవరికి వారు తీసుకోవాలి. ఈ వ్యవహారం సక్రమంగా జరుగుతుందా, లేదా చాటు నుంచి గమనించేందుకు కూడా అక్కడ ఎవరూ ఉండరు. కొద్దిపాటి అటవీ ఉత్పత్తులు, చిన్నపాటి వ్యవసాయంపై బతికే అక్కడి చిన్నకారు రైతులు కష్టమర్ల నిజాయితీ మీద బతుకుతున్నారు. పొద్దస్తమానం అడవుల్లో, పొలాల్లో పనిచేసే ఆ చిన్నకారు రైతులు ఉదయం పొలాలకు వెళ్లేటప్పుడు తమ ఉత్పత్తులను అక్కడ అమర్చి పోతారు. ఇళ్లకు వెళ్లేటప్పుడు డబ్బులను తీసుకొని వెళతారు. తోటి మనిషి పట్ల వారికి అపార విశ్వాసం. తోటి మనిషుల పట్ల కరుణ చూపడం, ఔదార్యం ప్రదర్శించడం, వ్యక్తిగత స్వార్థం లేకపోవడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన నైజం. ఈ నైజాన్ని వారు తమ మిజో భాషలో ‘హామ్నింగాయినా’ అని పిలుస్తారు. మిజోరమ్ రాజధాని ఐజాల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన సన్నకారు రైతుల తాత్కాలిక అమ్మకాల షేడ్లు ఉన్నాయి. వాటిలో వారు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అడవిలో దొరికే ఇతర ఆహార పదార్థాలు, స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు విక్రయిస్తారు. తాము నిజంగా కస్టమర్ల నిజాయితీపైనే బతుకుతున్నామని, కొన్నేళ్ల నుంచి తమ ఉత్పత్తులను కాపలాలేకుండా విక్రయిస్తున్నా ఇంతవరకు ఎవరూ మోసం చేసిన దాఖలాలు లేవని వారిని కలిసిన మీడియాకు వారు వెల్లడించారు. కొన్నిసార్లు తాము సూచించిన ధరకన్నా ఎక్కువే డబ్బులు వచ్చాయని, ఆ డబ్బులను తాము బోనస్‌గా భావిస్తామని వారు చెప్పారు. వ్యవసాయ పనులపై ఆధారపడి బతికే తాము ఉత్పత్తుల విక్రయం కోసం ఓ వ్యక్తిని పెట్టుకునే స్థోమత తమకు లేకపోవడం వల్లనే తాము ఈ తరుణోపాయాన్ని కనుగొన్నామని వారు చెప్పారు. తాము ఎన్నడూ మోసపోలేదుకనుక ఈ పద్ధతినే కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. ‘నిజాయితీకి పెద్దగా విలువలేని ఈ దేశంలో మిజోలు అంత నిజాయితీగా ఉన్నప్పుడు, వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు వారిని మోసం చేయాలని అనిపించదు’ అని అటుగా వచ్చిన కస్టమర్లు మీడియాతో వ్యాఖ్యానించారు.