Minister AK Antony
-
పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు భారతీయ సైనికులను చంపినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చాణక్యపురిలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కార్యకర్తలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎక్కి అత్యధిక భద్రతా జోన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే వీరిని చెదరగొట్టడం కోసం పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. వీరిలో 170 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. అలాగే నయాదౌర్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు సైనికులను చంపడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ హైకమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నివాసం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు భారతీయ సైనికులను చంపినందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చాణక్యపురిలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కార్యకర్తలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎక్కి అత్యధిక భద్రతా జోన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే వీరిని చెదరగొట్టడం కోసం పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. వీరిలో 170 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. అలాగే నయాదౌర్ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు సైనికులను చంపడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ హైకమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నివాసం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.