breaking news
milk marchant
-
డెయిరీ సిగలో మరో నగ
కరీంనగర్ డెయిరీ కిరీటంలో మరో కలికితురాయిగా నూతన ప్లాంటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న కరీంనగర్ డెయిరీ, నూతనంగా మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల మెగా ప్లాంట్‌ను స్థాపించనుంది. తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమ ద్వారా రైతుల సేవలో తరిస్తున్న డెయిరీకి మరో అరుదైన అవకాశం దక్కింది. 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న కరీంనగర్ డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్‌కు రూ.63 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.10 కోట్ల సబ్సిడీని సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్రిమ్రత్ కౌర్ బాదల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’ కింద మంజూరు చేశారు. కొత్త ప్లాంటు స్థాపనతో నూతనంగా 500 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా మరెందరికో ఉపాధి కలగనుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ డెయిరీ పాడి పరిశ్రమాభివృద్ధి ద్వారా తెలంగాణలో క్షీర విప్లవానికి నాంది పలికింది. కరీంనగర్ డెయిరీలో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ డెయిరీ పాల మార్కెటింగ్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. రెండు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నుంచి మూడు లక్షలకు పెంచేందుకు పాలకవర్గం కృషి చేస్తోంది. ప్రభుత్వం లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకంతోపాటు పాడిపశువుల కొనుగోలుకు పశువుకు రూ.30 వేల సబ్సిడీ పథకం కూడా ప్రకటించి గత సెప్టెంబర్ 24 నుంచి అమలు చేస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది సరాసరి పాలసేకరణ ఆధారంగా రోజుకు 1,47,000 లీటర్లకు లీటరుకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఈ మేరకు రోజుకు రూ.5.88 లక్షలు లబ్ధి కలుగుతుండగా, నెలకు రూ.1,76,40,000 లబ్ధి చేకూరుతోంది. కరీంనగర్ డెయిరీ పరిధిలోని రైతులకు ఈ పథకం ద్వారా రూ.21 కోట్ల 16 లక్షల 80 వేల లబ్ధి వస్తోంది. అదేవిధంగా 70 వేల పాడిరైతులకు పాడిపశువు కొనుగోలుకు ఒక్కో పశువుకు రూ.30 వేల చొప్పున 210 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు కరీంనగర్ డెయిరీ పాలకవర్గం కృషి చేస్తోంది. ఇదే సమయంలో రూ.63 కోట్లతో కరీంనగర్ డెయిరీ నూతనప్లాంటు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 9 జిల్లాలకు ప్రయోజనం.. 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్ ద్వారా తొమ్మిది జిల్లాల రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు రూ.63 కోట్ల వ్యయం కానున్న ఈ ప్లాంట్ కోసం రూ.10 కోట్లు కేంద్రం సబ్సిడీ అందనుంది. ఈ నూతన ప్లాంటుకు గ్లోబల్ అగ్రి సిస్టమ్ వారు సాంకేతిక సలహాలు అందించేలా ఒప్పందం జరిగింది. నూతన ప్లాంటుతో 15 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను స్థాపించనున్నారు. వీటి ద్వారా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందనున్నట్లు డెయిరీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ డెయిరీ చరిత్రలో మరో అధ్యాయం నూతన ప్లాంటు ఏర్పాటు తెలంగాణ రైతాంగానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం. నూతన ప్లాంటు కు గ్లోబల్ అగ్రి సిస్టమ్ వారు సాంకేతిక సలహాలు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందుతారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కృషి, ప్రయత్నంతో తెలంగాణ రైతాం గానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం ప్రారంభం అవుతోంది. – చలిమెడ రాజేశ్వర్‌రావు, చైర్మన్, కరీంనగర్ డెయిరీ -
పెట్రో షాక్‌తో బైక్ అమ్మి గుర్రం కొన్నాడు..
సాక్షి, ముంబయి : పెట్రోల్ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పెట్రోల్ బంకుల్లో తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇక పెట్రో భారాలను భరించలేని ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను అమ్మేసి గుర్రాన్ని కొనుగోలు చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. ముంబయికి 100 కిమీ దూరంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన పాలు విక్రయించే పాండురంగ్ తన బైక్‌ను రూ 22,000కు అమ్మేసి రూ 25,000కు గుర్రాన్ని కొనుగోలు చేశారు. ప్రతిరోజూ ఉదయం పాలు పోసేందుకు ఏడు కిలోమీటర్లు తిరిగే పాండురంగ్ పెట్రోల్ ధర రూ 80 దాటడంతో పెట్రోల్ కొనేందుకే అతనికి రోజుకు రూ 200 వెచ్చించాల్సి వస్తోంది. తన తండ్రి కూడా ఇదే వృత్తిలో ఉండేవాడని, అప్పట్లో ఏడు కిలోమీటర్లు కాలినడకనే తిరుగుతూ పాలు పోసేవారని చెప్పుకొచ్చాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ వృత్తిని తాను చేపట్టానని, వేగంగా పాలు సరఫరా చేసేందుకు బైక్‌ను వాడుతున్నానని చెప్పాడు. పెట్రోల్ ధరలను భరించలేకే తాను బైక్‌ను రూ 22,000కు అమ్మేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను గుర్రంపైనే ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నానని, బైక్‌తో పోలిస్తే గుర్రానికి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉందని, దీని బాగోగులు చూసేందుకు వారానికి కేవలం రూ 50 ఖర్చు చేస్తున్నానని చెప్పాడు. భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని పోషించాల్సిన పాండురంగ్ గుర్రంపై పాలుపోస్తుండటంతో పెట్రోల్‌పై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గింది. పెట్రోల్ పంపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుడా పోయిందని చెబుతున్నాడు. ముంబయిలో లీటర్ పెట్రోల్ దేశంలోనే అత్యధికంగా రూ 85.29కు చేరింది. -
బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
బాలికను గర్భవతిని చేసిన పాల వ్యాపారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ వేలూరు జిల్లా ప్రత్యేక మహిళా కోర్టులో తీర్పునిచ్చారు. వేలూరు జిల్లా ఆనకట్టు నియోజకవర్గంలోని కన్నికాపురం గ్రామానికి చెందిన ఏయుమలై(28) పాల వ్యాపారి. గత సంవత్సరం జనవరిలో అదే గ్రామానికి చెంది న 15 ఏళ్ల బాలిక కు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దీని గురించి తెలియని ఆ బాలిక మత్తు నుంచి స్పృహలోకి వచ్చిన తరువాత తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ తరువాత గర్భం దాల్చింది. విషయం తెలుసున్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. బాలికను వద్ద విచారించగా పాల వ్యాపారి ఏయుమలై మత్తు మందు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే తల్లిదండ్రులు వేలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఏయుమలైను అరెస్ట్ చేశారు. అనంతరం సత్‌వచ్చారిలోని ప్రత్యేక మహిళా కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ విచారణ జరిపి ఏయుమలైకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. అదే విధంగా బాలిక కు 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.