టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్ 'మాయాబజార్'
బెంగళూరు: తెలుగులో అద్భుత చిత్రరాజం 'మాయాబజార్'. ఈ ఏడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్ విభాగంలో మాయాబజార్ సినిమాను ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 4 నుంచి నగరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాలినీ రజనీష్ బుధవారం ఇక్కడ తెలిపారు.
మాయాబజార్ చిత్రం 1957 మార్చి 27న విడుదలైంది. అద్భుత విజయం సాధించింది. 2007 మార్చినాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. అపూర్వమైన, అనన్యసామాన్యమైన ఈ కళాఖండానికి ఆ తరువాత రంగులు కూడా అద్దారు.
**