breaking news
market blast
-
నిజామాబాద్ నగరంలో భారీ పేలుడు!
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరం రెండో పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దబజార్లో శనివారం రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా పేలుడుతో అక్కడి శివసాయి వైన్స్, ఫ్యాషన్ స్టోర్, లక్ష్మీనర్సింహస్వామి జనరల్ స్టోర్లకు సంబంధించిన షెడ్లు ధ్వంసమయ్యాయి. చెత్త ఏరుకునే వ్యక్తి కెమికల్ పదార్థాలను తీసుకురావడంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. కెమికల్ పదార్థాలు ఉన్న బాక్సును ఊపడంతో పేలుడు జరిగిందని వెల్లడించారు. స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పేలుడులో చేతికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించినట్లు రెండో టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపారు. ఇది బాంబు పేలుళ్లా.. లేక రసాయినిక చర్య కారణంగా జరిగిన పేలుడా అనేది దర్యాప్తులో తేలనుందని చెప్పారు. Telangana| 1 person injured in a blast in Bada Bazar area,Nizamabad We received info about a blast.The injured in the incident told that the blast happened when he shook a box of chemicals. Fire brigade was called.Injured was taken to hospital,he is fine now:SHO One Town(10.12) pic.twitter.com/HVY9K1n51E — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: అమ్మో పులి...! జిల్లాలో మళ్లీ చిరుతల అలజడి -
మార్కెట్ వద్ద బాంబు పేలుడు: అయిదుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ టక్కర్ ప్రావెన్స్లోని ఖ్వాజాగఢ్ జిల్లా స్థానిక మార్కెట్ వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో అయిదుగు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు తెలిపారు. మార్కెట్లో జనం అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ఆ బాంబు పేలుడు సంభవించిందని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించ లేదన్నారు. అయితే ఇది తాలిబాన్ తీవ్రవాదుల పనే అని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో ఆఫ్ఘానిస్థాన్‌లో జరిగిన హింస కారణంగా 1560 మంది మృత్యువాత పడగా, 3290 మంది గాయపడ్డారని కాబూల్‌లోని యూఎన్ మిషన్ వెల్లడించింది.