breaking news
Mandi House
-
ప్రేమ ఖైదీ@ మండీ
బంజారాహిల్స్: క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరిని కదిలించినా వారు చెప్పేదొకటే.. మేం చిన్నప్పుడు ఒకే కంచంలో తిన్నాం..రా అని.. అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఒకే కంచంలో తినే అనుభూతిని కల్పించే మండీ ట్రెండ్ కొనసాగుతోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ భారీ కంచంలో నచి్చన ఫుడ్ తింటూ సరదా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నగరంలో ఎప్పటి నుంచో మండీ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం వీటికి కొత్త తరహా థీమ్స్ జతచేస్తున్నారు.. దీంతో ఆహార ప్రియులు వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. సాధారణ రెస్టారెంట్లతో పోలిస్తే ఈ మండీలలో దొరికే ఫుడ్ కాస్త వెరైటీ.. మణికొండలో బాహుబలి ప్లేట్ పేరుతో ఒకేసారి 25 మంది కూర్చొని తినే కాన్సెప్ట్ ఆ మధ్య ఫేమస్ అయ్యింది. దీంతో మరికొన్ని థీమ్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.. మండీ కల్చర్ వాస్తవానికి సౌదీ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా ఏళ్ల నుంచే నగరంలో ఈ తరహా రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. వీటిలో దొరికే ఫుడ్ బయటి రెస్టారెంట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. సౌదీ దేశాల్లోని మండీ రెస్టారెంట్ల మాదిరే ఇక్కడ బిర్యానీలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడతారు. తక్కువ స్పైసీతో వంటకాలు చేయడం మండీ రెస్టారెంట్ల ప్రత్యేకత. సహజ మసాల దినుసులు, కారం తక్కువగా వినియోగించి చికెన్, మటన్, ఫిష్ తదితర వంటకాలను విభిన్నంగా తయారు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగువారు పెత్త ఎత్తున మండీలకు వస్తుండటంతో వారి అభిరుచికి అనుగుణంగా వంటకాలను వడ్డిస్తున్నారు. ప్రత్యేక థీమ్‌లతో..సాధారణ మండీలకు వెళ్లి బోర్ కొట్టిన నగరవాసుల కోసం వ్యాపారులు ఈ మధ్య జైల్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మండీ పేరుతో ఏర్పాటైన కొత్త థీమ్‌లు క్రేజ్ సొంత చేసుకుంటున్నారు. ముఖ్యంగా జైలు వాతావరణాన్ని తలపించేలా రూపొందించిన జైలు మండీలో రిమాండ్‌లో ఉన్న ఖైదీల మాదిరిగా లోపల కూర్చొని తింటూ నగరవాసులు సెలీ్ఫలు దిగుతూ మురిసిపోతున్నారు. ఈ జైలు మండీలో ఫుడ్‌ను తీసుకొచ్చే వారంతా ఖైదీల దుస్తులతో..ఉంటారు. ఇక కౌంటర్లో ఉండే వ్యక్తి జైలర్‌గా, ఫుడ్‌లో ఏదైనా సమస్య వస్తే తీర్చేందుకు ఓ వ్యక్తి లాయర్ గెటప్‌లో దర్శనమిస్తారు. ఇక గర్ల్ ఫ్రెండ్ మండీలో కుటుంబ సభ్యులు, ప్రేమికులు కూర్చొని తినే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో సుమారు 150కి పైగా మండీ రెస్టారెంట్లు నడుస్తున్నాయి.ఫ్యామిలీలు ఎక్కువగా వస్తున్నారుజైలు మండీలో భోజనం చేసేందుకు ఎక్కువగా ఫ్యామిలీలు వస్తున్నాయి. జైలు థీమ్‌లో ఫొటోలు దిగుతూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. జైలులో ఎలాంటి వాతావరణం ఉంటుందో అదే తరహాలో ఉంటుంది. జైలు బ్యారెక్‌లో రుచికరమైన భోజనం చేసి వెళ్తున్నామనే తృప్తి వారికి కలిగిస్తున్నాం. – ప్రవీణ్, జైలు మండీ మేనేజర్ -
‘జైలు’లో పెళ్లి సందడి హీరోయిన్
ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు... చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ మండి రెస్టారెంట్. పెళ్లి సందడి సినిమా ఫేం శ్రీలీల ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లో మొత్తం జైలు వాతావరణం ఉండేలా..ఫన్నీగా తీర్చిదిద్దారు. -
ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం
సాక్షి, సనత్‌నగర్: హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్‌కి గుర్తొచ్చే బిర్యానీకి ఇప్పుడు పెద్ద పోటీ వచ్చి పడింది. అచ్చం బిర్యానీనే తలపించే ఒకనాటి సంప్రదాయ మండీ... నగరవాసులకు లేటెస్ట్ క్రేజీ డిష్‌గా మారిపోయింది. ఇటీవలి కాలంలో మరే డిష్ కూడా ఇంత వేగంగా సిటిజనులకు చేరువ కాలేదని ఫుడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆరేబియన్ రెస్టారెంట్లలో మండీ, ఖబ్సా వంటకాలే ప్రధానం. వీటిని మటన్, చికెన్, బోన్‌లెస్ ఫిష్, కౌజుపిట్టలతో తయారుచేస్తుంటారు. ఒకనాటి అరబిక్ సంప్రదాయ యెమిని వంటకం అయిన మండీని మటన్, రైస్‌కు తగినన్ని మసాలాలు కలిపి మాంసంలోని కొవ్వులతో దీనిని వండుతారు. కొన్ని చోట్ల మండీని డ్రైఫ్రూట్స్, మటన్ సూప్‌ను మిక్స్ చేసి కూడా అందిస్తారు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో ఒకప్పుడు ఇది బాగా పాపులర్ కాగా.. ఇప్పుడు నగరవ్యాప్తంగా అంతకు మించి భోజన ప్రియుల ఆదరణ పొందుతోంది. మండి పుణ్యమాని బార్కాస్‌కి కూడా సిటీ ఫుడ్ మ్యాప్‌లో చెప్పుకోదగ్గ స్థానమే లభించింది. అడుగడుగునా.. కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే మండీ సిటి వ్యాప్తమైంది. బార్కాస్ తర్వాత బంజారాహిల్స్‌లోని స్పైస్ 6 ఈ అరబిక్ ఫుడ్, ఆ తర్వాత మెహదీ పట్నం అలా అలా... ఇప్పుడు మండీని నగరంలోని దాదాపు ప్రతి రెస్టారెంట్ అందించడం ప్రారంభించాయి. స్విగ్గీ జాబితా ప్రకారం... ప్రతి చోటా సగటున 10 ప్రాంతాల్లో ఇది లభ్యమవుతోంది. ఖైరతాబాద్‌లో 22, అత్తాపూర్‌లో 17, సైనిక్‌పురిలో 10, అమీర్‌పేట్‌లో 23 చోట్ల మండీ అందుబాటులో ఉంది. ఇక ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో సైతం పెద్ద సంఖ్యలో ఆరేబియన్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయంటే కారణం మండీయే. ఆ‘ధర’ణ అందుకే.. ఇది రూ.200 సమీప ధరలో అందుబాటులో ఉండడం వల్ల యువతకు బాగా చేరువైంది. అలాగే మరోవైపు చూడడానికి బిర్యానీ తరహా రుచి, పొడిగా ఉండడం వల్ల హైదరాబాదీలకు బాగా నచ్చుతోందని ఫుడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దీనిలో చికెన్, ఫిష్ మండీ కూడా లభిస్తోంది. ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం అందరూ కలిసి ఒకే కంచంలో తినడం అనేది అరబిక్ సంప్రదాయంలో భాగం. యెమన్, సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. పీట చుట్టూ కూర్చొని ఆ పీటపై ఉంచిన పెద్ద ప్లేటులో వడ్డించిన మండీని అందరూ కలసి భుజిస్తారు. అదే ఇప్పుడు భోజన ప్రియులను కట్టిపడేసింది. .గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేసే సంస్కృతి దాదాపుగా కనుమరుగైపోయింది. ఎవరికి సమయాన్ని బట్టి వారు తినేస్తున్నారు. బయట రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు కలసి భోజనం చేస్తుంటారు. కానీ ఒకే కంచంలో కలిసి భోజనం చేసే సంస్కృతి ని అరేబియన్ మండీ రెస్టారెంట్లు తిరిగి తెచ్చాయని చెప్పవచ్చు. ఫుడ్రిఫ్టర్కు చెందిన అశిష్ నాయక్ ఏమంటారంటే... పలువురు స్నేహితులతో కలిసి కూర్చుని కబుర్లతో పాటు తినడం చాలా ఆనందాన్ని అందిస్తుంది. మండీ గెట్ టు గెదర్ ఓవర్ ఫుడ్ లాంటిది కమ్యూనిటీ డైనింగ్‌కు ఇది మంచి ఊతమిస్తోంది’’ అంటున్నారు. పాత ఒక కొత్త... సిటీ ప్రజలు కొత్త రకం వంటకాలను కోరుకుంటుంటారనడానికి మండీ రెస్టారెంట్లకు వస్తున్న ఆదరణే సాక్ష్యం. ఒకప్పుడు ఓల్డ్‌సిటీలోనే ఉన్నప్పటికీ చాలా మందికి వీటి గురించి తెలియదు. దీంతో వారికి ఇది కొత్తగా పరిచయమైంది. అరేబియన్ సంప్రదాయం అయినప్పటికీ ఎక్కువ శాతం ముస్లిమేతరులే రెస్టారెంట్‌కు వస్తున్నారు. – మహ్మద్ ఇమ్రాన్, ఆరేబియన్ మండీ రెస్టారెంట్ మూసాపేట కలిసి తింటే కలదు రుచి... ఇంట్లో ఉన్నప్పుడు కలసి భోజనం చేసే సమయం కుదరదు. అందులోనూ ఒకే కంచంలో తినడం జరగని పని. ఆరేబియన్ మండీ రెస్టారెంట్లో కలసి భోజనం చేయడమే కాదు..ఒకే కంచంలో చేయడం, అందులోనూ ఎంచక్కా కింద కూర్చొని తినడం మధురానుభూతిని ఇస్తోంది. – జ్యోతి, కూకట్పల్లి. కాక్టైల్ మిక్సింగ్ మిక్సింగ్ అనేది ఒక కళ. కలపడంలో మెళకువలు తెలిస్తే కాక్టెయిల్ కింగ్ అనిపించుకోవచ్చు. నగరానికి చెందిన మిక్సాలజిస్ట్ చాపాయ్ ఆనంద్ అదే సాధించారు. తాజాగా ఢిల్లీ జరిగిన బ్రౌన్ఫోర్మన్ అమెరికన్ విస్కీ లెగసీ కాక్టైల్ ఛాలెంజ్ 2020 గెలుచుకున్నారు. భారతదేశపు బెస్ట్ మిక్సాలజిస్ట్ పురస్కారం కోసం నిర్వహించిన వేట ముగిసింది. నగరంలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న చపాయ్ ఆనంద్ ఈ పోటీలో విజేతగా నిలిచాడు. ఈ చాలెంజ్‌లో దేశవ్యాప్తంగా 250 మంది పాల్గొన్నారు. వీరిలో 8మంది ఫైనలిస్టులుగా ఎన్నికయ్యారు ఢిల్లీలోని ఏరో సిటీలో ఉన్న జెడబ్ల్యూ మారియట్ హోటల్ ప్లే గ్రౌండ్ బార్లో ఈ పోటీ నిర్వహించారు. దేశంలోని మరో ఏడుగురు ఫైనలిస్ట్స్‌తో పోటీ పడి చపాయ్ ఆనంద్ ఈ టైటిల్ దక్కించుకున్నారు. ముంబయికి చెందిన ఓమ్ చౌహాన్, ఈ పోటీలో ఏకైక మహిళ బెంగుళూర్‌కి చెందిన ఆరతీ మెర్సీ వీరిద్దరూ ఫస్ట్, సెకండ్ రన్నరప్ టైటిల్స్ అందుకున్నారు. ది డార్క్ సోల్, ది చాంటిక్ జాక్, ది మానికర్స్ వంటి కాక్‌టైల్స్‌ను ప్రదర్శించి ఆనంద్ ప్రశంసలు పొందాడు. ‘‘నా అవార్డ్‌ని నా కో కాంటెస్టెంట్స్ అందరికీ అంకితం చేస్తున్నా. ఆహారం వృథా చేయడానికి నేను వ్యతిరేకిని. బైకర్‌గా ట్రెక్స్, రైడ్స్‌కి వెళ్లినప్పుడు కొన్ని సార్లు ఏ రకమైన ఆహారం దొరకని చోట ఇరుక్కుపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అందుకే ఫుడ్ వేస్ట్ లేని ముడిదినుసులనే నా కాక్టైల్ మేకింగ్‌లో వినియోగించానని చెప్పాడు ఆనంద్. ఈ టైటిల్ విజయాలకు సంబంధించి అమెరికా తదితర దేశాల్లోని ప్రసిద్ధ డిస్టలరీలు సందర్శించడం, విస్కీ మేకింగ్ మెళకువలను నేర్చుకోవడం వంటివి ఆనంద్ అందుకోనున్నాడు. -
మండీహౌస్‌లోనూ నాలుగు ఫ్లాట్‌ఫాంలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో ఇంటర్చేంజ్ స్టేషన్‌గా మారబోతున్న మండీహౌస్ మెట్రోస్టేషన్లో నాలుగు ఫ్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజీవ్‌చౌక్, కశ్మీరీగేట్, ఇంద్రలోక్ ఇంటర్‌చే ంజ్ స్టేషన్ల మాదిరిగా ప్రయాణికులు లైన్లు మారేందుకు మెట్లు ఎక్కిదిగాల్సిన పనిలేదు. సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ మాదిరిగానే ఈ స్టేషన్లోనూ సమాంతరంగా నాలుగు లైన్లను నిర్మిస్తున్నారు. కేంద్రీయ సచివాలయ్ మెట్రో స్టేషన్లో బదర్పూర్నుంచి వచ్చే ప్రయాణికులు, ఐఎన్ఏ లేదా రాజీవ్‌చౌక్ వైపు వెళ్లే ప్రయాణికులు కేవలం ఒకేసారి మెట్లు దిగితే సరిపోతుంది. అదేవిధంగా మండీహౌస్ మెట్రోస్టేషన్లోనూ నిర్మాణ పనులను సంబంధిత అధికారులు వేగవంతం చేశారు. దీనిలో ఒకే వరుసలో నాలుగు లైన్లు పక్కపక్కన ఉంటాయి. ఈ విధానంతో రద్దీ ఎక్కువగా ఉన్నా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారివారి స్టేషన్లకు వె ళ్లే వీలుంటుంది. బదర్‌పురా-ఫరీదాబాద్ వెళ్లే వీలు: డీఎంఆర్సీ చేపట్టిన మండీహౌస్ స్టేషన్ ఇంటర్చేంజ్ స్టేషన్ పూర్తయితే ప్రయాణికులు నేరుగా బదర్‌పురా-ఫరీదాబాద్ వెళ్లే వీలుంటుంది. అదే విధంగా నోయిడా-వైశాలి నుంచి ఐటీఓ లేదంటే షాద్రా నుంచి ఐటీఓ, లాల్‌కిల్లా నుంచి వచ్చేవారు సైతం త్వరగా వెళ్లే వీలుంటుంది. కాగా అధికారిక సమాచారం ప్రకారం కేంద్రీయ సచివాలయం నుంచి మండీహౌస్ మధ్య లైన్ 2014 మార్చినాటికి అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌పై దాదాపు లక్షన్నరమంది ప్రయాణికుల భారం తగ్గుతుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వైపులకు వెళ్లేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయి.