breaking news
Madrid Open tournament
-
Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి. -
క్వార్టర్స్‌లో సానియా జోడి
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-4, 6-1 తేడాతో హావ్ చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-చానెలే షీపర్స్ (చైనా) జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. ఇటీవలే పోర్చుగల్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని ఊపుమీదున్న సానియా ద్వయం తొలి సెట్లో ఒక దశలో 4-1తో దూసుకెళ్లింది. అయితే చాన్-షీపర్స్ జోడి పోరాట పటిమ కనబరిచి ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. తిరిగి పట్టు సాధించిన సానియా-కారా ద్వయం తొలిసెట్లో నెగ్గడంతోపాటు రెండో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకొని మ్యాచ్‌ను గెలుపొందింది.