breaking news
Love jihadi
-
లవ్ జిహాద్‌కు మదర్సాలే కేంద్రాలు
బరేలీ: ’లవ్ జిహాద్, ప్రపంచ కలహాలకు కేంద్రాలకు మారిన మదర్సాలను మూసివేయాలని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ‘హిందువులు డబ్బు సంపాదన గురించే ఆలోచిస్తారు. ఒక ప్రత్యేకవర్గం మాత్రం భారత్‌ను పాలించాలని ఆలోచిస్తుంటుంది. వెయ్యేళ్లు భారత్‌ను పాలించడమే వారి ఎజెండా’అని యూపీలోని బరేలీలో ఆదివారం ఆమె మీడియాతో అన్నారు. ‘లవ్ జిహాద్ మదర్సాల నుంచే మొదలవుతోంది. అక్కణ్నుంచే వ్యాప్తి చెందుతుంది. దేశంలో మదర్సాలు మూసేసిన రోజున లవ్ జిహాద్ ఉనికిలోనే ఉండదు. అప్పుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి’అని ఆమె మీడియాతో అన్నారు. -
ట్యూషన్‌కు వచ్చిన యువతిని బలవంతంగా..
లక్నో : ‘లవ్ జిహాద్’ పేరుతో 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల ప్రకారం..యూపీ మీరట్‌కు చెందిన 25 ఏళ్ల అమన్ అనే యువకుడు తన వద్ద ట్యూషన్‌కు వచ్చిన యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని కోరగా, అందుకు అమ్మాయి అంగీకరించలేదు. దీంతో ఆమె తమ్ముడిని హత్య చేస్తానంటూ అమన్ బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో తెలిపింది. (పెళ్లి చేసుకోవాలని మహిళ వేధింపులు.. జవాను ఆత్మహత్య) యువతిని ఢిల్లీకి తీసుకెళ్లిన అమన్..ఆమెను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. ట్యూషన్‌కు వెళ్లిన యువతి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్ టీచర్ అమన్ తమ కూతురిని కిడ్నాప్ చేసినట్లు వారు ఫిర్యాదులో తెలిపారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా యువతి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..అమన్‌ను అరెస్ట్ చేసి, యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు యువతి పేర్కొనడంతో అమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. (ప్రాణం తీసిన ప్రేమ ) -
మల్కాజిగిరిలో మరో లవ్ జిహాదీ
-
సామాన్యులు చేస్తే తప్పా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘లవ్ జిహాదీ’ పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన 24 ఏళ్ల అఖిల అశోకన్ అలియాస్ హదియా పెళ్లి కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికరమైన చర్చ, వాదోపవాదాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లు హిందూ మహిళలను వివాహం చేసుకొని వారి మతాన్ని మార్చవచ్చుగానీ ఓ సామాన్య హిందూ మహిళైన అఖిల మతం మారి పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అని ఆమెను పెళ్లి చేసుకున్న షఫీన్ జహాన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇష్టపూర్వకంగా మతం మారి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం యువకుడైన జహాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె పెళ్లిని రద్దు చేయడమే కాకుండా లవ్ జిహాదీ కేసంటూ వేధింపులకు గురిచేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖులు పెళ్లి చేసుకుంటే తప్పులేదుగానీ, సామాన్యుల పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అలాంటప్పుడు అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లను కూడా లవ్ జిహాదీ కింద ఎందుకు విచారించరని న్యాయవాది ఆవేశంగా సంవాదం చేయడం కొత్త చర్చకు దారితీసింది. భారతీయ జనతా పార్టీలో వీరిద్దరే కాకుండా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సికందర్ భక్త్ కూడా హిందూ మహిళనే పెళ్లి చేసుకున్నారు. వీరి భార్యలు కూడా ఇస్లాం మతం స్వీకరించారు. ఒక్క బీజేపీనే కాదు, మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆరెస్సెస్, వీహెచ్‌పీ, శివసేన నాయకుల ఇళ్లలోనే మతాంతర వివాహాలు దివ్యంగా జరిగాయి. శివసేన దివంగత చీఫ్ బాల్ ఠాక్రే మనమరాలు ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కూతురు కూడా ముస్లిం యువకుడినే పెళ్లి చేసుకొంది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూతురు ముస్లిం యువకుడిని, బీజేపీ నేత సుబ్రమణియం స్వామి కూతురు సుహాసినీ కూడా ముస్లింనే పెళ్లి చేసుకొంది. పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మేన కోడలు కూడా ముస్లింను పెళ్లి చేసుకుంది. ఇక ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ మాజీ భార్య సంగీత బిజిలానీ అనే విషయం అందరికి తెల్సిందే. బాలివుడ్ హీరో షారూక్ ఖాన్, గౌరీని, నవాబ్ అలీఖాన్ పటోడి, షర్మిలా ఠాకూర్‌ను, అర్బాజ్ ఖాన్, మల్లికా అరోరాను, షైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారని, వారంతా హిందూ మహిళలేనన్న విషయం తెల్సిందే. ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీణు, రెండో భార్య కిరన్ రావులు కూడా హిందువులే. అఖిల అలియాస్ హదియా కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా కీలకమైన న్యాయ అంశాలను లేవనెత్తారు. మైనారిటీ తీరిపోయిన అఖిల తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దాన్ని రద్దు చేసే హక్కు ఓ హైకోర్టుకు రాజ్యాంగంలోని 226 కింద ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న ఈ అధికరణం కింద పెళ్లిని రద్దు చేయడం అంటే ఆ హక్కునే ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. అఖిల పెళ్లిని రద్దు చేయడంపై పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పెళ్లి చెల్లుతుందా, లేదా అన్న అంశానికే పరిమితం కావాల్సిన సుప్రీం కోర్టు బెంచీ ఆమెకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయో, లేవో తేల్చాల్సిందిగా 136 అధికరణం కింద సంక్రమించిన అధికారాల మేరకు ఎన్ఐఏను ఆదేశించడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడే ఉన్న సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్‌ను పిలిచి ప్రశ్నించారు. ఓ కేసులో సంపూర్ణ న్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు 136 అధికరణం కింద కాకుండా 142 అధికరణం కింద ఇలాంటి అదేశాలను సుప్రీం కోర్టు జారీ చేయవచ్చని నారిమన్ వివరించారు. పైగా పెళ్లిని రద్దు చేసినప్పటి నుంచి తండ్రి ఇంట్లో కూతురును నిర్బంధించి ఉంచడం, అందులో పోలీసుల కాపలా పెట్టడం ఏమిటని కూడా మిశ్రా ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. హోమియోపతి డిగ్రీ చదివిన అఖిల 2016 మొదట్లోనే ఇస్లాం కోర్సు పాసై మతం మార్చుకున్నారు. అదే సంవత్సరం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సంబంధాలు వెతక్కొని 2016, డిసెంబర్ నెలలో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ముస్లిం సంఘాల ప్రోద్బలంతో అఖిల పెళ్లి చేసుకున్నారంటూ, ఇది లవ్ జీహాదీయేనంటూ ఆమె తండ్రి అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో 2017, మే 24వ తేదీన కేరళ హైకోర్టు ఆమె పెళ్లిని రద్దు చేసింది. ఆమెను తండ్రి సంరక్షణలో ఉండాల్సిందిగా ఆదేశించింది. కేరళలోని కొట్టాయం జిల్లా, టీవీ పురంలోని తన తండ్రి ఇంట్లో అఖిల నిర్బంధంగా ఉంటున్నారు. ఆమె భర్త షఫీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ కొనసాగుతోంది. -
వాళ్లు ఒప్పుకున్నా...మేం అడ్డుకుంటాం
♦ మతాంతర వివాహానికి సిద్ధమైన ప్రేమికులు ♦ అంగీకరించిన ఇరు కుటుంబాలు ♦ ఇది లవ్ జీహాది అంటూ హిందూ సంఘటన కార్యకర్తల ధర్నా మాండ్య (కర్ణాటక): ఓ ప్రేమ జంట మతాంతర వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినా అది లవ్ జీహాద్ అంటూ హిందూ సంఘటన కార్యకర్తలు యువతి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మాండ్య నగరంలోని అశోకనగర్ రెండో క్రాస్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ హెచ్.వి.నరేంద్రబాబు, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న బియ్యం వ్యాపారి ముఖ్తార్ ఆహ్మద్ బాల్య స్నేహితులు. నరేంద్రబాబు కుమార్తె అశితా, ముఖ్తార్ అహ్మద్ కుమారుడు షకీల్ చిన్నప్పటి నుంచి ఎంబీఎ వరకు కలిసి చదువుకున్నారు. పీయూసీలో మొదలైన వీరిద్దరి ప్రేమ చదువు పూర్తయ్యేవరకు కొనసాగింది. ఇరుకుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించాయి. ఈ నెల 17న మైసూరులోని తాజ్ కన్వెన్షన్ హాల్లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘటన కార్యకర్తలు మంగళవారం యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇది మతాంతర వివాహం కాదని.. లవ్ జీహాది పేరుతో ఓ మతానికి చెందిన యువకుడు, మరో మతానికి చెందిన యువతిని వివాహం చేసుకుంటున్నాడని ఆరోపించారు. వివాహానికి యత్నిస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఇద్దరూ చిన్న వయసు నుంచి కలిసి చదువుకొని ప్రేమించుకున్నారని, అం దుకే వారి వివాహానికి అంగీకరించామని, ఇందులో మతాలు మారడం ఏమీ లేదని పేర్కొన్నారు. యువకుడి తండ్రి ముఖ్తార్ అహ్మద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వివాహ వేడుకల్లో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని విన్నవించారు.