breaking news
Lemon leaf
-
నిమ్మ ఆకులతో ప్రయోజనాలెన్నో..
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. అంతే! నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. -
నచ్చుథాయ్!
అంతా మన పద్ధతే... అన్నం కూడా అరిటాకులోనే. కాకపోతే కారపు కూరల్లోనూ కాస్త బెల్లం! నిమ్మఆకు ఎగస్ట్రా!! రుచి డబుల్ ఎక్స్ట్రా!! నోటికి హాయ్ అనిపించేథాయ్ వంటలు తింటే మీకు తప్పకుండా నచ్చి తీరు‘థాయ్’. గ్రీన్ కర్రీ చికెన్ కావల్సినవి ఉల్లికాడలు - 4 అల్లం తరుగు - టేబుల్ స్పూన్ నిమ్మకాయ - 1 (తొక్క పై భాగాన్ని కొబ్బరికోరుతో సన్నగా తురమాలి. దీనిని లెమన్ జెస్ట్ అంటారు) ఉల్లిపాయ తరుగు - 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర - టీ స్పూన్ ధనియాలు - టీ స్పూన్ లవంగాలు - 4 గ్రీన్ కర్రీ కోసం... సన్‌ఫ్లవర్ ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు గ్రీన్ కర్రీ పేస్ట్ (ఉల్లికాడలు, కొత్తిమీర, పాలకూర, పుదీనా) - 180 గ్రా.లు తులసి ఆకుల తరుగు - టీ స్పూన్ కొబ్బరి పాలు - అర లీటరు బోన్‌లెస్ చికెన్ - అర కేజీ చికెన్‌ను ఉడికించిన నీళ్లు - అర లీటరు బెల్లం - 100 గ్రా.లు ఉప్పు - తగినంత తయారీ: జీలకర్ర, లవంగాలు, ధనియాలు వేయించి, పొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక గ్రీన్ కర్రీ పేస్ట్, మసాలా(జీలకర్ర, లవంగాలు, ధనియాల పొడి) వేసి వేగించాలి. చికెన్‌ను ఉడికించిన నీళ్లు పోసి మరిగించాలి. చికిన్ను వేసి, నీళ్లు సగం అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. బెల్లం, సాస్, ఉప్పు వేసి బాగా మరిగించి చివరగా తులసి ఆకులు వేసి సర్వ్ చేయాలి. ఈ కర్రీ అన్నం, రోటీ, పూరీల కాంబినేషన్‌కు బాగుంటుంది. నూడుల్ అండ్ ష్రింప్ సలాడ్ కావల్సినవి: నూడుల్స్ (సన్నగా ఉండేవి) - 120 గ్రా.లు ఉల్లికాడలు - 75 గ్రా.లు రొయ్యలు - 4 వెల్లుల్లి రెబ్బలు - 5 పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు టొమాటో గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు బెల్లం - రెండున్నర టేబుల్ స్పూన్లు పాలకూర తరుగు - టేబుల్ స్పూన్ మిర్చి సాస్ (పండుమిరప పేస్ట్ వాడచ్చు) - టేబుల్ స్పూన్ ఉప్పు నీళ్లు - టేబుల్ స్పూన్ నిమ్మరసం - టీ స్పూన్ ఉప్పు - తగినంత తయారీ: గిన్నెలో నీళ్లను మరిగించి, అందులో నూడుల్స్ వేసి ఉడికించి, జల్లిలో పోసి వడకట్టాలి. జల్లిలో ఉన్న వేడి నూడుల్స్ పైన చల్లని నీళ్లు పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నూడుల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోవు. వీటిని ఒక పక్కగా ఉంచాలి.శుభ్రపరుచుకున్న రొయ్యలను మరుగుతున్న నీళ్లలో వేసి, ఉడికించి, వడకట్టి, పక్కన ఉంచాలి.చిన్న గిన్నెలో బెల్లం తరుగు, నిమ్మరసం, మిర్చి సాస్ వేసి కలపాలి. బెల్లం మొత్తం కరగనివ్వాలి. మరొక గిన్నెలో మిగిలిన పదార్థాలన్నీ వేసి, మిర్చి సాస్ మిశ్రమం కూడా కలిపి కొద్ది సేపు ఉంచాలి. పదార్థాలన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకొని సర్వ్ చేయాలి. కార్న్ ఫ్రిటర్స్ కావల్సినవి మొక్కజొన్న గింజలు - 200 గ్రా.లు మొక్కజొన్న పిండి - 4 టేబుల్ స్పూన్లు పండుమిరప పేస్ట్ - టీ స్పూన్ పంచదార - అర టీ స్పూన్ నిమ్మ ఆకుల తరుగు - చిటికెడు ఉల్లికాడల తరుగు - టీ స్పూన్ అల్లం తరుగు - టీ స్పూన్ ఉప్పు - తగినంత రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత తయారీ: గిన్నెలో అన్ని పదార్థాలు వేసి కలిపి, తగినన్ని నీళ్లు జతచేసి, ముద్దలా చేయాలి. అన్నీ పదార్థాలు సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి.చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా వత్తుకోవాలి. ఈ మిశ్రమానికి దాదాపు 12 పీసులు అవుతాయి.ఇలా చేసుకున్న ముద్దలను ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చేంతవరకు రెండువైపులా వేయించాలి.ఇలా వేయించుకున్న ఫిటర్స్ని వేడి వేడిగా తేనె లేదా చిల్లీ సాస్ లేదా ఏదైనా పచ్చడితో వడ్డించాలి. బనానా ఫ్రిటర్స్ కావల్సినవి బాగా మగ్గిన అరటిపండు - 1 కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లేక్స్ పౌడర్ లేదా బ్రెడ్ పొడి (కార్న్ ఫ్లేక్స్‌ని పొడి చేయవచ్చు. బ్రెడ్ క్రంబ్స్‌ని పొడి చేసి వాడచ్చు) - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - చిటికెడు చల్లని నీళ్లు - కప్పుడువేయించిన తెల్ల నువ్వులు - అర టీ స్పూన్ తేనె - టీ స్పూన్ కోకోనట్ ఐస్‌క్రీమ్/నచ్చిన ఐస్‌క్రీమ్ - 1 స్కూప్ రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత తయారీ తొక్కతీసిన అరటిపండును నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఉప్పు, కార్న్ ఫ్లోర్, కార్న్ పొడిలో నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. కట్ చేసిన అరటిపండును పిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. తీసి, ప్లేట్‌పై పెట్టి, తేనె వేసి, వేయించిన నువ్వులను పైన చల్లాలి. వెంటనే ఏదైనా ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేయాలి. లెమన్ కొరియాండర్ సూప్ కావల్సినవి: కాలీఫ్లవర్ తరుగు - టేబుల్ స్పూన్ క్యారట్ తరుగు - టేబుల్ స్పూన్ బేబీ కార్న్ తరుగు - టేబుల్ స్పూన్ ఉల్లికాడల తరుగు - టేబుల్‌స్పూన్ టొమాటో ముక్కలు - టేబుల్ స్పూన్ కూరగాయలు ఉడికించిన నీళ్లు (క్యారెట్, క్యాబేజీ, పాలకూర.. మొదలైన కూరగాయలు టేబుల్ స్పూన్ చొప్పున) - లీటరు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర పేస్ట్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్ సోయా సాస్ - టేబుల్ స్పూన్ వేయించిన వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్ వేయించిన ఉల్లిపాయ తరుగు - టేబుల్‌స్పూన్ ఉప్పు - తగినంత పంచదార - ఒకటిన్నర టేబుల్ స్పూన్ తెల్ల మిరియాల పొడి - చిటికెడు మొక్కజొన్న పిండి - మిశ్రమం చిక్కగా కావడానికి తగినంత; నిమ్మరసం - టీ స్పూన్ తయారీ: కూరగాయలను ఉడికించిన నీళ్లను వడకట్టాలి. ఈ నీళ్లలో కొత్తిమీర పేస్ట్, ఇతర కూరగాయల ముక్కలు కలిపి బాగా మరిగించాలి. ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత సాస్, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేసి కలుపుతూ ఉడకనివ్వాలి. తర్వాత మొక్కజొన్న పిండి కలిపి, మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా నిమ్మరసం వేసి, కొత్తిమీర తరుగు చల్లి దించాలి. కర్టెసీ: అరుణ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వివంతా బై తాజ్, బేగంపేట్, హైదరాబాద్