breaking news
Lalit Yadav
-
రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా వెళ్లడంతో క్యాచ్ మిస్ అవుతుందని అనుకున్నాం. కానీ లలిత్ యాదవ్ అద్బుతం చేశాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ కుడిచేత్తో కేవలం వేళ్ల సాయంతోనే అద్బుతంగా అందుకున్నాడు. అయితే ఇక్కడ లలిత్ యాదవ్ దూబేను రనౌట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ రహానే క్యాచ్ అందుకున్న లలిత్ ఆ పని చేయలేకపోయాడు. అయితే లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే షాక్ తినగా.. అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం ఇంప్రెస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What a Catch by Lalit Yadav 🤯🤯#LalitYadav #CSKvDC pic.twitter.com/WJP6GyPXtl — Cricket Apna l Indian cricket l Bleed Blue 💙🇮🇳 (@cricketapna1) May 10, 2023 -
ఏం చేస్తున్నావు.. లలిత్‌పై కోపంతో ఊగిపోయిన వార్నర్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. వరుస పరాజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో లలిత్ యాదవ్‌పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోపంతో ఊగిపోయాడు. ఏం జరిగిందంటే? ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్‌లో వార్నర్ మిడ్ఆఫ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అది మిస్టైమ్ కావడంతో మిడ్‌ఆఫ్‌లో ఉన్న చావ్లా చేతికి వెళ్లింది. చావ్లా ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ క్రమంలో వార్నర్ సింగిల్ కోసంప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న లలిత్ యాదవ్ వార్నర్‌ను గమనించకుండా చావ్లా వైపు చూస్తూ ఉండిపోయాడు. దీంతో వార్నర్ అతడిపై గట్టిగా అరుస్తూ రన్‌కు వెళ్లుంటూ సైగలు చేశాడు. అప్పుడు లలిత్ వికెట్ కీపర్‌వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఒక వేళ చావ్లా బంతిని వెంటనే వికెట్ కీపర్‌కు త్రో చేసి ఉంటే వార్నర్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో వార్నర్ 51 పరుగులు సాధించాడు. ఢిల్లీ తమ తదుపురి ఏప్రిల్ 15న ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: IPL 2023: మా విజయానికి కారణం అదే.. అతడొక యువ సంచలనం! వారికి మరిన్ని.. pic.twitter.com/54kF1ByBuX — IPLT20 Fan (@FanIplt20) April 11, 2023 -
దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే
క్యాష్ రిచ్ లీగ్‌గా పేరు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆటగాళ్ల టాలెంట్‌కు కొదువ లేదు. ప్రతీ ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ ద్వారా ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సహా మిగతా స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. తాజాగా ఐపీఎల్ 2022 ప్రారంభమై కొన్ని రోజులే అయినప్పటికి ఒక ముగ్గురు టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మాత్రం సత్తా చాటుతున్నారు. వారే ఆయుష్ బదోని, తిలక్ వర్మ, లలిత్ యాదవ్. భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్న ఈ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ ఎన్. తిలక్ వర్మ: Courtesy: IPL హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మ సభ్యుడు. దేశవాలీ టోర్నీలైన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ ధరకే అమ్ముడైన ఈ యంగ్ క్రికెటర్ ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తి న్యాయం చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ లేని లోటును తిలక్ వర్మ తీరుస్తున్నాడనే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు. 33 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిసింది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌లు కలిపి 172.91 స్ట్రైక్‌రేట్‌తో 83 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ చూసిన పలువురు టీమిండియా క్రికెటర్లు.. భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయుష్ బదోని: Courtesy: IPL ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని వయసు 22 ఏళ్లు. 2018లో జరిగిన వేలంలో ఆయుష్ బదోనిని ఎవరు కొనుగోలు చేయలేదు. నాలుగేళ్ల క్రితమే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన బదోని.. ఈసారి మాత్రం లక్నో సూపర్ జెయింట్స్‌కు రూ. 20 లక్షలకే అమ్ముడుపోయాడు. తక్కువ ధరకే అమ్ముడపోయినప్పటికి బదోని మాత్రం తన టాలెంటెడ్ బ్యాటింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ బదోని ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. అప్పటికి లక్నో స్కోరు 29/4.. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో అనుభవం లేని క్రికెటర్ చేతులెత్తేస్తాడు. కానీ బదోని అలా చేయలేదు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన బదోని.. దీపక్ హుడాతో సమన్వయం కుదరడంతో యథేచ్చగా బ్యాట్‌ను ఝులిపించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది.. కానీ బదోని మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకటఉకున్నాడు. 3 ఇన్నింగ్స్‌లు కలిపి ఇప్పటివరకు 92 పరుగులు సాధించాడు. ఆయుష్ బదోని టాలెంట్ గుర్తించిన క్రెడిట్ మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కే దక్కుతుంది. ప్రస్తుతం గంభీర్ లక్నో జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. లలిత్ యాదవ్: Courtesy: IPL ఐపీఎల్లో లలిత్ యాదవ్ అడుగుపెట్టి మూడు నాలుగేళ్లు అవుతున్నప్పటికి గుర్తింపు మాత్రం గతేడాది ఐపీఎల్ సీజన్లో వచ్చింది. ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లలిత్ యాదవ్ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. మరోసారి నమ్మకముంచిన ఢిల్లీ క్యాపిటల్స్ లలిత్ యాదవ్‌ను రూ.65 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న లలిత్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 48 నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ఓ 22 బంతుల్లో 25 పరుగులు సాధించి.. ఓవరాల్‌గా రెండు మ్యాచ్‌ల్లో 73 పరుగులు సాధించాడు.