breaking news
kummaripalli
-
అమ్మా నీకు నేనున్నా..
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ తల్లికి చిన్నారి అందిస్తున్న సేవలను చూసి అక్కడున్న వారు చలించిపోయారు. ఆదిలాబాద్ జిల్లా పెద్దూరు మండలం ఎలగడపకు చెందిన రాజేందర్, జ్యోతి దంపతులు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో కూలీ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.జ్యోతి అనారోగ్యం బారిన పడటంతో రాజేందర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. రాజేందర్ వెళ్లిపోవడంతో ఆమెకు సేవలు చేసే వారు లేరు. నాలుగేళ్ల కొడుకు ఆమె దగ్గరే ఉంటూ భోజనం తినిపిస్తూ.. కాళ్లు ఒత్తుతూ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆ బాలుడిని చూసినవారు శభాష్ అని మెచ్చుకుంటున్నారు.మానవత్వం పంచుతున్న చేతులు వేములవాడలో 1,439 రోజులుగా పేదలకు అన్నదానంఫొటో చూస్తుంటే ఇది సామాజిక సేవకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. చొక్కాలు ధరించిన వ్యక్తులు రోడ్డుపై ఉన్న వృద్ధులు, అభాగ్యులకు ఫ్రీగా భోజనం (Free Meal) అందజేస్తున్నారు. పండుగలున్నా వదులుకుని రాజన్న ఆలయ పరిసరాల్లోని పేదలకు 1,439 రోజులుగా ఉచితంగా అన్నం అందజేస్తున్నారు.కరోనా సమయంలో ఏర్పడిన మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ ఓ ట్రస్టుగా ఏర్పడి విరాళాలు పోగుచేసి ఇలా నిత్యం అన్నదానం (Food Donation) చేస్తూ తమలోని సేవానిరతిని ప్రదర్శిస్తున్నారు. భోజనం పంపిణీ అనేది ఆకలితో ఉన్న నిరుపేదలకు ఉచితంగా అందించే ఒక గొప్ప కార్యక్రమం. సహాయ హృదయంతో, స్వచ్ఛందంగా ఈ సేవలో పాల్గొంటున్నట్లు సంతోషంగా చెబుతున్నారు. భోజనాలు స్వీకరిస్తున్న వారి దుస్తులు, శరీర ఆకృతులు చూస్తే వారు దైనందిన జీవన పోరాటంలో ఉన్నవారిగా చెప్పుకోకతప్పదు.ఇలాంటి కార్యక్రమం మానవత్వాన్ని, పరస్పర సహాయాన్ని, సేవా స్ఫూర్తిని పెంచుతోంది. ఆకలితో ఉన్నవారికి భోజనం ఇవ్వడం కేవలం ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు.. అది ప్రేమ, శ్రద్ధ, మానవత్వాన్ని (Humanity) పంచుకోవడం. సమాజంలో ఎవరో ఒకరు సహాయం చేయకపోతే, ఎంతో మంది ఆకలితో ఉంటారనేది నిజం. మనం చేసే చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మారుస్తుందనేది సామాజిక ధర్మం. చదవండి: అడుగంటిన మత్తడివాగు.. ఊరంతా చేపల కూరే..! -
తెలుగోళ్లమంటూ మోసం చేసిన్రు: నాయిని నర్సింహారెడ్డి
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ : తెలుగు మాట్లాడే వా ళ్లంతా ఒక్కటిగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి సీమాంధ్రులు మోసానికి పాల్పడ్డారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు డు నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. మం డల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చెప్రాసీ కొలువు ఇవ్వలేదని మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుకావాలని పొట్టి శ్రీరాములుతో ఆమరణ నిరాహార దీక్ష చేయించారన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మీద కన్నేసి తెలంగాణను విలీనం చేసుకొని మోసాలకు తెరలేపారన్నారు. సమైక్యాంధ్రలో అన్ని రకాలుగా నష్టపోయామని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిద్దిదడానికి టీఆర్ఎస్ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. 72 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 72 నియోజకవర్గాల్లో 72 లక్ష ఎకరాలకు సాగునీరందించడానికి ప్రాజెక్టులు చేపట్టే ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలన లేకుంటే తెలంగాణ పరిస్థితి అధోగతి అవుతుందన్నారు. తెలంగాణ అంశం మరుగున పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రజలను చైతన్యపరిచారని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కడితే తెలంగాణ ఏర్పాడ్డాక మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లాలో నిమ్స్ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి కరిమెల్ల బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భాస్కర్ యాదవ్, నాయకులు కొండ ప్రకాశ్‌గౌడ్, చిన్నారెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం ధర్పల్లి : పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధనే టీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాదీఖానా హాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ ప్రకటనకే కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు నిర్వహించటం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయ్యేలా నేతలు చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుది తెలంగాణపై కుక్క తోక వంటి ప్రవర్తన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవకు చీమూనెత్తురు లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వద్దే ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి, నాయకులు కిశోర్, విఠల్‌రెడ్డి, సుజావుద్దీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.