breaking news
kiran Thakur
-
Kirron Kher: గ్రేట్ కమ్ బ్యాక్ గెలుపు కిరణం.. ‘ఆమె ఫైటర్. అంతే’!
Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్ ఠాకూర్ సింగ్ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్ ఖేర్’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్‌ఖేర్ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్ ఖేర్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్ ఖేర్ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ లవ్’ ఎప్పటిలాగే చీర్‌ఫుల్ వాయిస్! చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చండీగఢ్‌కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్‌కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సెట్లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు. ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్ ఖేర్ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
10 వికెట్లూ ఒక్కడికే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ ప్లేయర్ మొత్తం 28.5 ఓవర్లు వేసి 77 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో రైల్వేస్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఠాకూర్.... ఆసీస్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. ‘అకాడమీలో రెండుసార్లు మెక్‌గ్రాత్ సర్‌తో మాట్లాడా. ఇది అదృష్టంగా భావిస్తున్నా. బౌలింగ్‌లో విలువ కట్టలేని ఎన్నో మెలకువలను నేర్పాడు. అవుట్ స్వింగర్లు వేయడం నా బలం. ఈ ఘనత అందుకున్నందుకు గర్వంగా ఉంది. అయితే మా జట్టు గెలిస్తే బాగుండేది. శుక్రవారమే ఐదు వికెట్లు తీశా. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీస్తానని మాత్రం అనుకోలేదు. 8వ వికెట్ తీసినప్పుడు దీని గురించి ఆలోచన కలిగింది. చివరకు 10వ వికెట్ తీసినప్పుడు గొప్ప అనుభూతి అనిపించింది. అంపైర్లు మ్యాచ్ బంతితో పాటు సావనీర్‌ను అందజేశారు. వీటిని భద్రంగా దాచుకుంటా’ అని కరణ్ తెలిపాడు. రైల్వేలో ఉద్యోగం న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజిలో బీఏ చదువుతున్న కరణ్.. ఇండియన్ రైల్వేస్‌లో పూర్తిస్థాయి ఉద్యోగి. ‘రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యా. కానీ దాని గురించి ఇప్పుడే ఆలోచించడం బాగుండదు. రంజీ ట్రోఫీలో ఆడటం నా కల. నేను ఆడుతున్న మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం నా కర్తవ్యం’ అని ఈ యువ బౌలర్ వ్యాఖ్యానించాడు. కరణ్ ప్రదర్శన పట్ల రైల్వేస్ చీఫ్ కోచ్ అభయ్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 79 మంది ఈ ఘనత సాధించారు. భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇన్నింగ్స్‌లో పది వికెట్ల తీశారు.