గుర్రం ఢీకొని వృద్ధుడి మృతి
ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వృద్ధుడిని గుర్రం ఢీకొనడంతో.. కింద పడి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఆర్.ఎస్ పెండేకల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజాహుస్సేన్(70) ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రోడ్డు పైకి వచ్చిన రెండు గుర్రాలు ఆయనను ఢీకొన్నాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై మృతిచెందాడు.