breaking news
jewels purchases
-
రిలయన్స్ ఆభరణాలపై తగ్గింపులు
ముంబై: రిలయన్స్ జుయల్స్ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికే కొనసాగుతున్న ‘ఆభర్’ జుయలరీ కలెక్షన్ విక్రయాల పండుగను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. చేతితో రూపొందించిన వినూత్నమైన బంగారం, వజ్రాల చెవి ఆభరణాలు ఇందులో ప్రత్యేకమని సంస్థ తెలిపింది. నూతన శ్రేణి చెవి రింగులను ఆవిష్కరించడంతోపాటు.. ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 1 వరకు చేసే కొనుగోళ్లపై ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపునిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
రూ.2 లక్షలపైన వస్తు, సేవల కొనుగోళ్లపై 1% పన్ను
న్యూఢిల్లీ: రెండు లక్షలపైన వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై ఇకపై ఒకశాతం పన్ను భారం పడనుంది. ఆభరణాలకు సంబంధించి మాత్రం ఒకశాతం పన్ను రూ.5 లక్షలపైన కొనుగోళ్లపై ఉంటుంది. అయితే బులియన్‌కు సంబంధించి మాత్రం ఒకశాతం పన్నుకు రూ.2 లక్షల పరిమితి వర్తిస్తుంది. సోర్స్ (టీసీఎస్) వద్ద అమలయ్యే ఈ ఒకశాతం పన్ను నిర్ణయం జూన్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది. పసిడి, ఆభరణాలకు సంబంధించి సోర్స్ వద్ద ఒకశాతం పన్ను 2012 జూలై 1 నుంచీ అమలవుతోందని, ఇదే పరిస్థితి ఇకముందూ అమలవుతుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. 2016-17 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై తాజా ఒకశాతం పన్ను అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆప్షన్ అమ్మకాలపై కూడా జూన్ 1 నుంచీ పెంచిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) 0.05 శాతం (0.017 శాతం నుంచి) అమలవుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది. రూ. 10 లక్షలు పైబడిన లగ్జరీ కార్ల కొనుగోళ్లపై కూడా సోర్స్ వద్ద ఒకశాతం పన్ను విధించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.