breaking news
Japan Film Festival
-
లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.ఓపెన్ హైమర్‌తో ఢీ..కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే. -
12 నుంచి జపాన్ చలనచిత్రోత్సవం
ముంబై: ఈ నెల 12వ తేదీనుంచి నగరంలో జపాన్ చలనచిత్రోత్సవం తొలి ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా జపాన్ దేశానికి చెందిన పది సినిమాలను ప్రదర్శించనున్నారు. దీంతోపాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలనుకూడా నిర్వహించనున్నారు. జపాన్-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన కె.హౌస్ ఆధ్వర్యంలో ఈ చలనచిత్రోత్సవం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్కృతి, ఆహారం, దుస్తులు, కళలు తదితరాల్లో భారత్, జపాన్ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. సినిమా అనేది ఆ దేశానికి చెందిన అన్ని కోణాలను కూడా ఆవిష్కరిస్తుంది. ఇరు దేశాల మధ్యసంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులోభాగంగానే భారత్‌లో జపాన్ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొంది.