breaking news
ITES Sector
-
ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్!
ముంబై: ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తాత్కాలిక ఉద్యోగులకు (ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్) డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 3,90,000 మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్ ఉండగా.. వీరి సంఖ్య 2030 నాటికి 9 లక్షలకు చేరుకుంటుందని కెరీర్‌నెట్ నివేదిక వెల్లడించింది. ఏటా వీరి సంఖ్య 15 శాతం చొప్పున పెరగనుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ రంగం 58 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంటే.. వీరిలో 7 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్లెక్సీ స్టాఫింగ్ పేరుతో కెరీర్‌నెట్ ఒక నివేదిక విడుదల చేసింది. నియామకాల డేటా, మార్కెట్ పరిశోధన, పరిశ్రమలో ధోరణులను విశ్లేíÙంచి ఈ వివరాలు ప్రకటించింది. ‘భారత్ ప్రపంచ ఆఫ్‌షోర్ హబ్‌గా మారుతోంది. కనుక ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరగనుంది. డిజిటల్ టెక్నాలజీలకు మళ్లడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో వేగం, ప్రత్యేకత, విస్తరణ అవసరాలకు మద్దతుగా ఫ్లెక్సీ స్టాఫింగ్ నమూనాను కంపెనీలు అనుసరిస్తున్నాయి’ అని కెరీర్‌నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలబ్ శుక్లా తెలిపారు.కెరీర్లో పురోగతికి దారి.. నిపుణులకు వృత్తిలో ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, పని–వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యాన్ని ఫ్లెక్సీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతూ.. మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ నిపుణులకు ఇవి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు బెంగళూరు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ రంగంలోని మొత్తం తాత్కాలిక సిబ్బందిలో 25 శాతం మంది ఈ నగరంలోనే ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ 15 శాతం మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు ఉపాధి కలి్పస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, చెన్నై ఒక్కోటీ 10 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ తాత్కాలిక ఉద్యోగుల సిబ్బందిలో వృద్ధి నమోదవుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలోని ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం మేర ఈ నగరాల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. నిపుణుల లభ్యతకు, తక్కువ వ్యయాలతో కూడిన వ్యాపార నమూనాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.