breaking news
Israt Jahan
-
మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్ తలాక్ పిటిషనర్
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఐదుగురిలో ఒకరైన పశ్చిమ బెంగాల్ మహిళ ఇష్రత్ జహాన్ గురువారం ఢిల్లీకి వచ్చి మోదీకి రాఖీ కట్టారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేలా చట్టాన్ని తెచ్చినందుకు ముస్లిం సోదరిల తరఫున ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. త్రివర్ణాలతో ఉన్న రాఖీని మోదీ చేతికి కట్టే అవకాశం వచ్చినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే తాను కోల్‌కతా నుంచి తెచ్చిన రసగుల్లాను భద్రతా కారణాల వల్ల మోదీకి ఇవ్వలేకపోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని హౌరాలో నివసించే ఇష్రత్ జహాన్‌కు దుబాయ్‌లోని తన భర్త 2014లో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయగా, ఆ చర్యను నేరంగా పరిగణించేలా కేంద్రం చట్టం తెచ్చింది. -
‘ఇష్రాత్’ కేసులో ఐపీఎస్‌లకు బెయిలు
డీజీ వంజర, పీపీ పాండేలకు బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు అహ్మదాబాద్: ఇష్రాత్ జహా నకిలీ ఎన్కౌంటర్ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు డీజీ వంజర, పీపీ పాండేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్‌బ్రాంచ్‌లో, ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్)లో వంజర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. చట్టాల్ని చేతుల్లోకి తీసుకుని చేసిన హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని, ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం సమాజానికి హానికరమని, కేసు విచారణను ఆయన ప్రభావితం చేయగలరని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఇష్రాత్ జహా, సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరామ్ ప్రజాపతిల నకిలీ ఎన్కౌంటర్ కేసులకు సంబంధించి డీజీ వంజర 2007 ఏప్రిల్ నుంచి.. దాదాపు గత 8 ఏళ్లుగా ఆయన జైళ్లోనే ఉన్నారు. డీజీ వంజరకు బెయిల్ మంజూరు చేస్తూ.. దేశం విడిచివెళ్లరాదని, గుజరాత్లో ఉండకూడదని, ప్రతీ శనివారం కోర్టుకు హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే, గత 18 నెలలుగా జైళ్లో ఉంటున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి పాండేకు కూడా బెయిలు మంజూరుచేసింది