breaking news
Indian Dishes
-
తడ్కా స్ప్రౌట్స్, ఎగ్ రోల్.. నిమిషాల్లో రెడీ
ఈ యేడాది క్విక్‌గా, హెల్తీగా ఉండే వంటకాలపై చాలా మంది దృష్టి పెట్టారు. ఆరోగ్యకరమైన భోజనంతో పాటు సమయాన్ని ఆదా చేయడం కూడా దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం. క్విక్ అండ్ హెల్తీ, టేస్టీగా ఉండే వంటకాల తయారీ గురించి చెఫ్ గోవర్ధన్ ఇచ్చిన రెసిపీస్‌తో వంటిల్లు (Vantillu).చాలామందిలో ఆరోగ్య స్పృహతో పాటు ఫిట్‌గా ఉండాలనే ఆలోచన కూడా పెరిగింది. వారాంతాల్లో, ప్రత్యేకమైన రోజుల్లోనూ వంటకాల వైపు దృష్టి పెడుతున్నారు. వాటిలో... అధిక ప్రోటీన్ ఉండేవి, మొక్కల ద్వారా లభించే పదార్థాలు... కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు... మొదలైనవాటిని కుండ లేదా పాన్ పైన నిమిషాల్లో తయారుచేసుకొని తినడం అనేది ట్రెండ్‌గా నడిచింది. ఇది మాంసాహార వంటకాలకూ వర్తించింది. సులభంగా తయారు చేయగల వంటకాలలో కొన్ని...తడ్కా స్ప్రౌట్స్ (Tadka sprouts)కావలసినవి: మొలకలు (పెసలు లేదా శనగలు) – కప్పు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది); పచ్చిమిర్చి – 2–3 (సన్నగా తరిగినవి); ఆవాలు – 1/2 టీస్పూన్; జీలకర్ర – 1/2 టీస్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడా.తయారీ: మొలకలను కొద్దిగా ఉప్పు వేసి కాస్త పలుకుగా ఉండేలా ఉడికించాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తాలింపులో ఉడికించిన మొలకలు, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ వంటకాన్ని సలాడ్ రూపంలో తినచ్చు. లేదా కొంచెం మసాలా వేసి, వడ లేదా రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఎగ్ రోల్ (Egg roll)కావలసినవి: చపాతీ/పరాఠా – 2–3; గుడ్లు – 2 లేదా 3; ఉల్లిపాయ – సన్నగా తరిగినది; పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి); అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్; క్యారెట్ తురుము – తగినంత; పసుపు – చిటికెడు; కారం – అర టీ స్పూన్; కొత్తిమీర – కొద్దిగా; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా; టొమాటో కెచప్, మయోనైజ్ – తగినంత.తయారీ: ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము వేసి, వేయించాలి. పసుపు, కారం, కొత్తిమీర వేసి కలపండి. ఈ మిశ్రమంలో గుడ్డు మిశ్రమాన్ని పోసి, స్పూన్‌తో వెడల్పుగా అని, ఆమ్లెట్‌లాగా సిద్ధం చేసుకోవాలి. వేడి చపాతీని ఒక ప్లేట్ లో పెట్టి, దానిపై టొమాటో కెచప్, మయోనైజ్ రాయాలి. తయారుచేసుకున్న ఆమ్లెట్ ను చపాతీ మధ్యలో పెట్టి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లాలి. చపాతీని గట్టిగా రోల్ చేసి సర్వ్ చేయాలి. -
ప్రియాంక పెట్టిన వివాహ భోజనం!
ఎవరైనా రుచికరమైన వంటకాలతో భారీ ఎత్తున విందు ఇస్తే, వెంటనే ‘మాయాబజార్’లోని ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అనే పాట గుర్తొచ్చేస్తుంది. ఇటీవల ఈ రేంజ్ విందునే ప్రియాంకా చోప్రా ఇచ్చారు. అయితే అది ఆమె వివాహ భోజనం కాదు. ఈ విందుకు వేరే కారణం ఉంది. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టాక హిందీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’కి తేదీలు కేటాయించే విషయంలో ప్రియాంక తడబడ్డారట. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ షూటింగ్ విషయంలో తానెంత ఇబ్బందిపెట్టినా చిత్రబృందం ఒక్క మాట కూడా అనకుండా సహకరించడం ప్రియాంకను కదిలించేసింది. దాంతో షూటింగ్ చివరి రోజున అందరికీ గ్రాండ్‌గా లంచ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌కి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇటాలియన్ ఫుడ్, ఇండియన్ డిషెస్, చైనీస్... ఇలా వెరైటీ డిషెస్ తయారు చేయమని సిద్ధార్థ్‌కి విన్నవించుకున్నారు. మొత్తం రెండు వందల మంది కోసం ఈ లంచ్ ఏర్పాటు చేశారు. ప్రియాంక ఇచ్చిన ఈ భారీ విందును చిత్రబృందం ఓ పట్టు పట్టారు. ‘అన్నదాతా! సుఖీభవ’ లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు కానీ, ఎంతో శ్రద్ధగా తమ కోసం లంచ్ ఏర్పాటు చేసినందుకు ప్రియాంకకు అందరూ ధన్యవాదాలే తెలిపారట. ఆనందంతో ఆవిడగారి కళ్లు చెమర్చాయట!


