breaking news
Indian customers
-
ఏఐని ఎవరెలా వాడుతున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.షాపింగ్, ఫుడ్..షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.కస్టమర్ సర్వీస్‌లో మాత్రం..రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. -
ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్
సాక్షి, ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారతీయ వినియోగదారులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అన్ని రకాల మోడళ్లపై దాదాపు 2శాతం వరకు ధరలు పెంచు తున్నట్టు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగాధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. వర్టస్, టైగన్ ,కొత్త టిగువాన్ మొదలు భారతదేశంలోని ఫోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా ధరల పెంపు అమల్లో ఉంటుందని పేర్కొంది. కొత్త ధరల జాబితాను వెల్లడించనప్పటికీ, కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో 2శాతం వరకు వరకు పెంపు ఉంటుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇక టైగన్ ఎస్యూవీ ప్రస్తుతం రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ధర పెంపు తర్వాత రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. -
తొలిసారైనా పాతకారుకు సై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు పాతదైతేనేం.. కొనేందుకు సై అంటున్నారు భారతీయ కస్టమర్లు. 2013-14లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్లు కొత్తవి 25 లక్షల యూనిట్లు అమ్ముడైతే, పాతవి సుమారు 30 లక్షలు చేతులు మారాయి. దీనినిబట్టి పాత కార్లకూ ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికర అంశమేమంటే అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో తొలిసారిగా వాహనాన్ని కొనుగోలు చేసే వారు 65 శాతం ఉంటున్నారు. ఈ రంగంలోకి పెద్దపెద్ద సంస్థలు రావడంతో బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూంలవైపు కస్టమర్లు మళ్లుతున్నారు. యువతే పెద్ద కస్టమర్లు.. పాత కార్ల మార్కెట్‌ను నడిపిస్తున్నది యువతే. కొనుగోలుదారుల్లో 75% మంది 30-35 ఏళ్ల వయసువారే. మొత్తం విక్రయాల్లో రూ.3.75-4 లక్షల ఖరీదులో లభించే మోడళ్ల వాటా సగముంది. కొత్తకారు ధరలో అంతకంటే పెద్ద మోడల్ రావడం, నెల వాయిదాల భారమూ తక్కువగా ఉండడంతో కస్టమర్లు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూముల్లో 100కు పైగా నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వాహనాలను విక్రయిస్తారు. నాణ్యతకు ఢోకా లేకపోవడంతో తృతీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్లు సైతం బ్రాండెడ్ షోరూంలలో కారు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 30 లక్షల యూనిట్లలో వ్యవస్థీకృత రంగం వాటా 20% వృద్ధితో 17% వాటా కైవసం చేసుకుంది. నగదు కొనుగోళ్లు.. అయిదేళ్ల క్రితం వరకు ఒక్కో కస్టమర్ సరాసరిగా ఆరేళ్లు కారును అట్టిపెట్టుకునే వారు. ఇప్పుడు నాలుగేళ్లకే మారుస్తున్నారు. మూడేళ్ల తర్వాత 36 నెలలకు వస్తుందని అంటోంది మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్. కొత్త మోడళ్లు, కుటుంబం పెరగడం, ఆశయాలు మారడం ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు కొత్త కార్లు 57 వేలు, పాతవి 60 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య వరసగా 15 వేలు, 16,500 ఉంది. నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 22 వేలు, ముంబైలో 10 వేలు, హైదరాబాద్‌లో 9 వేల పాత కార్లు ప్రతి నెల చేతులు మారుతున్నాయి. అమెరికాలో ఏటా 4.5 కోట్ల పాత కార్లు, 1.6 కోట్ల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. కస్టమర్ల సందేహమే.. పాత కారు పనితీరు ఎలా ఉంటుందో అన్న సందేహం సాధారణంగా అందరికీ ఉంటుంది. ఈ అంశమే బ్రాండెడ్ కంపెనీలకు కలిసి వస్తుందని అంటున్నారు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ సీఈవో నాగేంద్ర పల్లె. ఇక్కడి కొండాపూర్‌లో అధీకృత డీలర్షిప్ ఎక్స్స్పీడ్ వీల్స్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. నాణ్యతా పరీక్షలు, విక్రయానంతర సేవ, వారంటీని బ్రాండెడ్ కంపెనీలు ఇస్తాయి. దీంతో కస్టమర్లు ధీమాగా పాత కార్లను సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ వెబ్సైట్లో అన్ని మోడళ్ల వివరాలను పొందుపరుస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 380 ఔట్‌లెట్లున్నాయి. రెండేళ్లలో మరో 120 ప్రారంభించనుంది. 2013-14లో కంపెనీ తన షోరూంల ద్వారా 57 వేలు, ఆన్లైన్ బీటూబీ పోర్టల్ ఇడిగ్ ద్వారా 60 వేల యూనిట్లను విక్రయించింది. -
జియోనీ ఎస్5.5 హల్చల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతి సన్నని(స్లిమ్) స్మార్ట్‌ఫోన్ జియోనీ ఈలైఫ్ ఎస్5.5 భారత మార్కెట్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అతితక్కువ మందం 5.5 మిల్లీమీటర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదొక్కటే. దీంతో ఎప్పుడు చేతుల్లోకి వస్తుందా అని కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ తొలి లాట్లో 30 వేల పీసులను భారత్‌కు తెప్పించింది. వారం రోజుల్లో ఇవి రిటైల్ షాపుల్లోకి చేరనున్నాయి. బుకింగ్స్ ఇంత కంటే అధికంగా ఉండడంతో అదనంగా 30 వేల పీసులను కంపెనీ తెప్పిస్తోంది. రెండు నెలల్లో 70 వేల పీసులకుపైగా అమ్ముడవుతాయని జియోనీ అంచనా. ఈలైఫ్ ఎస్5.5 ధర రూ.22,999 ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ దీని విశిష్టతలు. రాష్ట్రంలో 1,000 పీసులకు పైగా బుకింగ్స్... భారతీయ కస్టమర్లు అనుభూతి కోరుకుంటున్నారని అనడానికి ఎస్5.5కు ఉన్న డిమాండ్‌ను చూస్తే అర్థమవుతోందని జియోనీ ఇండియా హెడ్ అరవింద్ ఆర్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 1,000 పీసులకుపైగా బుకింగ్స్ నమోదైనట్టు సమాచారం.