breaking news
Indian businessmen
-
ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్ ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.👉ఇదీ చదవండి: విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.Deeply shocked and saddened by the tragic #planecrash of the #AirIndia Ahmedabad-London flight during take off in Ahmedabad having 242 passengers on board. My thoughts and prayers are with all those on board and the residents in the affected area. Wishing for everyone's safety… pic.twitter.com/KjTlFfo1Bn— Parimal Nathwani (@mpparimal) June 12, 2025We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽— Gautam Adani (@gautam_adani) June 12, 2025 -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
దుబాయ్‌లో భారత వ్యాపారి హఠాన్మరణం..
దుబాయ్ : నూతన సంవత్సరంలో భార్యతో కలిసి విహారయాత్రగా దుబాయ్‌కు వెళ్లిన పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త నేమ్‌చంద్ జైన్ (61) గుండెపోటుతో తాను బసచేసిన హోటల్లోనే మరణించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మందితో కూడిన జైన్ మతస్తులతో నేమ్‌చంద్ ఈనెల2న తన భార్యతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. తాము బసచేసిన హోటల్లో ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా తీవ్ర అలసటకు లోనైన నేమ్‌చంద్ ఆ విషయం భార్యకు చెప్పగా రూంకు వెళ్లి సేదతీరుదామని ఆయనను తీసుకువెళ్లారు. హోటల్ మెట్ల వరకూ చేరిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలారు. వైద్య బృందం అక్కడికి చేరుకుని చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన మరణించారని టూర్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు సునీల్ జైన్ తెలిపారు. బుధవారం తన 62వ పుట్టిన రోజు భారత్‌లో జరుపుకోవాలని రిటన్ ఫ్లైట్ బుక్ చేసుకున్న విమానంలోనే నేమ్‌చంద్ భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తమతో పాటు ఉత్సాహంగా దుబాయ్‌లో గడిపేందుకు వచ్చిన జైన్ మృతి పట్ల బృందం సభ్యులు తీవ్రంగా కలత చెందారు. -
వీసా నిబంధనలు సడలించాలి
బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో చర్చల్లో మోదీ - భారత్‌కు రెండు కొత్త వీసా కార్యక్రమాలు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని - వీసా ప్రతిపాదనలను మెరుగుపరచడాన్ని పరిశీలిస్తామని థెరెసా హామీ - ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే వారిపై కఠిన చర్యలు న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కఠినమైన వీసా నిబంధనలు, వృత్తినిపుణులు వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితిని పెంచడంపై భారత్ సోమవారం ఆ దేశానికి తన ఆందోళనను తెలియజేసింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రధానంగా భారతీయ కార్పొరేట్ల కోసం రెండు వీసా కార్యక్రమాలను ప్రకటించారు. రిజిస్టర్డ్ ప్రయాణికుల పథకం కింద వాణిజ్య ప్రయాణికులకు బ్రిటన్ సరిహద్దులో వేగవంతమైన అనుమతులు పొందుతారని.. ఈ పథకంలో భారత్ ‘తొలి వీసా దేశం’ అవుతుందని థెరెసా పేర్కొన్నారు. రెండో పథకం కింద.. వీసా, వలస సేవ అరుున ‘గ్రేట్ క్లబ్’లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను నామినేట్ చేసే తొలి ప్రభుత్వంగా భారత ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం థెరెసా ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఢిల్లీలో ఆమెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదం, భారత్-బ్రిటన్ ఆర్థిక సంబంధాలు, నేరస్తుల అప్పగింత అంశాలతో పాటు.. వీసా నిబంధనలపై చర్చించారు. కఠినమైన విద్యార్థి వీసా నిబంధనలపై భారత్ ఆందోళనను మోదీ తెలియజేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో చదువుకునే విద్యార్థులు కోర్సు పూర్తరుున వెంటనే భారత్ తిరిగి రావాలి. దీనివల్ల బ్రిటన్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోరుుంది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2010లో 68,238 ఉండగా.. ఈ ఏడాది అది 11,864కు తగ్గాయి. అలాగే.. బ్రిటన్ వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితినీ 20,800 పౌండ్ల నుంచి 30,000 పౌండ్లకు పెంచారు. అంతకుముందు భారత్ -బ్రిటన్ సాంకేతిక సదస్సులో థెరెసా, మోదీలు పాల్గొన్నారు. యువత రాకపోకలను అధికంగా ప్రోత్సహించాలంటూ బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధనలను సడలించాలని థెరెసాను కోరారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లోనూ మోదీ ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. బ్రిటన్‌లో ‘ఉండిపోయే హక్కు లేని’ భారతీయులు తిరిగి వచ్చేసే వేగం, పరిమాణం పెరిగినట్లరుుతే భారత్‌కు వీసా ప్రతిపాదనలను ఇంకా మెరుగుపరిచే విషయాన్ని తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని థెరెసా హామీ ఇచ్చారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే విధానాన్ని, తగిన తనిఖీ ప్రక్రియ అనుసరిస్తామని భారత్ పేర్కొంది. మాల్యా, మైఖేల్‌లను అప్పగించండి... మనీ లాండరింగ్ ఆరోపణలున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ సహా భారత్ వాంటెడ్ జాబితాలో ఉన్న 60 మందిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్ను కోరింది. థెరెసా, మోదీల చర్చల సందర్భంగాఈ జాబితాను బ్రిటన్‌కు అందజేశారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద తమ కస్టడీకి అప్పగించాలని బ్రిటన్ 17 మందితో కూడిన జాబితాను భారత్‌కు అందించింది. నేరస్తులు, పరారీలో ఉన్న వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించరాదని ఇరుదేశాలు నిర్ణరుుంచారుు. ‘మండలి‘లో శాశ్వతానికి మద్దతు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. సభ్యత్వం కోసం ఐరాసతో నిరంతర సంప్రదింపులు జరపాలని తమ అధికారులకు మోదీ, థెరిసాలు సూచించారు. సులభ వాణిజ్యం, మేధోసంపత్తి హక్కులపై సహకారం పెంపునకు భారత్, బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారుు. వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనగాను రూ.107కోట్లతో సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం... ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్న మోదీతో థెరెసా గళం కలిపారు. ముంబై, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ఇద్దరూ పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. చర్చల తర్వాత ప్రకటన విడుదల చేస్తూ.. మానవాళికి ఉగ్రవాదం తీవ్ర ముప్పు అని ఉద్ఘాటించారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్‌ను పాక్ ‘అమరుడు’గా కీర్తించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులను కీర్తించొద్దన్నారు. హైదరాబాద్ హౌస్‌లో థెరెసా, మోదీ వ్యాహ్యాళి బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ పూదోటలో ప్రధాని మోదీతో కలసి వ్యాహ్యాళి చేశారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న థెరెసాను మోదీ ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ తోటలో నడుస్తూ చర్చలు కొనసాగించారు. ఇంతకుముందు గత ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీలు ఈ తోటలో నడుస్తూ మాట్లాడుకున్నారు. -
భారతీయులకు ఈజీగా బ్రిటన్ వీసా
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆ దేశాన్ని కీలక వాణిజ్య భాగస్వామిగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ అనంతరం తొలిసారి భారత్‌కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, భారత వ్యాపారులకు సులభతరమైన వీసా పాలన అందిస్తామని ప్రకటించారు. ఇండియా-యూకే టెక్ సమిట్‌లో ప్రసంగించిన థెరిస్సా, భారతీయులు ఈజీగా బ్రిటన్‌లోకి ప్రవేశించడానికి తాము ఆఫర్ చేస్తామని, రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. దీంతో యూకేను తరుచూ సందర్శించేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. బ్రిటన్, భారత్‌లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనేదే తమ అభిప్రాయమని, వ్యాపారాలకు బ్రిటన్ ఎంతో అనువైనదని థెరిస్సా చెప్పారు. సమర్థవంతమైన వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలకు కేవలం చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ మాత్రమే కాక, ఇరు దేశాల ప్రజలు కూడా అవసరమేనన్నారు. తమ దేశంలో వ్యాపారాలు కోసం ట్రావెల్ చేసేవారికి వీసా ప్రక్రియను సులభతరం చేస్తానని హామీ ఇచ్చారు.చాలామంది భారతీయులు తమ స్కిల్స్‌ను, ఐడియాలను, బిజినెస్‌లను బ్రిటన్‌కు తీసుకొస్తున్నారని, ఇది తమ దేశానికి, ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సీఐఐ నిర్వహించిన ఈ సమిట్‌లో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని వ్యాఖ్యానించిన మోదీ, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామని తెలిపారు.