breaking news
India cricketer
-
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్‌ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్‌లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్‌కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్‌లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్‌గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్‌కుమార్‌రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్‌గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్‌తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్‌ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్‌పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్‌లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్‌కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్‌లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్‌తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్‌ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్‌ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తిరుమలలో సందడి చేసిన నితీష్ కుమార్ రెడ్డి
-
తెరపైకి యువరాజ్ సింగ్ జీవితం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్... ఇలా యువరాజ్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫ్యాన్స్ కోసం నా బయోపిక్ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్ సింగ్. -
మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్‌లాక్ వీడియో వైరల్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె సెర్బియా దేశస్థురాలు అయినా భారత్‌లోనే ఉంటుంది. ఆమె ఒక డ్యాన్సర్,మోడల్,నటి. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహతో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టారు. అలా 2020 వరకు సుమారు 20కి పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ 8లో కూడా ఆమె పాల్గొన్నారు. (ఇదీ చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) నటాషా ఒక నటి కాబట్టి.. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా హాట్, బోల్డ్ చిత్రాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. వాటిని అభిమానులు కూడా చాలా ఇష్టపడతారు. ఈ సమయంలో నటాషా అనేక ఫోటోలతో పాటు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ఆమె మరోక వ్యక్తిని ముద్దులు పెట్టుకున్న సన్నివేశం ఉండటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వీడియోలో చుట్టూ చీకటిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదో ఒక పార్టీలో నటాషాతో పాటు మరోక వ్యక్తి ఉన్నారు. వారిద్దరూ కూడా చాలా చనువుగా ఉండటమే కాకుండా లిప్‌లాక్ కిస్ కూడా పెట్టుకున్నారు. ఈ వీడియోను కూడా నటాషానే షేర్ చేస్తూ.. ఇవన్నీ 'గుర్తుంచుకోవలసిన జ్ఞాపకాలు' అని క్యాప్షన్ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ..) అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఆ వీడియోకు హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ హార్దిక్ పాండ్యా స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. మీరు మరొక వ్యక్తిని ఎందకు ముద్దు పెట్టుకున్నారని నటాషాను ప్రశ్నిస్తున్నారు. మీరు చాలా హాట్ అంటూ మరోకరు తెలిపారు. కానీ నటాషా తిరిగి ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవతుంది. ఏదేమైనా టీమిండియా క్రికెట్లో హార్దిక్ పాండ్యా- నటాషా జోడీ అద్భుతంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు గాను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అజయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో విలాసవంతమైన భవనంలో నివాసముండే ఈ మాజీ క్రికెటర్.. తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో చెత్త పడేయటాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో అతనికి జరిమానాను విధించడంతో పాటు మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకున్న జడేజా జరిమానా కట్టి, మరోసారి ఈ 'చెత్త' పని చేయనని అంగీకరించాడు. ఈ విషయాన్ని నచినోలా గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ్ సర్పంచ్ మాట్లాడుతూ.. జడేజా లాంటి పాపులర్ క్రికెటర్ తమ పరిసరాల్లో ఉంటుంన్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాగా, గోవాలోని అల్డోనా గ్రామ పంచాయతీ చాలా మంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్‌గా ఉంది. అజయ్ జడేజా, అమితావ్ ఘోష్ లాంటి పలువురు ప్రముఖులు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాధిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడి, 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు సాధించాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ గుజరాత్ ఆటగాడు.. 2000లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. చదవండి: డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్.. -
నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా
కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లో తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు. -
‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’
బెంగళూరు: మానసిక ఆందోళనతో తాను తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నానని భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు అతను చెప్పాడు. ఉతప్ప టీమిండియా తరఫున 46 వన్డేలు, 13 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో జట్టులో చోటు కోల్పోయిన సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా పలు రకాల ఆలోచనలతో తాను సతమతమయ్యేవాడినని ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. ‘2009–2011 మధ్య కాలంలో నేను దాదాపు ప్రతీ రోజూ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాను. భారత జట్టులో స్థానం లభించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కానీ క్రికెట్ మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. ముఖ్యంగా క్రికెట్ జరగని రోజుల్లో నా పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు ఈ రోజు గడుస్తుందా, రేపటి వరకు ఉండగలనా అనిపించేది. అలా పరుగెత్తుకుంటూ వెళ్లి బాల్కనీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే భావన కూడా వచ్చింది. కానీ ఏదోలా అది ఆగిపోయింది.’ అని ఉతప్ప తన అనుభవాన్ని వెల్లడించాడు. -
పరుగుతో విశ్వాసం
దేశం కోసం చేసే ప్రతి పరుగు తనలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నాడు భారత్ క్రికెటర్ అజింక్యా రహానే. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో నాలుగు వందల మంది టాప్ ఫినిషర్స్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన టీ షర్ట్స్ ‘ఫినిషర్ టీ’ను నైకి అందించింది. జూబ్లీహిల్స్‌లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్‌లో భారత క్రికెటర్ అజింక్యా రహానే చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం ఈ టీ షర్ట్‌లను రన్నర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా అజింక్యా రహానే ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. మారథాన్‌లో సిటీవాసులు సత్తాచాటారని హైదరాబాదీలను పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నాడు. ‘నేను పొందే శిక్షణలో రన్నింగ్ ఎంతో కీలకం. అది నన్ను చురుగ్గా ఉంచుతుంది. హైదరాబాద్ మారథాన్‌లో ప్రతి రన్నర్ పడిన శ్రమకు, అంకితభావానికి హ్యాట్సాఫ్’ అని ప్రశంసించాడు. హైదరాబాద్ స్వీట్ సిటీ అన్న ఈ ఆటగాడు ఇక్కడి రుచులు మాత్రం స్పైసీతో టేస్టీగా ఉంటాయంటున్నాడు. ధోనీ, కోహ్లీ బెస్ట్ రన్నర్స్.. భారత క్రికెట్ జట్టులో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరుగెత్తడంలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ ముందుంటారన్నాడు. సచిన్, ద్రవిడ్ తన అభిమాన క్రికెటర్లని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో సెంచరీ చేయడం ఎంతో ఆనందానిచ్చిందన్నాడు. గంట గంటకూ మారిపోయే ఇంగ్లండ్ వాతావరణానికి తగ్గట్టు మన ఆటను మార్చుకోవాల్సి ఉంటుదని తెలిపాడు. తనను ద్రవిడ్‌తో పోల్చడం సరికాదన్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడిప్పుడే ఆటను మెరుగుపరుచుకుంటూ నిలదొక్కుకుంటున్నానని చెప్పాడు. సీనియర్ల మార్గనిర్దేశంలో యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారన్న రహానే డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగుంటుందన్నాడు.


